For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Show September 7th Episode:ఎన్టీఆర్ షోలో రూ. 25 లక్షల ప్రశ్నకు చెప్పలేక టీచర్ క్విట్.జవాబు చెప్పగలరా

  |

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోలో సోమవారం నాటి రోల్ ఓవర్ కంటెస్టెంట్ టెక్కలికి చెందిన ఉపాధ్యాయుడు సింహాచలం ఆటను మొదలుపెట్టారు. ఆ తర్వాత కీలక దశకు చేరుకొని గేమ్ నుంచి తప్పుకున్నారు. సింహాచలం ఎంత గెలుచుకొన్నారు? ఏ ప్రశ్నకు సమాధానం చెప్పలేక క్విట్ అయ్యారు. ఆయన స్థానంలో వచ్చిన కరీంనగర్‌కు చెందిన ఔత్సాహిక టీచర్ మమత ఎంత గెలుచుకొన్నదనే విషయంలోకి వెళ్తే...

  25 లక్షల రూపాయల కోసం

  25 లక్షల రూపాయల కోసం

  ఒక దేశం పిల్లలు ఏనుగు కావాలని లేఖలు రాస్తే, జవహార్‌లాల్ నెహ్రూ 1949లో ఏ దేశానికి ఇందిరా అనే ఏనుగును బహుకరించారు?
  a) సోవియట్ రష్యా
  b) జపాన్
  c) ఫ్రాన్స్,
  d) యుగోస్లోవియా

  పై ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడం వల్ల సింహాచలం తన చివరి లైఫ్‌లైన్ 50:50 ఆప్షన్‌ను ఉపయోగించుకొన్నారు. అయితే జపాన్, ఫ్రాన్స్ మిగిలి ఉండటంతో సమాధానం చెప్పలేక గేమ్ నుంచి క్విట్ అయ్యారు. ఆయన 1250000 గెలుచుకొన్నారు.

  Answer: జపాన్

  రూ.1000 కోసం ప్రశ్న

  రూ.1000 కోసం ప్రశ్న

  టెక్కలికి చెందిన సింహాచలం సమాధానం చెప్పలేక గేమ్ నుంచి క్విట్ కావడంతో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ ఆటను కంటెస్టెంట్లతో ఆడించారు. ఈ టాస్క్‌లో కరీంనగర్‌కు చెందిన మమత వేగంగా సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు.

  1. వీటిలో సాధారణంగా గోరింటాకును ఏ భాగానికి వేటికి పెట్టుకోరు
  a) నాలుక
  b) పాదాలు
  c) చేతులు
  d) జుట్టు

  Answer: నాలుక

  రూ.2000 కోసం ప్రశ్న

  రూ.2000 కోసం ప్రశ్న

  2. సాధారణంగా ప్రేమించే వారికి ఇచ్చే కానుక ఏది
  a) గ్రీన్ కార్డు
  b) రెడ్ రోజ్
  c) బ్లాక్ బాక్స్
  d) బ్లూ ప్రింట్

  Answer: రెడ్ రోజ్

  రూ.3000 కోసం ప్రశ్న

  రూ.3000 కోసం ప్రశ్న

  3. వీటిలో బంగారం అనే అర్ధం రాని పదం ఏది
  a) స్వర్ణం
  b) పసిడి
  c) కనకం
  d) రజతం

  Answer: రజతం

  రూ.5000 కోసం ప్రశ్న

  రూ.5000 కోసం ప్రశ్న

  4. చక్రకేళి అనేది వీటిలో దేనిలో ఒక రకం?
  a) అరటి
  b) మామిడి
  c) ద్రాక్ష
  d) యాపిల్

  Answer: అరటి

  రూ.10000 కోసం ప్రశ్న

  రూ.10000 కోసం ప్రశ్న

  5. వీటిలో కోర్టు మధ్యలో నెట్ కట్టి ఆడే ఆట ఏది?
  a) హాకీ
  b) కబడ్డీ
  c) ఫుట్‌బాల్
  d) బాడ్మింటన్

  Answer: బాడ్మింటన్

  రూ.20000 కోసం ప్రశ్న

  రూ.20000 కోసం ప్రశ్న

  6. ఈ చిత్రంలోని చిహ్నంలో కనిపించే కట్టడం ఏది?
  a) కాకతీయ కళాతోరణం
  b) మెదక్ కోట
  c) గేట్ వే ఆఫ్ ఇండియా
  d) గోల్కోండ కోట

