Bigg Boss Telugu 8: బిగ్ బాస్ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఫిక్స్.. షోలోకి లేడీ ఎంటర్‌టైనర్ ఎంట్రీ
కంటెంట్‌తో ఎలాంటి సంబంధం లేకుండా ఎప్పుడు ప్రసారం అయినా.. భారీ స్థాయిలో ప్రేక్షకుల స్పందనను అందుకుంటూ విజయవంతంగా సాగిపోతోంది బిగ్ బాస్. ఎనిమిదేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఈ కార్యక్రమం దేశంలోనే టాప్ షోగా మారింది. దీంతో నిర్వహకులు ప్రయోగాల మీద ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ను నడుపుతున్నారు. ఇందులోకి త్వరలోనే ఓ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళ్తే....
మొదట్లోనే సర్‌ప్రైజులతో
తెలుగులో ఏడు సీజన్లు సూపర్ డూపర్ హిట్ అవడంతో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. ముఖ్యంగా ఇందులో గతంలో ఎన్నడూ చూడని ట్విస్టులు ఇస్తున్నారు. ఫలితంగా ఇది ఎంతో సందడిగా సాగుతోంది. అలాగే ఈ సీజన్ రోజురోజుకూ మరింత రంజుగా సాగుతోంది.

14 మందిలో ఆమె అవుట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారానికి గానూ జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లింది.
వాళ్లను కూడా పంపేలా
ప్రస్తుతం ప్రసారం అవుతోన్న 8వ సీజన్‌లో నిజంగానే 20 నుంచి 21 మంది వరకూ సెలెబ్రిటీలు కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అయ్యారట. అయితే, ఇది అన్‌లిమిటెడ్ సీజన్ కావడంతో మిగిలిన వాళ్లను వారం మధ్యలో లేదా వచ్చే శని, ఆదివారాలు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లలో పంపించే అవకాశం ఉందని టాక్ వచ్చింది. మొదటి వీకెండ్‌లో మాత్రం షోలోకి ఎవరూ ఎంట్రీ ఇవ్వలేదు.
మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ
బిగ్ బాస్ షో అంటేనే ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తుంటాయి. ఇక, అన్‌లిమిటెడ్‌గా సాగే ఎనిమిదో సీజన్‌లో ఇవన్నీ ఇంకాస్త ఎక్కువగా ఉంటాయని ముందు నుంచీ నిర్వహకులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లోకి ఈ వారాంతంలో అంటే శని లేదా ఆదివారం ఎపిసోడ్‌లు ముగిసిన తర్వాత ఓ సెలెబ్రిటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవబోతున్నారని తెలిసింది.
వైల్డ్ కార్డ్‌తో వచ్చేది ఆమె
బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న లేటెస్ట్ ఇన్ఫో ప్రకారం.. ఈ వారాంతంలో హౌస్‌లోకి అడుగు పెట్టబోయే సెలెబ్రిటీ ప్రముఖ సీరియల్ హీరోయిన్, జబర్ధస్త్ ఫేం రోహిణి అని తెలిసింది. తెలుగు బుల్లితెరపై ఎన్నో సీరియళ్లలో నటించిన ఆమె.. గతంలోనూ బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా వచ్చింది. మంచి కమెడియన్ కావడంతో ఇప్పుడు మళ్లీ ఆమెను తీసుకు వస్తున్నారట.
కామెడీకి కొదవ ఉండదు
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో హౌస్‌మేట్లతో పాటు ఆడియెన్స్‌ను నవ్వించే వాళ్లు కరువు అయ్యారు. అందుకే ఇప్పుడు బెస్ట్ లేడీ కమెడియన్ అనిపించుకుంటోన్న రోహిణిని షోలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. గతంలో త్వరగానే ఎలిమినేట్ అయిన ఆమె.. ఇప్పుడు షోలోకి వస్తే ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications











