Evaru Meelo Koteeswarulu: మరింత బిజీ కానున్న జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో లీక్!
జూనియర్ ఎన్టీఆర్ మరో రియాలిటీ షోతో స్పెషల్ గా ఎట్రాక్ట్ చేయబోతున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా ఇప్పటికే ఒకసారి రేటింగ్స్ తో రికార్డును క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ వల్లే ఒక విధంగా బిగ్ బాస్ తెలుగులో సరైన ట్రాక్ ను సెట్ చేసుకుంది. అప్పట్లో జై లవకుశ లాంటి సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఆ షోను విజయవంతంగా పూర్తి చేశాడు.
ఇక ఇప్పుడు జెమిని టీవీలో ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ తో రాబోతున్నాడు. ఆ షోపై ప్రస్తుతం అంచనాలు ఒక రేంజ్ లో పెరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున వంటి సీనియర్లు ఇదివరకే అలాంటి గేమ్ షోను స్టార్ మా లో చేశారు. ఇక తారక్ మొదటిసారి ఆ పేరును కాస్త రివర్స్ చేసి హోస్ట్ గా వ్యవహరిస్తుండటం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక శనివారం షూటింగ్ కూడా మొదలు కాబోతోంది. సెట్స్ కు సంబంధించిన ఒక ఫొటో కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.

జూనియర్ ఎన్టీఆర్ వారం రోజుల పాటు షూటింగ్ తో బిజీగా గడపనున్నాడు. ఇక జూలై 20వ తేదీన RRR సినిమాకు సంబంధించిన లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. కేవలం ఒక పాట చిత్రకరణ మాత్రమే మిగిలి ఉంది కాబట్టి దానికి ఎక్కువగా సమయం పట్టదు. ఇక ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రామ్ ను కూడా కంటిన్యూ చేయనున్నాడు. అనంతరం కొరటాల శివ ఆచార్య పనులన్నీ ముగిస్తే ఎన్టీఆర్ 30వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ పైకి తెచ్చే అవకాశం ఉంది. మరి టీవీ ప్రోగ్రామ్ తో యంగ్ టైగర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











