twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR' EMK show: తప్పులను ఎత్తి చూపిన రాజమౌళి.. ఎన్టీఆర్ ఎలా చిరాకుపడ్డారంటే!

    |

    బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో హోస్ట్‌గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూసుకెళ్తున్నారు. అత్యంత క్రేజీగా, మంచి రేటింగ్‌ను సొంతం చేసుకొన్న ఈ షోకు తెలుగు సినిమా రంగంలో అపజయం ఎరుగని దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ స్పెషల్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ను చిలిపిగా అల్లరి పెడుతూ.. ఆటపట్టిస్తూ దర్శక ధీరుడు రాజమౌళి కనిపించారు. అయితే ఈ షోలో ఎన్టీఆర్‌ను రకరకాలుగా విసిగించడమే కాకుండా కొన్ని తప్పులను రాజమౌళి ఎత్తి చూపారు. ఈ షోలో కొరటాల, రాజమౌళి, ఎన్టీఆర్ మధ్య జరిగిన విశేషాలు, మాటా మంతి తెలుసుకొందాం..

    జక్కన్నను ఉడికించిన ఎన్టీఆర్

    జక్కన్నను ఉడికించిన ఎన్టీఆర్

    రామాయణంలో అశోకవనం ఎక్కడ కనిపిస్తుంది అనే ప్రశ్నకు రాజమౌళి, కొరటాల శివ లంకలో అని కరెక్ట్‌గా సమాధానం చెప్పారు. అయితే లంకలోని అశోకవనంలో ఉండే చెట్టుపేరు ఏమిటి అని ఎన్టీఆర్ ప్రశ్నించాడు. అయితే సాధారణంగా అశోకవనంలో అశోకా చెట్లు ఉంటాయి కదా.. అని రాజమౌళి అంటే.. అవును ఉంటాయి. కానీ అశోకవనంలో మరో చెట్టుకూడా ఉంటుంది అని ఎన్టీఆర్ అన్నారు. దాంతో రాజమౌళి ఆలోచనల్లో పడ్డారు. అయితే జక్కన్నకు తెలియని ప్రశ్న, సమాధానం ఉంది అంటూ ఎన్టీఆర్ అన్నారు. మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడుగాల్సింది అంటూ జక్కన్నను ఎన్టీఆర్ ఉడికించారు. ఆ తర్వాత రావి చెట్టు అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

    రాజమౌళి టార్చర్ పెట్టారంటూ ఎన్టీఆర్

    రాజమౌళి టార్చర్ పెట్టారంటూ ఎన్టీఆర్

    కొరటాల శివ, ఎస్ఎస్ రాజమౌళి‌తో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. మీరు షూటింగులో మమల్ని చాలా టార్చర్ పెడుతారు. ఇప్పుడు నా ముందు మీరు దొరికిపోయారు. ఇక మిమ్మల్ని టార్చర్ పెడుతాను చూడండి అంటూ ఎన్టీఆర్ అంటే.. అందుకే ఈ షోకు పిలిచారా అంటూ ఎస్ఎస్ రాజమౌళి సెటైర్ వేశారు. అంతేకాకుండా ఇంకా RRR షూటింగ్ పూర్తి కాలేదు. ఆ వ్యవహారం షూట్ చేయాల్సి ఉంది అంటూ రాజమౌళి హింట్ ఇచ్చారు. అయితే ఉక్రేయిన్‌కు మళ్లీ తీసుకెళ్లండి అంటూ రాజమౌళికి కొరటాల చెప్పడంతో అబ్బో ఉక్రెయినా అంటూ ఎన్టీఆర్ అరిచేశాడు. ఉక్రేయిన్‌లో మమల్ని పెట్టిన టార్చర్ మీరు తెరపైన చూస్తారు అని అంటే... తెర మీద టార్చర్ కనిపించదుగా అని రాజమౌళి మరో సెటైర్ వేశారు. అయితే RRR షూటింగ్ అయిపోతే ఏంది? వచ్చే నెల నుంచి నా షూటింగ్ మొదలవుతుంది కదా.. అప్పుడు చూసుకొంటాను అంటూ ఎన్టీఆర్‌ను కొరటాల శివ బెదిరించారు.

    ఆరాధన సినిమా గురించి ప్రశ్న

    ఆరాధన సినిమా గురించి ప్రశ్న

    ఒక పాటను వినిపించి.. ఆ పాటను ఎవరు పాడారో అని గుర్తించండి అంటూ సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఓ చిత్రంలోని పాటను వినిపించారు. అయితే ఆ పాటను పడింది ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు నచ్చిన మహ్మద్ రఫి పాడింది అని చెప్పారు. అయితే ఆ పాట ఏ సినిమాలోనిది అని అడిగితే.. రాజమౌళి చెప్పలేకపోయారు. అయితే మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలను అడిగితే బాగుండు.. అని ఇంతకు ఆ పాట ఏ సినిమాలోని అంటూ అడిగాడు. అయితే సమాధానం చెప్పలేకపోవడంతో ఆ సినిమా పేరుతో మూడు సినిమాలు వచ్చాయి అని హింట్ ఇస్తే.. కొరటాల శివ మిస్సమ్మ అంటూ సమాధానం చెబితే.. అబ్బో అని ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. ఆ సినిమా ఆరాధన అంటూ ఎన్టీఆర్ సమాధానం చెప్పారు.

    చిన్నదేవి కాదు.. చెన్నాదేవి అంటూ రాజమౌళి..

    చిన్నదేవి కాదు.. చెన్నాదేవి అంటూ రాజమౌళి..

