అతని చివరి కోరిక .. నీ లైఫ్‌లోకి వాడిని రాని, యాంకర్ రష్మిని రిక్వెస్ట్ చేసిన బిగ్‌బాస్ స్టార్

టాలీవుడ్ టూ బాలీవుడ్‌లో ఎందరో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్‌గా ముదురు బెండకాయాల్లా మిగిలిపోతున్నారు. వీరి పెళ్లెప్పుడు అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సినీ పరిశ్రమలోనూ బుల్లితెర మీదా ఇలాంటి బ్యాచిలర్స్ ఎందరో. తెలుగు స్మాల్ స్క్రీన్ విషయానికి వస్తే రష్మి గౌతమ్ పేరు ముందు వరుసలో ఉంటుంది. ఇటు టీవీ షోలు, అటు సినిమాలతో ఆమె బిజీగా ఉంటున్నారు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా తెలుగింటి లోగిళ్లకు రష్మీ గౌతమ్ బాగా దగ్గరయ్యారు.

గతంలో ఎన్నో సినిమాల్లో నటించినప్పటికీ.. జబర్దస్త్ షో వల్లనే ఆమెకు పాపులారిటీ లభించింది. అనసూయ జబర్దస్త్‌కు, రష్మీ గౌతమ్ ఎక్స్‌ట్రా జబర్దస్త్‌కు యాంకర్లుగా చేసేవారు. సినిమాల్లో వరుస అవకాశాలు దక్కడంతో అనసూయ ఈ షోకు గుడ్ బై చెప్పగా.. రష్మీ మాత్రం ఇంకా కంటిన్యూ అవుతున్నారు. తనకు కూడా సినిమాల్లో బాగానే ఆఫర్లు వస్తున్నా జబర్దస్త్‌ను మాత్రం ఆవిడ విడిచిపెట్టలేదు. ఈ ప్రోగ్రామ్‌తో పాటు వేరే షోలు, సినిమా ఈవెంట్లను ఎడాపెడా చేసేస్తోంది.

Ex bigg boss contestant and hero Sivaji satires on anchor Rashmi Gautam s marriage here s the details

జబర్దస్త్‌లో ఎంట్రీ ఇవ్వడానికి ముందే పలు తెలుగు సినిమాల్లో నటించారు. దివంగత ఉదయ్ కిరణ్ హీరోగా నటించిన హోలీ ద్వారా ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆ మూవీలో కమెడియన్ సునీల్‌కు ప్రియురాలిగా కడుపుబ్బా నవ్వించారు. ఆ సినిమా వచ్చి 22 ఏళ్లు.. అంటే ఈ లెక్కన రష్మీ వయసు ఎంత ఉండాలి అంటూ నెటిజన్లు చర్చించుకుంటూ ఉంటారు.

హోలీ తర్వాత కరెంట్, ఎవరైనా ఎపుడైనా, బిందాస్, గుంటూరు టాకీస్, నెక్ట్స్ నువ్వే, బొమ్మ బ్లాక్‌బస్టర్, భోళా శంకర్, హాస్టల్ బాయ్స్‌లో రష్మీ గౌతమ్ నటించింది. ఇన్నేళ్లు వచ్చినా ఆమె ఇంకా పెళ్లి మాటల ఎత్తకపోవడంపై అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారు. జబర్తస్త్ ఫేమ్, మరో స్టార్ యాంకర్ సుడిగాలి సుధీర్‌తో రష్మీ ప్రేమలో ఉందని ఏళ్లుగా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని .. రేపో మాపో పెళ్లి జరగబోతోందని ఎన్నోసార్లు ప్రచారం జరిగింది. అయితే అవి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా రష్మీ పెళ్లి మేటర్ మరోసారి చర్చకు వచ్చింది.

వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈటీవీలో ''జై జై గణేశా '' పేరుతో స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేశారు. దీనికి సంబంధించిన ప్రోమో సోమవారం రిలీజ్ అయ్యింది. దీనికి సీనియర్ హీరోయిన్లు ఖుష్బూ, ఇంద్రజలతో పాటు హీరో, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శివాజీ వచ్చి సందడి చేశారు. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ.. ఖుష్బూని బిగ్‌బాస్ మహారాణిగా, ఇంద్రజను శ్రీదేవి డ్రామా కంపెనీ యువరాణి అంటూ పొగిడెస్తాడు.

మధ్యలో రష్మీ కలగజేసుకుని... మరి నేను ఏ రాణి అని అడుగుతుంది. దీనికి శివాజీ ఆన్సర్ ఇస్తూ.. నీ లైఫ్‌లోకి కూడా ఎవడో ఒకడిని రాని అంటూ సెటైర్లు వేస్తాడు. రేపో మాపో చచ్చేవాడు కూడా చివరి కోరిక ఏంటంటే ఒక్కసారి రష్మీ పెళ్లి చూసి చచ్చిపోతానయ్యా అంటాడంటూ చెప్పడంతో ప్రోమో ముగుస్తుంది. మరి దానికి రష్మీ రియాక్షన్, వినాయక చవితి సంబరాలు చూడాలంటే సెప్టెంబర్ 7న ఉదయం 9 గంటల వరకు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X