Bigg Boss Nominations: చివరి నామినేషన్స్‌లో సెన్సేషన్.. ఈ సీజన్‌లో తొలిసారి అలా.. అమర్‌కు వెన్నుపోటు

బుల్లితెరపై ఉన్న బౌండరీలను దాటేస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచే కంటెంట్‌తో సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. ఎవరూ ఊహించని ఎన్నో మలుపులతో సాగుతోన్న ఇది తెలుగులో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది.

ఇలా ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రసారం చేస్తున్నారు. ఇందులో చిత్ర విచిత్రమైన సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో ఎలిమినేషన్స్ అన్నీ సంచలనంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి నామినేషన్స్‌ ప్రక్రియ ఎలా సాగింది అనే దానిపై పూర్తి వివరాలను మీరే చూసేయండి!

Except Arjun All Contestats Nominated in 14th Week of Bigg Boss Telugu 7

బెస్ట్ సీజన్ అనిపించేలానే: తెలుగులో బిగ్ బాస్ షోకు దక్కే ఆదరణ మరే దానికీ రావడం లేదు. అంతలా ఇది ఎవరూ ఊహించని కంటెంట్‌తో సాగిపోతోంది. ఈ జోష్‌లోనే ఇప్పుడు నిర్వహకులు ఏడో దాన్ని నడుపుతున్నారు. ఇది చివరి దశకు చేరుకోవడంతో ఎన్నో ట్విస్టులు ఇస్తున్నారు. అలాగే, సర్‌ప్రైజ్‌లను కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఈ సీజన్ అన్నింటి కంటే బెస్ట్ అనిపించేలా వెళ్తోంది.

19 మందిలో వాళ్లు అవుట్: ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్ వెళ్లారు.

టైల్స్ పగలగొట్టే ప్రక్రియ: ఉల్టా పుల్టాగా కాన్సెప్టుతో సాగే ఏడో సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు నామినేషన్స్ టాస్కులను కొత్త కాన్సెప్టులతో తీసుకు వస్తున్నారు. అయితే, 14వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను 'టైల్స్ పగలగొట్టే' పద్దతితో నడిపించారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ.. సరైన కారణాలు చెప్పి వాళ్ల ఫొటోలను నామినేటేడ్ అన్న పేరు కింద పెట్టి పగలగొట్టాలి.

స్పై వర్సెస్ స్పా గొడవలు: బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ అన్నింటికంటే ముఖ్యమైనదిగా చెప్పుకోవాలి. అందుకే ఇది జరిగే సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో వాదనలు జరుగుతాయి. ముఖ్యంగా 14వ వారం నామినేషన్స్‌ స్పై బ్యాచ్ వర్సెస్ స్పా బ్యాచ్ మధ్య గొడవలతో సాగినట్లు తెలిసింది. శోభా.. శివాజి, యావర్‌తో గొడవ పడింది. అలాగే, అర్జున్‌తోనూ ప్రిన్స్ పెద్ద వాగ్వాదాన్నే జరిపాడు.

14వ వారంలో ఆరుగురు: ఏడో సీజన్‌లోని పద్నాలుగో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ షూట్ ఆదివారమే కంప్లీట్ అయింది. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఉన్న ఏడుగురు కంటెస్టెంట్లు ఉండగా.. అర్జున్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్, శివాజి, అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక, శోభా శెట్టిలు ఉన్నారని సమాచారం.

Except Arjun All Contestats Nominated in 14th Week of Bigg Boss Telugu 7

ఈ సీజన్‌లో తొలిసారిగా: బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచీ చూసుకుంటే స్పై బ్యాచ్‌లో కానీ.. స్పా బ్యాచ్‌లో కానీ ఒకరిని ఒకరు నామినేట్ చేసుకోలేదు. ఇదే విషయంపై వీకెండ్ ఎపిసోడ్‌లో చర్చ కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజా నామినేషన్స్‌లో అమర్‌దీప్ చౌదరిని ప్రియాంక జైన్ నామినేట్ చేసినట్లు తెలిసింది. ఈ సీజన్‌లోనే తొలిసారి జరిగిన ఈ ఘటన సంచలనం కాబోతుందని చెప్పొచ్చు.

ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్: ఏడో సీజన్‌లోనే చివరిదైన నామినేషన్స్ ప్రక్రియలో ఫైనల్ అస్త్ర గెలిచిన అర్జున్ మినహా అందరూ నామినేషన్స్‌కు వచ్చారు. మిగిలిన ఆరుగురిలో కొందరికి ఒక్క ఓటు కూడా పడింది. అయితే, టాప్ 5 కంటెస్టెంట్లను నిర్ణయించే చివరి నామినేషన్ ప్రక్రియ కావడంతో బిగ్ బాస్ అందరు కంటెస్టెంట్లను నామినేట్ చేశాడు. అలా ఈ వారం అర్జున్ తప్ప అందరూ నామినేట్ అయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X