ప్రేమ పేరుతో మోసం.. రోడ్లపై పిచ్చోడిలా తిరిగిన బుల్లితెర నటుడు

ప్రేమలో మోసపోయి, డిప్రెషన్ లోకి వెళ్లాడు. సూసైడ్ చేసుకోవాలని భావించాడు. కానీ, చివరకు జీవితాన్ని మార్చుకున్నారు. ఎవరూ ఊహించని విధంగా పాపులారిటీ సంపాదించుకున్నారు. అలా ప్రేమ పేరుతో మోసపోయిన ఓ బుల్లితెర నటుడు కథ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ ఇంటర్వ్యూలో తన బ్రేకప్ స్టోరీని ఎమోషనల్‌గా బయటపెట్టారు. తాను అనుభవించిన బాధను చెప్పినా... ఆ అమ్మాయి గురించి మాత్రం సైలెంట్‌గా ఉండటం మరింత ఆసక్తి రేపుతోంది. ఇంతకీ తన ప్రేమ కథతో అందరినీ షాక్‌కు గురిచేస్తున్న ఆ టీవీ స్టార్ ఎవరు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.

ఆ నటుడు ఎవరో కాదు.. తెలుగు బుల్లితెరపై తన టైమింగ్, పంచ్‌లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎక్స్‌ప్రెస్ హరి (Express Hari). ఈ నటుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టాండప్ కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన, పటాస్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఆ తర్వాత జబర్దస్త్ వేదికపై మరింత పాపులారిటీ దక్కించుకుంది, ప్రస్తుతం పలు టీవీ ఛానెల్‌లలో ప్రసారమయ్యే షోలలో ప్రేక్షకులు అలరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా 'ఆదివారం విత్ స్టార్ మా పరివార్' వంటి కార్యక్రమాల్లో తన కామెడీతో మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు.

Express Hari Opens Up on Breakup Depression and Emotional Love Failure Story

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎక్స్ ప్రెస్ హరి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక ఎమోషనల్ ఎపిసోడ్‌ను బయటపెట్టారు. తన లవ్ బ్రేకప్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు హరి. తన జీవితంలో ఎదురైన ఒక చేదు ప్రేమ కథను పంచుకున్నారు. "నేను ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించాను. కానీ ఆమె నన్ను మోసం చేసింది" అని భావోద్వేగానికి లోనయ్యారు.

హరి చెప్పిన వివరాల ప్రకారం, ఆ బ్రేకప్ సమయంలో తాను తీవ్రంగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని చెప్పారు. "ఆ సమయంలో నాకు సూసైడ్ చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయి. ప్రేమకు ఎంత పవర్ ఉంటుందో అప్పుడే నాకు అర్థమైంది" అని ఆయన చేసారు. ఒక రోజు ఆ అమ్మాయితో తనతో మాట్లాడకపోతే తట్టుకోలేకపోయానని, తనకు 96 మిస్డ్ కాల్స్ ఇచ్చానని ఆయన చెప్పడం ఆ సమయంలో ఎంతగా మానసికంగా బాధపడ్డారో అర్థం చేసుకోవచ్చు.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం.. 97వ సారి ఫోన్ లిఫ్ట్ చేసిన ఆ అమ్మాయి "ఎందుకు నన్ను విసిగిస్తున్నావు?" అని తిట్టి ఫోన్ కట్ చేసిందని హరి చెప్పారు. ఒకసారి విశాఖపట్నం వచ్చి కలవమని చెప్పడంతో, ఆమె చెప్పిన ప్రదేశానికి గంటల తరబడి ఎదురుచూశానని, కానీ ఆమె రాలేదని చెప్పారు. ఫోన్ చేయగా "నేను అక్కడ లేను" అని చెప్పడంతో తాను పూర్తిగా షాక్ అయ్యానని అన్నారు. "ఆమె కోసం రోడ్లపై పిచ్చోడిలా తిరిగాను" అనే మాట ఆయన ఆవేదనను స్పష్టంగా తెలియజేస్తోంది.

అయితే అదే సమయంలో తనలో ఒక ఆలోచన వచ్చిందని హరి చెప్పారు. "నన్ను ఇష్టపడని వ్యక్తి కోసం నేను ఎందుకు ఇలా అయిపోవాలి?" అనే ప్రశ్న తనను ఆలోచింపజేసిందని చెప్పారు. ఆ క్షణంలోనే నేరుగా గుడికి వెళ్లి, అక్కడ కాసేపు కూర్చొని ఏడ్చేశానని, ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనను తాను కంట్రోల్ చేసుకున్నానని చెప్పారు. ఈ సంఘటన తన జీవితాన్ని పూర్తిగా మార్చిందని, ప్రతి సంఘటన మనకు ఒక గుణపాఠంలా మారుతుందని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు.

ఇదిలా ఉండగా, గతంలో ఎక్స్ ప్రెస్ హరి పేరు అషు రెడ్డితో కూడా లింక్ అయింది. ఆమెతో ప్రేమలో ఉన్నారనే వార్తలు, ఆమె పేరును టాటూ వేయించుకోవడం, బైక్ గిఫ్ట్ వంటి విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఆ ప్రచారాలన్నీ షో కోసమే చేసినవి అని తరువాత స్పష్టత వచ్చింది. నిజ జీవితంలో అలాంటి రిలేషన్ ఏదీ లేదని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X