For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  NTR's EMK Sept 8th Show: ఎన్టీఆర్ షోలో తప్పుడు జవాబు.. వీరాభిమాని భారీ మూల్యం, ఆ ప్రశ్నకు జవాబు చెప్పగలరా?

  |

  జూనియర్ ఎన్టీఆర్ నిర్వహిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో సెప్టెంబర్ 8వ తేదీన అత్యంత ఆసక్తిగా సాగింది. గద్వాల్‌కు చెందిన గోపినాథ్ అనే టీచర్ హాట్ సీట్‌పైకి వచ్చారు. అయితే ఎలాంటి తడబాటు లేకుండా చకచకా ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అయితే భారీగా డబ్బు సంపాదించుకొన్న తర్వాత తప్పుడు సమాధానం చెప్పి ఆయన కిందకు పడిపోయాడు. ఆయన ఏ ప్రశ్నకు తప్పుడు సమాధానం చెప్పారో తెలుసా?

  తొలి ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  తొలి ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..

  ఫస్టాస్ట్ ఫింగర్ ఫస్ట్ ప్రశ్న ఇదే..
  ఈ ఆయుధాలను, అవి కనిపెట్టిన కాలక్రమంలో అమర్చండి
  A) విల్లు మరియు బాణం
  B) ఏకే-47
  C) ఫిరంగి
  D) అగ్ని V మిస్సైల్

  Answer: A, C, B, D

  పై ప్రశ్నకు గద్వాల్‌కు చెందిన గోపినాథ్ 4.6 సెకన్లలో సరైన సమాధానం చెప్పడంతో హాట్ సీట్‌పైకి వచ్చే అవకాశం దక్కింది. తాను స్వర్గీయ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అని చెప్పుకొన్నాడు. చాలా జోష్‌గా గేమ్‌ను మొదలుపెట్టారు.

  రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.1000 కోసం ఫస్ట్ ప్రశ్న

  1. వీటిలో మంచిని కోరడం అని అర్ధం వచ్చేది ఏది?
  a) శుభాకాంక్షలు
  b) పరామర్శలు
  c) విడాకులు
  d) విమర్శలు

  Answer: శుభాకాంక్షలు

  రూ.2000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.2000 కోసం ఫస్ట్ ప్రశ్న

  2. వీటిలో అనేక చెక్క పోరలు చేసి చెక్కబొోర్డు ఏమంటారు.
  a) బాలీవుడ్
  b) ప్లైవుడ్
  c) టాలీవుడ్
  d) కోలీవుడ్


  Answer: ప్లైవుడ్

  రూ.3000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.3000 కోసం ఫస్ట్ ప్రశ్న

  3. సాధారణంగా వైద్య నిపుణులు మణికట్టును పట్టుకొని దేనిని పరీక్షిస్తారు.
  a) శరీరంలోని కొవ్వు
  b) బ్లడ్ షుగర్
  c) నాడి వేగం
  d) బరువు

  Answer: నాడి వేగం

  రూ.5000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.5000 కోసం ఫస్ట్ ప్రశ్న

  4. సాధారణంగా ఏ పదార్థాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయాల్సిన అవసరం లేదు.
  a) ఐస్ క్రీమ్
  b) టామాటోలు
  c) తేనె
  d) వెన్న

  Answer: తేనె

  రూ.10000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.10000 కోసం ఫస్ట్ ప్రశ్న

  5. హిందు పురాణాల ప్రకారం యముడు వాహనం ఏది?
  a) దున్నపోతు
  b) నెమలి
  c) పులి
  d) కాకి

  Answer: దున్నపోతు

  రూ.20000 కోసం ప్రశ్న

  రూ.20000 కోసం ప్రశ్న

  7. ఈ వీడియో క్లిప్‌లోని సన్నివేశం ఏ చిత్రంలోనిది?
  a) మన దేశం
  b) ఆలీబాబా 40 దొంగలు
  c) అడవి రాముడు
  d) గోపాలుడు భూపాలుడు

  Answer: ఆలీబాబా 40 దొంగలు

   రూ.40000 కోసం ఫస్ట్ ప్రశ్న

  రూ.40000 కోసం ఫస్ట్ ప్రశ్న

  8. వీటిలో, వీణలకు ప్రసిద్ది చెందిన ప్రదేశం ఏది?
  a) చిత్తూరు
  b) బత్తిలి
  c) ఏలూరు
  d) బొబ్బిలి

  Answer: బొబ్బిలి

  రూ.80000 కోసం ప్రశ్న

  రూ.80000 కోసం ప్రశ్న

  9. ఆగస్టు 2021, రెండు వ్యక్తిగత ఒలంపిక్ పతకాలు సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు?
  a) పీవీ సింధు
  b) సైనా నెహ్వాల్
  c) మీరాభాయి ఛాను
  d) మేరి కోమ్

