ఆత్రం ఆపుకోలేకపోతోన్నారు.. అషూ కోసం ఆ ముగ్గురు రెడీ.. అవినాష్ రచ్చ

ప్రస్తుతం బుల్లితెర మీద వినోద కార్యక్రమాలు కొదవే లేదు. ఒకరితో ఒకరు పోటీ పడుతూ మరీ కొత్త కొత్త షోలను ముందుకు తీసుకువస్తున్నారు. అలా ఇప్పుడు స్టార్ మాలో కామెడీ స్టార్స్ అనే కొత్త షో బాగానే క్లిక్ అయింది. జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అవినాష్ బిగ్ బాస్ షోతో ఇంకా ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా బిగ్ బాస్ ఇమేజ్ వాడి కామెడీ స్టార్స్ అనే షోను జబర్దస్త్‌కు పోటీగా నిలబెట్టేశాడు.

‘కామెడీ స్టార్స్'లో అలా..

‘కామెడీ స్టార్స్'లో అలా..

కామెడీ స్టార్స్ షోలో శేఖర్ మాస్టర్, యాంకర్ వర్షిణి, నాటి హీరోయిన్ శ్రీదేవి, అదిరింది టీం మొత్తం ఉన్నారు. ఇలా ఈ అందరూ కామెడీ స్టార్స్‌‌కు స్పెషల్ అట్రాక్షన్‌గా మారిపోయారు. ఇక వీరు కాకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్లు మెయిన్ హైలెట్ అవుతున్నారు.

అవినాష్‌తో ముందుకు..

అవినాష్‌తో ముందుకు..

కామెడీ స్టార్స్ అనే ఆలోచన బిగ్ బాస్ షో తరువాత అవినాష్ ముందుకు కదలించాడు. అలా బిగ్ బాస్ షో అనంతరం.. మరో వైపు అదిరింది షో కూడా మూతపడటం అన్నీ కలిసి వచ్చాయి. అక్కడి టీం, బిగ్ బాస్ కంటెస్టెంట్లు కలిసి కామెడీ స్టార్స్‌ను ముందుకు తీసుకెళ్లారు.

‘జబర్దస్త్'ను మించేలా..

‘జబర్దస్త్'ను మించేలా..

ప్రస్తుతం కామెడీ స్టార్స్‌కు పోటీగా నిలబెట్టిన శ్రీదేవీ డ్రామా కంపెనీ షో అంతగా క్లిక్ అవ్వలేదు. పైగా కామెడీ స్టార్స్ టీఆర్పీ రేటింగ్స్.. జబర్దస్త్ షోను మించి పోయింది. అలా మొదటిసారిగా ఇలాంటి కామెడీ షోలు జబర్దస్త్ షోను దాటి వెళ్లింది. కామెడీ స్టార్స్ సక్సెస్ అవ్వడంతో టీం మొత్తం ఖుషీ చేసేసుకుంది.

తాజాగా ప్రోమో..

తాజాగా ప్రోమో..

వచ్చే ఆదివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అవినాష్ రెచ్చిపోయాడు. మూడు ఫ్యామిలీలు పెట్టి ఓ స్కిట్ వేశాడు. ఇక చివర్లో స్టేజ్ మీద అందరూ కలిసి విన్యాసాలు చేశారు. మామూలుగా బుల్లితెరపై షోలో ఈ మధ్య ఇలాంటి విన్యాసాలు ఎక్కువయ్యాయి. స్టేజ్ మీద జారిపడేలా అరేంజ్మెంట్స్ చేస్తారు. దాని మీద స్టెప్పులు వేయమంటారు.

అషూ కోసం రెడీగా..

అషూ కోసం రెడీగా..

అలా జారి పడకుండా ఉండేందుకు ఎంతగా ట్రై చేసినా కుదరదు. అందరూ కింద పడుతుంటారు. అలా అషూ రెడ్డిని కూడా అందులోకి తీసుకొస్తారు. ఇక అషూ రెడ్డి ఎప్పుడు కింద పడుతుందా? ఆ అవకాశాన్ని ఎప్పుడు వాడుకుందామా? అని ఎక్స్‌ప్రెస్ రవి, అవినాష్, యాదమ్మ రాజు ఇలా అందరూ కాచుకుని కూర్చుంటారు. కానీ అషూ మాత్రం తెలివిగా పడకుండా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది. మరి చివరగా అషూ పడుతుందా? లేదా? అన్నది ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X