Evaru Meelo Koteeswarulu Aug 23rd episode: రాంచరణ్ ఎంత గెలుచుకొన్నాడు? ఎన్టీఆర్ షో పేరేందుకు మార్చారంటే!

బుల్లితెరపై అత్యధిక ప్రేక్షకాదరణ పొందిన షోలో ఒకటైన ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో ప్రారంభ ఎపిసోడ్స్‌లోనే ఎన్టీఆర్, రాంచరణ్‌ అదరగొట్టేశారు. కర్టన్ రైజర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఎవరు మీలో కోటీశ్వరులు షోను గెస్ట్ రాంచరణ్‌తో రెండు రోజులపాటు ఎన్టీఆర్‌తో కొనసాగించారు. తొలి ఎపిసోడ్‌లో ఎనిమిది ప్రశ్నలకు సమాధానం చెప్పిన రాంచరణ్ తన ఆటను రెండో రోజు కొనసాగించారు. ఎన్టీఆర్, రాంచరణ్ మధ్య ఎన్నో అనుభూతుల మధ్య రియాలిటీ షో ఆసక్తిగా కొనసాగింది. అయితే ఈ షోలోకి రానా ఎందుకు వచ్చాడు? రాంచరణ్ ఎంత గెలుచుకొన్నాడంటే..

ఒక్క లైఫ్ లైన్ ఉపయోగించకుండా రాంచరణ్

ఒక్క లైఫ్ లైన్ ఉపయోగించకుండా రాంచరణ్

ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోలో రాంచరణ్ తన ప్రతిభకు పదునుపెట్టారు. ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే సమయంలో ఎలాంటి తడబాటు లేకుండా ముందుకు సాగిపోయాడు. ప్రశ్నల వెనుక చరిత్రను చెబుతూ సమాధానం చెప్పడం వెనుక వివరణ కూడా ఇచ్చారు. అలా 10 ప్రశ్నలకు సమాధానం చెప్పి ఈ షోను కనీసం రూ.3.20 లక్షలు గెలుచుకొనే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. దాంతో ఆట నిబంధనల ప్రకారం రాంచరణ్‌‌కు ఎన్టీఆర్‌ చెక్ రాసి సంతకం పెట్టాడు. కానీ కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం చెక్ ఇవ్వమని చెప్పారు. దాంతో చెక్‌ను ఒకసారి చూపించండి.. మీ ఆటోగ్రాఫ్ ఎలా ఉంటుందో చూడాలి అంటూ చూసి బాగుందని ప్రశంసించారు.

చెర్రీ తడబడి రానా హెల్ప్ తీసుకొని..

చెర్రీ తడబడి రానా హెల్ప్ తీసుకొని..

ఎవరు మీలో కోటీశ్వరులు షోలో 11వ ప్రశ్నకు రిస్క్ లేకపోవడంతో ధైర్యంగా సమాధానం చెప్పి రూ.6.40 లక్షలు గెలుచుకొన్నారు. ఆ తర్వాత 12వ ప్రశ్నకు చెర్రీ కాస్త తడబడ్డాడు. సమాధానం తెలియకపోవడంతో స్నేహితుడికి వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొని రానా దగ్గుబాటికి కాల్ చేశారు. 1971లో జరిగిన బంగ్లాదేశ్ వార్‌లో ఉపయోగించిన ఐఎన్ఎస్ ఘాజీ అసలు పేరు ఏమిటనే ప్రశ్నను రానా ముందుంచారు. రానా సరైన సమాధానం చెప్పడంతో ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి 12.5 లక్షలు గెలుచుకొన్నాడు. దాంతో మరో చెక్‌ను ఎన్టీఆర్ రాసిచ్చాడు.