  Answer: పీవీ సింధు

  రూ.160000 కోసం ప్రశ్న

  రూ.160000 కోసం ప్రశ్న

  10. తెలంగాణలో విస్తీర్ణం ప్రకారం అతిపెద్ద జిల్లా ఏది?
  a) మహబూబాబాద్
  b) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
  c)నిర్మల్
  d) నాగర్ కర్నూల్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో గోపినాథ్ గారు.. ఆడియెన్స్ పోల్ ఆప్షన్ ఎంచుకొన్నారు. అత్యధికంగా ఆడియెన్స్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని జవాబు ఇవ్వడంతో ఆయన కూడా అదే ఆప్షన్ చెప్పి కరెక్ట్ సమాధానం రాబట్టారు.

  Answer: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

  రూ.320000 కోసం ప్రశ్న

  రూ.320000 కోసం ప్రశ్న

  11. ఫిబ్రవరి 2021లో ఏ భారతదేశ సరిహద్దు దేశ ప్రభుత్వాన్ని సైన్యం పడగొట్టింది?
  a) మయన్మార్
  b) భూటాన్
  c) నేపాల్
  d) శ్రీ లంక

  Answer: మయన్మార్

  రూ.640000 కోసం ప్రశ్న

  రూ.640000 కోసం ప్రశ్న

  12. వీటిలో దేని రూపకల్పనలో ఉస్తాద్ ఇసా మరియు ఇసా ముహమ్మద్ ఎఫెండి కీలక పాత్ర పోషించారని ప్రతీతి
  a) గోల్ గుంబజ్
  b) చార్మినార్
  c) కుతుబ్ మినార్
  d) తాజ్ మహల్

  పై ప్రశ్నకు సమాధానం తెలియకపోవడంతో వీడియో కాల్ ఆప్షన్ ఎంచుకొన్నారు. తన స్నేహితుడికి కాల్ చేయడంతో ఆయన తాజ్ మహల్ అని సమాధానం చెప్పాడు. తన స్నేహితుడు చెప్పిన విషయాన్ని నమ్మిన గోపినాథ్.. అదే జవాబును లాక్ చేశాడు. ఆ సమాధానం సరియైనది కావడంతో 640000 గెలచుకొన్నారు.

  Answer: తాజ్ మహల్

  రూ.1250000 కోసం ప్రశ్న

  రూ.1250000 కోసం ప్రశ్న

  13. వీటిలో దేని పేరు ఒక వ్యక్తి నుంచి వచ్చింది?
  a) కెఫిన్
  b) నికోటిన్
  c) కిరోసిన్
  d) వ్యాస్లీన్

  ఈ ప్రశ్నకు సమాధానం తెలియక తడబాటుకు గురయ్యారు. ఓ దశలో సమాధానం చెప్పిన ఆయన .. తన మనసు మార్చుకొని 50:50 ఆప్షన్‌ను ఎంచుకొన్నారు. దాంతో స్క్రీన్ పై నికోటిన్, వ్యాస్లీన్ సమాధానాలు మిగిలాయి. దాంతో ఆయన వ్యాస్లీన్ సమాధానం చెప్పి లాక్ చేశారు. దాంతో ఆయన సమాధానం తప్పు కావడంతో ఆయన 320000 రూపాయలు తీసుకొని గేమ్ నుంచి నిష్క్రమించారు.

  Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
  రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

  రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్

  ఆ తర్వాత తదుపరి హాట్ సీట్ కంటెస్టెంట్ కోసం ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ నిర్వహించారు.
  సెప్టెంబర్ 8వ తేదీన నిర్వహించిన రెండో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్‌లో
  వీటిని, వాటి వ్యవధి ప్రకారంగా తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి

  A) నిమిషం
  B) రోజు
  C) గంట
  D) క్షణం

  Answer: D A C B

  ఈ పోటీలో జాహ్నవి 4.442 సెకన్లలో సమాధానం చెప్పి హాట్ సీట్‌పైకి వచ్చారు. తాను హాట్ సీట్‌పైకి అవకాశం దక్కడంతో జాహ్నవి ఎమోషనల్ అయ్యారు. కంటతడి పెట్టుకొన్నారు. దాంతో ఎన్టీఆర్ గ్లాసు మంచి నీళ్లు ఇచ్చారు. ప్రశ్న అడిగే ముందు శంఖం మోగడంతో ఈ రోజు ఆట ముగిసింది. జాహ్నవి రోల్ ఓవర్ కంటెస్టెంట్‌గా 9వ తేదీన ఆట ఆడనున్నారు.

  English summary
  Evaru Meelo Koteeswarulu Show September 8th Episode: Gopinath of Gadwal, Karim Nagar's Mamatha has participated in this show. Here is the questions and Answers.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X