మణికంఠకు ఓట్లు వేయకండి.. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్

Bigg Boss Telugu 8: బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8. ఈ సీజన్ ప్రారంభం నుండే అదిరిపోయే షాకింగ్ ట్విస్టులు ఇస్తున్నారు. కంటెస్టెంట్లకు కూడా దిమ్మతిరిగేలా టాస్కులు ఇస్తున్నారు. నిజంగా గత సీజన్లతో పోల్చితే.. ఈ సీజన్ కాస్త భిన్నంగా ఉందనే చెప్పాలి. సాధారణంగా నామినేషన్ల ప్రక్రియ అంటే.. గొడవలు, ఆరోపణలు, రెచ్చిపోయే కామెంట్స్ ఉంటాయి. కానీ సీజన్ లో మాత్రం ఎమోషనల్ ప్లాష్ బ్యాక్ స్టోరీస్ తో బీబీ లవర్స్ ను కంటతడి పెట్టిస్తున్నారు. ఈ కంటెస్టెంట్ ఎవరో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. ఈ కంటెస్టెంట్ పై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ సోర్టీ ఏంటో? ఆ షాకింగ్ కామెంట్స్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

ఆ కంటెస్టెంట్ ఎవరో కాదండీ..నాగ మణికంఠ. లాంచ్ ఈవింగ్ లో ఫార్మెన్స్ ఓ రేంజ్ లో ఫార్మెన్స్ ఇచ్చి అంటెషన్ ను గ్రాబ్ చేశారు. ఆ స్టేజ్ మీదనే మనోడు తన ప్లాష్ బ్యాక్ చెప్పి కన్నీరు పెట్టించారు. అంతటితో ఆగకుండా.. తన భార్యతో తనకు పడటం లేదనీ, గొడవల కారణంగా తన భార్య తన కూతురుని దూరం చేసిందని హార్ట్ చేశాడు. దీంతో 'అయ్యో పాపం' అనేలా కంటెస్టెంట్ల మనసులో ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. బీబీ హౌస్ లో అడుగుపెట్టగానే కంటెస్టెంట్లందరూ నాగమణికంఠను నామినేట్ చేయడంతో మనోడు తమ విశ్వరూపాన్ని చూపించారు.

Ex Bigg boss contestant Akhil Sarthak SHOCKING Comments on Bigg Boss 8 Telugu Contestant Naga Manikanta

తనని నామినేట్ చేసిన వారిపై వీరా లెవల్ లో ఫైర్ అయ్యారు. ఇది గేమ్ కావొచ్చు. కానీ, ఇది లైఫ్ .. నేనేంటో నిరూపించుకోవడానికి ఇక్కడికి వచ్చా.. నన్ను ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ రావిపూడి అనిల్ బీబీ హౌస్ నుంచి తీసుకెళ్తు నీకు నచ్చిన హీరో ఎవరంటే.. మనోడు నాకు నేనే హీరో అంటూ ఇచ్చిన సమాధానం వేరే లెవల్. ఆ తరువాత శివుడిపై పాట పాడి భావోద్వేగానికి లోనయ్యారు. కానీ చివరిలో అనిల్ రావిపూడి అది ప్రాంక్ అని చెబుతారు. ప్రాంక్ సమయంలో నాగమణికంఠ ఓవరాక్షన్ తో మనదిపై ఓవర్ అటెన్షన్ వచ్చిందనే చెప్పాలి.

ఇక ఫస్ట్ వీక్‌లోనూ అందరూ మణికంఠనే టార్గెట్ చేశారు. మనోడి వ్యవహారంపై పలువురు కంటెస్టెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణికంఠ తన ప్లాష్ బ్యాక్ చెప్పుకునే విధానం, తన జీవితంలోనే విషాదాల గురించి పదే పదే చెప్పుకోవడం కూడా కాంట్రవర్సీగా మారింది. నామినేషన్ ప్రక్రియలో బోరుమని ఏడ్చిన విధం, నేనే ఇంతే.. నాకు అబద్దాలు ఆడటం రాదు. తనలో తాను కుమిలిపోయారు. ఈ సమయంలో కంటెస్టెంట్లరందరూ అతడి వద్దకు వెళ్లి.. ఓదార్చారు. కానీ, మనోడు ఎమోషనల్ బ్లాస్ట్ అవుట్ అయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా తన విగ్గును తీసి అందరీకి తన నిజ స్వరూపాన్ని చూపించారు మణికంఠ.

ఆ తరువాత కన్ఫెషన్ రూమ్‌లోకి వెళ్లిన నాగమణి కంఠ బిగ్‌బాస్‌తో మాట్లాడుతూ.. నా లైఫ్‌ అంతా రోలర్ కోస్టర్‌లా ఉంది. నేను ఇలాగే ఉన్నా. నేను అబద్దం ఆడను. నిజాలు మాత్రమే చెప్పాను. బిగ్‌బాస్ తర్వాత నా జీవితం ఏంటీ? నా భార్య కావాలి? నా అత్తమామల నుంచి గౌరవం కావాలి? నా కూతురు నాకు కావాలి? నా మరు తండ్రి వద్ద గౌరవం దక్కాలి? అని భావించాను. కానీ నా వల్ల కావడం లేదంటూ మరో సారి బోరుమంటూ ఏడ్చేశారు. ఈ క్రమంలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. మీరు అనుకొన్నది సాధిస్తారు? ధైర్యంగా ఉండండి? అంటూ చెప్పారు. ఇలా ఆయనకు బిగ్‌బాస్ ధైర్యం ఇవ్వడంతో నవ్వుతూ బయటకు వచ్చారు.

Ex Bigg boss contestant Akhil Sarthak SHOCKING Comments on Bigg Boss 8 Telugu Contestant Naga Manikanta

నిజంగా భయ్యా.. మనోడి ఆటతీరు చూపి సానుభూతి చూపాలో? ట్రోల్ చేయాలో? అర్థంకాక అటు నెటిజన్లు, బిబి లవర్స్ ఆగం ఆగం అవుతున్నారు. ఈ తరుణంలో నాగమణికంఠ ఆట తీరుపై బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ సార్థక్ షాకింగ్ కామెంట్స్ చేశారు. 'ఆయన అటెన్షన్ సీకర్, ఈ విషయం నేను అనడం లేదు. తానే నిన్నటి షోలో అటెన్షన్ అంటే చాలా ఇష్టమని అన్నారు. దానికోసం ఏదైనా చేస్తాడని పిస్తుంది. బిగ్ బాస్ లో మన గతం గురించి చెప్పడానికి మనకు సమయం ఇస్తారు. కానీ, మణికంఠ ఫస్ట్ డే నుండే సింపథీ కార్డు వాడుతున్నారు. మళ్లీ నిఖిల్ కు బ్రేన్ తో ఆడాలి చెబుతున్నారు. తాను మాత్రం సింపథీ ప్లే చేస్తున్నారు. బీబీ అన్ని చూస్తున్నారు. పూల్స్ కాదు. దయచేసి సింపథీని చూసి ఓట్లు వేయకండి అని షాకింగ్ కామెంట్స్ చేశారు బీబీ మాజీ కంటెస్టెంట్ అఖిల్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X