twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్ వీళ్లేనా.. యాంకర్ రష్మీ, సుధీర్, పొట్టి నరేష్.. ఇంకా ఎవరెవరంటే!

    |

    గత కొన్ని రోజులుగా తెలుగు బిగ్ బాస్ 3 సీజన్ గురించి అనేక ఉహాగానాలు వినిపిస్తున్నాయి. సీజన్1, 2 లకు మంచి రెస్పాన్స్ రావడంతో బిగ్ బాస్ 3 మరింత ఆకట్టుకునే విధంగా ఉండాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. ఎన్టీఆర్ షోని నడిపించిన విధానానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత అదే జోరుని నాని కొనసాగించాడు. మరి కొన్ని రోజుల్లో బిగ్ బాస్ 3 హంగామా మొదలు కాబోతోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 3కి హోస్ట్ ఎవరనే చర్చ జరుగుతుంటే, కంటెస్టెంట్స్ గురించి కూడా ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

     హోస్ట్ ఎవరు

    హోస్ట్ ఎవరు

    తెలుగు బిగ్ బాస్ తొలి సీజన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించాడు. రెండవ సీజన్ కు నానిని బిగ్ బాస్ టీం హోస్ట్ గా ఎంపిక చేసుకుంది. త్వరలో జరగబోయే మూడవ సీజన్ కు హోస్ట్స్ గా చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. విక్టరీ వెంకటేష్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ ఎలా స్టార్ హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. మరి బిగ్ బాస్ నిర్వాహకు ఎవరిని ఫైనల్ చేస్తారో వేచి చూడాలి.

     సోషల్ మీడియాలో ఊహాగానాలు

    సోషల్ మీడియాలో ఊహాగానాలు

    ఇదిలా ఉండగా బిగ్ బాస్ 3లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ విషయంలో కూడా అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. బుల్లితెర రంగంలో బాగా పాపులర్ అయిన సెలెబ్రిటీలని బిగ్ బాస్ 3లోకి సభ్యులుగా ఎంపిక చేసుకోబోతున్నట్లు కొందరి పేర్లు ప్రచారం జరుగుతున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ ఫైనల్ లిస్ట్ వచ్చే వరకు వేచి చూడాలి. నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచే యాంకర్ రష్మీ, సుడిగాలి సుధీర్ లాంటి సెలెబ్రిటీలని బిగ్ బాస్ 3 కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

     బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్ వీళ్లేనా.

    బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్ వీళ్లేనా.

    బిగ్‌బాస్ 3 కంటెస్టెంట్స్ వీళ్లేనా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న జాబితా ఇదే. టీవీ నటి హరిత, సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ, వరుణ్ సందేశ్, యాంకర్ ఉదయభాను, సింగర్ హేమచంద్ర దాదాపుగా బిగ్ బాస్ 3 కోసం ఫైనల్ అయిపోయారని ప్రచారం జరుగుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు మరికొందరి పేర్లని కూడా పరిశీలిస్తున్నారు అంటూ ఇంకో జాబితా వైరల్ అవుతోంది. అందులో జబర్దస్త్ పొట్టి నరేష్, టివి ఆర్టిస్ట్ జాకీ, నటుడు కమల్ కామరాజు, రేణు దేశాయ్, గుత్తా జ్వాల, మనోజ్ నందన్, రఘు మాస్టర్, నాగ పద్మిణి, యాంకర్ ప్రదీప్ పేర్లు వైరల్ అవుతున్నాయి.

    సామాన్యులకు

    సామాన్యులకు

    సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ జాబితాలోని వారే ఎక్కువ మంది బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్ గా ఎంపికయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక బిగ్ బాస్ 2లో సామాన్యులకు కూడా అవకాశం ఇచ్చారు. బిగ్ బాస్ 3లో సామాన్యులని ఎంతమందిని తీసుకుంటారో వేచి చూడాలి. బిగ్ బాస్ 2 లో జరిగిన వివాదాలు సీజన్ 3 లో రిపీట్ కాకూడదని నిర్వాహకులు జాగ్రత్త పడుతున్నారు.

    English summary
    Expected Big Boss 3 contestants list goes viral in social media. Anchor and TV artists are more in the list
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X