Bigg Boss Nominations: నామినేషన్స్‌లో సంచలనం.. ఈ వారం ఆ ఒక్కరు తప్ప.. శివాజికి ఈ సీజన్‌లోనే తొలిసారి
బిగ్ బాస్.. ఈ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అంతలా ఇది 17 ఏళ్లుగా ఇండియా వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తోంది. ముఖ్యంగా తెలుగులోనూ ఏడేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తూ దేశంలో ఏ భాషలోనూ రానంత రేటింగ్‌ను అందుకుంటోంది. ఫలితంగా నిర్వహకులు వరుసగా సీజన్లను పూర్తి చేస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని దిగ్విజయంగా నడుపుతున్నారు. ఇందులో నామినేషన్స్ ఉత్కంఠభరితంగా సాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో 13వ వారం నామినేషన్స్ టాస్కులో సంచలనం జరిగినట్లు తెలిసింది. ఆ వివరాలు మీకోసమే!
ఆ విషయంలో బెస్ట్ సీజన్
బిగ్ బాస్ షో తెలుగులో చాలా సీజన్లను పూర్తి చేసుకుంది. అయితే, ఇప్పుడు ప్రసారం అవుతోన్న ఏడోది మాత్రం ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోంది. ఇందులో గత సీజన్లలో ఎప్పుడూ చూపించని ఎన్నో అంశాలను హైలైట్ చేస్తున్నారు. ఫలితంగా ఇది సక్సెస్‌ఫుల్‌గా సాగుతూ కాన్సెప్టు పరంగా ది బెస్ట్ అనిపించుకుంటోంది. అలాగే, సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులతో మజాను కూడా పంచుతోంది.

ఎవరెవరు వెళ్లిపోయారు?
ఏడో సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీరి నుంచి ఫస్ట్ వీక్ కిరణ్ రాథోడ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని పావని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక ఎలిమినేట్ అయ్యారు.
రంగులు పూసే టాస్క్‌తో
ఉల్టా పుల్టాగా సాగుతోన్న ఏడో సీజన్‌లో బిగ్ బాస్ నిర్వహకులు నామినేషన్స్ టాస్కులను కొత్త కాన్సెప్టులతో తీసుకు వస్తున్నారు. అయితే, 13వ వారం జరగబోయే నామినేషన్స్ ప్రక్రియను 'ముఖానికి ఎరుపు రంగు' పూసే పాత టాస్కునే తీసుకు వచ్చారు. దీని ప్రకారం.. ప్రతి కంటెస్టెంట్ ఇద్దరిని నామినేట్ చేస్తూ.. సరైన కారణాలు చెప్పి వాళ్ల ముఖంపై రంగు వేయాలి.

యమా గొడవలతో టాస్క్
బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్క్ అన్నింటికంటే ప్రత్యేకమైనదిగా చెప్పుకోవచ్చు. అందుకే ఇది జరిగే సమయంలో కంటెస్టెంట్ల మధ్య భారీ స్థాయిలో వాదనలు జరుగుతాయి. ముఖ్యంగా పదమూడో వారం నామినేషన్స్‌లో శివాజిని చాలా మంది కంటెస్టెంట్లు టార్గెట్ చేసినట్లు తెలిసింది. అమర్‌దీప్, ప్రియాంక, శోభా, గౌతమ్‌లతో అతడు గొడవలు పడినట్లు సమాచారం.
13వ వారంలో ఏడుగురు
ఏడో సీజన్‌లోని పదమూడో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ షూట్ ఆదివారమే పూర్తి అయిపోయింది. విశ్వసనీయ వర్గాల తాజా సమాచారం ప్రకారం.. ఇందులో మొత్తం ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్లు ఉండగా.. ఏడుగురు నామినేట్ అయ్యారు. అందులో ప్రిన్స్, శివాజి, అమర్‌దీప్, అర్జున్, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, శోభా శెట్టిలు ఉన్నారని సమాచారం.

ఈ సీజన్‌లో తొలిసారిగా
బిగ్ బాస్ ఏడో సీజన్ ఆరంభం నుంచీ చూసుకుంటే టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న శివాజిని నామినేట్ చేసే సాహసం ఎవరూ పెద్దగా చేయలేదు. అయితే, క్రమంగా అందరిలో భయం పోవడంతో ఆయనను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇక, 13వ వారంలో అయితే తొలిసారి శివాజీనే అందరూ టార్గెట్ చేశారని తెలిసింది. దీంతో ఈ సారి ఎక్కువ ఓట్లు అతడికే పడినట్లు న్యూస్ లీకైంది.
అందుకే ప్రశాంత్ సేఫా?
పదమూడో వారానికి జరిగిన నామినేషన్స్ ప్రక్రియలో కెప్టెన్ ఎవరూ లేకపోవడంతో అందరూ నామినేషన్స్‌కు వచ్చారు. కానీ, ఒక్క పల్లవి ప్రశాంత్ మాత్రమే ఇందులో నామినేట్ అవలేదని తెలిసింది. అందరితో మంచిగా ఉండడం వల్ల అతడు సేఫ్ అయ్యాడా? లేక ఎవిక్షన్ పాస్ ఉంది ఎలాగైనా సేఫ్ అవుతాడు అని ఎవరూ నామినేట్ చేయలేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











