For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Evaru Meelo Koteeswarulu Show: RRR మూడేళ్లు తీస్తే పెరగదా రాజమౌళిపై రాంచరణ్, ఎన్టీఆర్ సెటైర్లు.. షోలో రానా..

  |

  వెండితెరపై పెర్ఫార్మెన్స్, డ్యాన్సులతో హంగామా చేస్తూ ఆకట్టుకొంటున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ మరోసారి టెలివిజన్ హోస్ట్‌గా అవతారం ఎత్తారు. తాజాగా ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం తెలిసిందే. అయితే ఈ రియాలిటీ షోకు సంబంధించిన లేటేస్ట్ ఎపిసోడ్‌ ఆగస్టు 22వ తేదీన ప్రారంభమైంది. అయితే ఈ షోలో తొలి గెస్టుగా వచ్చిన మెగా పవర్ స్టార్ రాంచరణ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అయితే వారిద్దరి మధ్య ఆసక్తికరంగా జరిగిన సంభాషణ ఇప్పుడు వైరల్ అయింది. ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు సంబంధించిన తాజా ప్రోమో ఎలా ఉందంటే..

  Esther Anil : పరువాల ఆరబోతతో రెచ్చిపోయిన వెంకటేష్ చిన్న కూతురు... వామ్మో నెవర్ బిఫోర్ అంతే!

  బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా

  బిగ్‌బాస్ షోకు హోస్ట్‌గా

  గతంలో తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోకు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే ఆ షోకు అత్యంత ప్రేక్షకాదరణ లభించడమే కాకుండా అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను అందించింది. అయితే రెండో సీజన్‌కు ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరించకపోవడం తెలిసిందే. అయితే బిగ్‌బాస్‌ తెలుగు షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లి ఓ మైలురాయిని సెటప్ చేశారు.

  మూడేళ్లుగా RRR సినిమాతో

  మూడేళ్లుగా RRR సినిమాతో

  ఇక సినిమా కెరీర్ విషయానికి వస్తే.... అరవింద సమేత వీర రాఘవ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రం తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం RRR. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కరోనా కారణంగా మూడేళ్లుగా సెట్స్‌పైనే ఉంది. పలు మార్లు షూటింగులు వాయిదా పడటంతో రిలీజ్ డేట్ కూడా అలాగే వాయిదాలు పడుతూ వస్తున్నది. ఈ పరిస్థితిపై ఎవరు మీలో కోటీశ్వరులు షోలో రాంచరణ్, ఎన్టీఆర్ సరదాగా సెటైర్లు కూడా వేసుకోవడం కనిపించింది.

  SS రాజమౌళిపై సెటైర్లు

  SS రాజమౌళిపై సెటైర్లు

  ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షోకు సంబంధించిన షోలో ఎన్టీఆర్ ఆటాడిస్తుంటే. రాంచరణ్‌ నాటీగా స్పందిస్తూ కనిపించారు. అయితే ఏదో ప్రశ్నకు సమయం మించిపోతుందని ఎన్టీఆర్ అంటే.. మూడేళ్లుగా RRRలో నటిస్తున్నాం. మనం సమయం గురించి ఆలోచించాలా అంటూ రాంచరణ్ అంటే.. అబ్బో అంటూ ఎన్టీఆర్ నవ్వుల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా జక్కన (రాజమౌళి)పై సెటైర్లు కూడా వేసినట్టు కూడా కనిపించింది.

  జుత్తు పెరగదా జక్కన్న అంటూ రాంచరణ్

  జుత్తు పెరగదా జక్కన్న అంటూ రాంచరణ్

  రాంచరణ్ RRR మూవీ ప్రస్తావన ఎత్తగానే ఎన్టీఆర్ స్పందిస్తూ...ఏంటీ ఈ రోజు జుట్టు పెద్దగా ఉంది? జుట్టు ఇంత తక్కువగా ఉంది? అంటూ జక్కన్న ప్రశ్నించారనే విషయాన్ని ఎన్టీఆర్ గుర్తు చేయగానే.. రాంచరణ్ ఫన్నీగా స్పందిస్తూ.. మూడు సంవత్సరాలు షూటింగ్ చేస్తే జట్టు పెరగకుండా ఉంటుందా? జక్కన అని కామెంట్ విసిరితే... అవదా మరి అంటూ ఎన్టీఆర్ కూడా వంత పాడారు.

  ఎన్టీఆర్ షోలో రానా దగ్గుబాటి...

  ఇక రియాలిటీ షో గేమ్ కొనసాగుతుండగానే.. మధ్యలో రానా దగ్గుబాటిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎన్టీఆర్ షోలోకి పిలిచాడు. రానాను బావా ఎక్కడ అంటూ ఎన్టీఆర్ అనగానే.. రానా.. రానా అంటూ రాంచరణ్ ఎదో మాట్లాడపోయే సరికి.. ఎన్టీఆర్ చిలిపిగా మిస్టర్ గెస్ట్.. హోస్ట్ నేను. నువ్వు గెస్ట్‌వు అనే విషయాన్ని గుర్తుపెట్టుకో అన్నట్టు అన్నారు.

  మళ్లీ రానాతో ఏదో మాట్లాడబోగా.. బాబు నువ్వు కాస్త ఆగు అంటూ ఎన్టీఆర్ అంటూ రానాపై సెటైర్లు వేశారు. 1970లో పుట్టావా బాబు అని ఎన్టీఆర్ అనగానే రాంచరణ్ నవ్వుల్లో మునిగిపోయాడు. ఈ షోకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ సోమవారం అంటే 23 ఆగస్టు 2022 తేదీన రాత్రి 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రసారం కానున్నది.

  English summary
  Evaru Meelo Koteeswarulu Show started on August 22nd. Ram Charan and NTR satires on SS Rajamouli and Rana Daggubati in Episode number 2.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X