  Answer: కాకతీయ కళాతోరణం

  పై ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత అన్నయ్య అనొచ్చా అని అడిగితే.. తప్పకుండా.. అందుకు పర్మిషన్స్ ఏమి లేవు. అన్నయ్య అని పిలువవచ్చు అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో నాకు రాఖీ సినిమా అంటే చాలా ఇష్టం. ఆ సినిమాను కర్చిఫ్ పక్కన పెట్టుకొని చూస్తాను అని మమత అంటే.. నాకు కూడా చాలా ఇష్టమైన సినిమా అని ఎన్టీఆర్ చెప్పారు. కృష్ణవంశీ గారు ఈ సినిమాకు దర్శకులు అని సమాచారం ఇచ్చారు.

  రూ.40000 కోసం ప్రశ్న

  రూ.40000 కోసం ప్రశ్న

  7. వీటిలో కర్ణిక, జఠరిక, మరియు బృహర్దమని అనే బాగాలఉ ఉండే అవయవం ఏది?
  a) మెదడు
  b) గుండె
  c) కళ్లు
  d) కాలేయం

  Answer: గుండె

  పై ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత అన్నయ్య అంటూ.. మీకు ఎంత పెద్ద డైలాగ్ అయినా చాలా సులభంగా ఎలా సమాధానం చెబుతారు? మీ ఎనర్జీ రహస్యం ఏమిటి? అంటే.. నేను పాత్రకు సరెండర్ అయిపోతాను. నాకు ఏమీ తెలియదని అనుకొంటాను. అదే నన్ను ఇంతటి వాడిని చేసింది అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో మీ మాటలను నేను స్పూర్తిగా తీసుకొంటాను అని మమత చెప్పారు.

  రూ.80000 కోసం ప్రశ్న

  రూ.80000 కోసం ప్రశ్న

  8. తెలంగాణలో రబీ పంట కాలాన్ని ఏమంటారు?
  a) సంపంగి
  b) సారంగి
  c) యాసంగి
  d) నల్లంగి

  Answer: యాసంగి

  రూ.160000 కోసం ప్రశ్న

  రూ.160000 కోసం ప్రశ్న

  9. ఎక్కువ కాలం పనిచేసిన కాంగ్రేసేతర భారత ప్రధానమంత్రి ఎవరు?
  a) అటల్ బీహారి వాజ్‌పేయ్
  b) నరేంద్రమోదీ
  c) మొరార్జీ దేశాయ్
  d) వీపి సింగ్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో 50:50 ఆప్షన్ ఉపయోగించుకొన్నారు. దాంతో స్క్రీన్ పై నరేంద్రమోదీ, వీపీ సింగ్ మిగిలారు. అయినా సమాధానం తెలియకపోవడంత వీడియో కాల్ ఆప్షన్ ఉపయోగించుకొన్నది. దాంతో తన గురువుకు ఫోన్ చేయడంతో ఆయన కూడా సరిగా సమాధానం చెప్పలేకపోయారు. కానీ ఆమె రిస్క్ తీసుకొని నరేంద్రమోదీ అని చెప్పారు. సమాధానం కరెక్ట్ కావడంతో ఆమె 160000 గెలుచుకొన్నారు.

  Answer: నరేంద్ర మోదీ

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  రూ. 320000 కోసం ప్రశ్న

  రూ. 320000 కోసం ప్రశ్న

  10. బ్రిటీష్ ఏ రెండు దేశాల మధ్య డ్యురాండ్ లైన్ అనే సరిహద్దు రేఖ గీసింది?
  a) ఇండియా- చైనా
  b) ఇండియా- మయన్మార్
  c) అఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్
  d) సిక్కిం-నేపాల్

  పై ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోవడంతో మమతా గేమ్ నుంచి క్విట్ కావాలని నిర్ణయించుకొన్నది. మమత నిర్ణయాన్ని గౌరవిస్తూ.ఎన్టీఆర్ సరే అనడంతో ఆమె 160000 రూపాయలు గెలుచుకొని గేమ్ నుంచి బయటకు వచ్చారు.

  Answer: అఫ్ఘనిస్థాన్ - పాకిస్థాన్

  English summary
  Evaru Meelo Koteeswarulu Show September 7th Episode: Simhachalam of Tekkali of Chittor, Karim Nagar's Mamatha has participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X