twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజకీయాల్లోకి బిగ్ బాస్ 2 కంటెస్టెంట్, పార్టీ అధ్యక్షురాలిగా...

    |

    ది నేషనల్ ఉమెన్స్ పార్టీ(ఎన్.డబ్ల్యు.పి) తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలిగా తమిళ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ నిత్యా ధేజు ఎన్నికయ్యారు. భారత దేశంలో మొట్టమొదటి పూర్తి మహిళలతో కూడిన పార్టీగా గుర్తింపు పొందిన ఎన్.డబ్ల్యు.పి తమిళనాడు రాష్ట్ర కార్యవర్గాన్ని ఇటీవల ప్రకటించింది.

    పార్టీ వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ.. ఎన్.డబ్ల్యు.పి వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాలకుగాను 283 స్థానాల్లో పోటీ చేయబోతున్నట్లు తెలిపారు. మహిళలకు పార్లమెంటులో 50 శాతం రిజర్వేషన్ కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు సాగుతున్నట్లు తెలిపారు.

    హక్కులను సాధించడమే లక్ష్యంగా

    హక్కులను సాధించడమే లక్ష్యంగా

    నూతన అధ్యక్షురాలు నిత్య ధేజు మాట్లాడుతూ... తమిళనాడులోని రాజకీయ పార్టీలు మహిళలకు మద్దతు ఇస్తున్నప్పటికీ అయా పార్టీల్లో తాము చిన్నభాగంగా మాత్రమే ఉంటున్నామని, ఎన్.డబ్ల్యు.పిలో అన్నీ మేమే... తమ హక్కులను సాధించడమే లక్ష్యంగా పార్టీ పని చేస్తుంది. ఇందుకోసం తన వంతు కృషి చేయనున్నట్లు తెలిపారు.

    బిగ్ బాస్ తమిళ 2 సీజన్

    బిగ్ బాస్ తమిళ 2 సీజన్

    బిగ్ బాస్ తమిళ్ సీజన్ 2 నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత నుంచి కమల్ హాసన్‌తో టచ్‌లో ఉన్నాను. ఆయన స్థాపించిన ‘మక్కల్ నీధి మయ్యం'లో జాయిన్ అవ్వాలని ఆహ్వానం కూడా అందినట్లు నిత్య తెలిపారు.

    ఆయన్ను కాదని అందుకే...

    ఆయన్ను కాదని అందుకే...

    కమల్ సర్ అంటే నాకు గౌరవం. ఆయన బిగ్ బాస్ షోలో, షో నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా చాలా సహాయంగా ఉన్నారు. అయితే ఆయన పార్టీని కాకుండా ఎన్.డబ్ల్యు.పిని ఎంచుకోవడాకి కారణం ఈ పార్టీ సిద్ధాంతాలు. ఇది మహిళల కోసం, మహిళల చేత, మహిళా సాధికారత కోసం స్థాపించబడిన పార్టీ అని నిత్య తెలిపారు.

    బిగ్ బాస్ షోలో సంచలనం...

    బిగ్ బాస్ షోలో సంచలనం...

    నిత్య మరెవరో కాదు.. తమిళ హాస్యనటుడు, టీవీ యాంకర్‌ దాడి బాలాజి భార్య. వీరికి పోషక అనే ఒక కూతురు కూడా ఉంది. మనస్పర్థల కారణంగా ఇద్దరూ విడిపోయారు. బిగ్‌బాస్‌ 2 రియాలిటీ గేమ్‌ షోలోనూ వీరిద్దరూ పాల్గొని అక్కడ కూడా గొడవపడటం అప్పట్లో షోను మరింత రక్తికట్టించారు.

    English summary
    The National Women’s Party (NWP) named Nithya Dheju, an ex-Big Boss contestant as their party president for Tamil Nadu. The party, which identifies itself as India’s first-ever all-women political party, launched its state unit Wednesday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X