    ఇక షోలో భాగంగా.. 'చిన్నదేవి మరియు తిరుమలదేవి వీరిలో ఏ పాలకుని యొక్క రాణులు అంటూ ప్రశ్న వచ్చింది. ఆ ప్రశ్నను చూడగానే రాజమౌళి ముఖంలో చిరనవ్వు కనిపించింది. అయితే ఆప్షన్లు ఇవ్వకుండానే సమాధానం చెప్పేస్తారా అంటూ ఎన్టీఆర్ అడిగారు. అయితే అవును అన్నట్టు రాజమౌళి తల ఊపారు. ఆ ప్రశ్నకు కృష్ణదేవరాయలు అని సమాధానం చెప్పారు.

    అయితే ఆ ప్రశ్నలో తప్పు ఉందని రాజమౌళి చెప్పారు. చిన్నదేవి కాదు.. చెన్నదేవి అని రాజమౌళి అంటే.. మీ ఇద్దరు ఎందుకు గుసగుసలు పెట్టుకొంటారు.. నేను ఉన్నాను కదా.. అంటూ అన్నారు. అంతేకాకుండా మా గురువు గారిని కూడా కరెక్ట్ చేస్తున్నారు అని ఎన్టీఆర్ అంటే.. ఆ సమయంలో చిన్నదేవి అని పేరు పెట్టలేదు.. అసలు పేరు చెన్నాదేవి అని రాజమౌళి అన్నారు. దాంతో ఏంటి మీ కాన్ఫిడెన్స్.. మీకు తెలిసే సమాధానమా అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారు.

    మీకు టైమ్ గురించి టెన్షన్ ఉందా?

    మీకు టైమ్ గురించి టెన్షన్ ఉందా?

    మీలో ఎవరు కోటీశ్వరులు షోలో మరో ప్రశ్నను వేస్తూ.. గయోపాఖ్యానం, గణపతి పుస్తకాలను రాసిందెవరూ అనే ప్రశ్నకు చిలకమర్తి లక్ష్మీనరసింహం అనితాపీగా సమాధానం చెప్పడంపై ఎన్టీఆర్ స్పందిస్తూ.. మీకు టైమ్ గురించి పట్టింపు లేదా అని ఎన్టీఆర్ అంటే.. మీరు టెన్షన్ పెట్టడం వల్లే మేము సమాధానం చెప్పడానికి, టైమ్ అయిపోతుందనే టెన్షన్ పడుతున్నాం అని రాజమౌళి సమాధానం చెప్పారు.

    దాంతో కంటెస్టెంట్లకు టెన్షన్ పెట్టడంలో నేను పీక్స్ అంటూ తనకు తాను ఎన్టీఆర్ సమర్ధించుకొన్నారు. అందుకే మేము టైమ్ విషయంలో టెన్షన్ పడుతున్నాను అని రాజమౌళి అంటే.. మీకు టైమ్ గురించి ఏనాడైనా టెన్షన్ పడ్డారా? అంటూ సినిమాలను ఏళ్లకు ఏళ్లుగా సినిమాలు తీస్తుంటారుగా అన్నట్టు ఎన్టీఆర్ సెటైర్ వేశారు. దాంతో నాకు ఆ టెన్షన్ ఉంటుంది అంటూ రాజమౌళి అంటే.. ఏంటీ సార్.. సర్.. సర్.. సర్ అంటూ ఎద్దేవా చేశారు.

    Recommended Video

    Bigg Boss Telugu Season 5 Update : Jr NTR టీవి షో కూడా అప్పుడే ! || Filmibeat Telugu
    అంతరిక్షంలోకి వెళ్లిన శ్రీమంతుడు ఎవరు?

    అంతరిక్షంలోకి వెళ్లిన శ్రీమంతుడు ఎవరు?

    రూ. 320000 కోసం.. జూలై 2021లో బ్లూ ఆరిజన్ అనే తన సంస్థ నిర్మించిన అంతరిక్ష నౌకలో అంతరిక్షానికి వెళ్లిన శ్రీమంతుడు ఎవరు అనే ప్రశ్నను స్క్రీన్ పై వేయగానే.. కొరటాల శివ, రాజమౌళి గుసగుసలు పెట్టుకొన్నారు. దాంతో ఎన్టీఆర్ చిరాకు పడుతూ.. నేను ఇంకా ఆప్షన్లు ఇవ్వకముందే.. మీరు గుసగుసల పెట్టుకోవడం బాగాలేదు అంటూ ఎన్టీఆర్ అంటే.. మేము లైఫ్ లైన్ ఉపయోగించుకొందామని అనుకొంటున్నాం అని రాజమౌళి సమాధానం ఇచ్చారు.

    అయితే ఆప్షన్లు ఇస్తే లైఫ్ లైన్ గురించి ఆలోచించాలి. కానీ ఇవ్వకముందే ఎలా అలా చేస్తారు అంటూ ఎన్టీఆర్ ఫైర్ అయినట్టు నటించారు. అంతేకాకుండా ఆ ప్రశ్నను రద్దు చేయాలని గురువు గారి సిఫారసు చేయడంతో ఆ ప్రశ్నను తీసేశారు. దాంతో ఆ ప్రశ్నను ఎలా తీసేస్తారు అంటూ ఇద్దరు గొడవపడ్డారు. అయితే చివరకు ఆ ప్రశ్నను తిరిగి తీసుకొచ్చారు. ఇలా పలు మార్లు రాజమౌళి, కొరటాల శివకు డిసిప్లేన్ లేదంటూ వార్నింగ్ ఇస్తూ షోను ఎన్టీఆర్ రక్తికట్టించారు.

    English summary
    NTR's Evaru Meelo Koteeswarulu Show September 20th Episode: Koratala Siva and SS Rajamouli participated in the NTR's Show and won Rs.2500000
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X