25 లక్షలను గెలుచుకొని

25 లక్షలను గెలుచుకొని

ఆ తర్వాత 13 ప్రశ్న రాంచరణ్‌కు కష్టంగానే మారింది. సమాధానంపై సందేహం రావడంతో మరోసారి 50: 50 లైఫ్‌లైన్ ఉపయోగించారు. ఏ పాలకుడి వద్ద బూసిప్యాలెస్ యుద్ధాశ్వం ఉందనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పి రూ.25 లక్షల రూపాయలు గెలుచుకొన్నారు. దాంతో మరోసారి 25 లక్షల రూపాయల చెక్ రాసి.. రాంచరణ్‌ ఆటతీరును ప్రశంసించాడు. 50 లక్షల ప్రశ్నకు సిద్ధమవుతుండగా షో ముగిసిందనే శబ్దం (ట్యూటర్) వినిపించడంతో రాంచరణ్‌తో 25 లక్షలు సరిపెట్టుకొన్నారు.

తారక్ బెస్ట్ షో మ్యాన్ అంటూ

తారక్ బెస్ట్ షో మ్యాన్ అంటూ

సామాజిక సేవలో భాగంగా సదుద్దేశంతో రాంచరణ్ ఆడిన ఆటను ఎన్టీ రామారావు ప్రశంసించారు. 25 లక్షల చెక్‌ను మీకు ఇవ్వడం గర్వంగా ఉంది. మంచి సమాజ సేవకు ఈ మొత్తాన్ని ఇవ్వడం సంతోషంగా ఉంది. ఈ వేదిక మీద నాకు ఎన్నో ముచ్చట్లు చెప్పి కంటెస్టెంట్లకు ఎలా ఆడాలో నేర్పిన రాంచరణ్‌కు ధన్యవాదాలు అన్ని అన్నారు. దాంతో రాంచరణ్ మాట్లాడుతూ.. తారక్‌తో ఎప్పుడు సమయం దొరికినా గడపడానికి ఎప్పుడు రెడీగా ఉంటాను. అలాంటి నాకు ఈ షోలో చాలా సేపు గడపడం చాలా ఆనందంగా ఉంది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌ కోసం 25 గెలుచుకొవడానికి అవకాశం కల్పించినందుకు స్పెషల్ థ్యాంక్స్. బుల్లితెర మీద ఎన్టీఆర్ బెస్ట్ షో మ్యాన్. బుల్లితెర మీద తారక్‌తో షోలో భాగం కావడం చాలా హ్యపీగా ఉంది అంటూ ప్రశంసలతో ముంచెత్తాడు.

రామబాణంలా దూసుకెళ్దాం అంటూ

రామబాణంలా దూసుకెళ్దాం అంటూ

రాంచరణ్‌తో కర్టెన్ రైజర్ ముగిస్తూ ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు. ప్రతీ రోజు సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30 గంటలకు షో ప్రారంభం అవుతుంది. కథ మీది... కల మీది.. ఆట నాది.. పోటి మీది.. రండి గెలుద్దాం.. ఎవరు మీలో కోటీశ్వరులు.. రామరాజుతో ప్రారంభమైంది. రామబాణంలా దూసుకెళ్దాం అంటూ కర్టెన్ రైజర్‌ను ముగించాడు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
ఎవరు మీలో కోటీశ్వరులు పేరు ఎందుకు పెట్టామంటే..

ఎవరు మీలో కోటీశ్వరులు పేరు ఎందుకు పెట్టామంటే..

ఇదిలా ఉండగా, ఎన్టీఆర్ హోస్ట్‌గా ఉండక ముందు.. ఈ షో పేరు మీలో ఎవరు కోటీశ్వరుడు. అయితే షో పేరును ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ మార్చారు. అయితే ఈ షో పేరును ఎందుకు మార్చారు అనే ప్రశ్న అందర్ని వెంటాడింది. అయితే ఈ షోలో మహిళలు కూడా పాల్గొంటారు. వాళ్ల కూడా కొంత మొత్తాన్ని గెలుచుకొంటారు కాబట్టి.. వాళ్లను కోటీశ్వరుడు బాగుండదు. నాకు ఆ పదం నచ్చలేదు. ఆ పదంలో పురుష లింగం కాకుండా స్త్రీ లింగం ఉండేలా.. అందుకే కోటీశ్వరులు అంటూ పేరు మార్చాల్సి వచ్చింది అని ఎన్టీఆర్ వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X