శ్రీముఖి షోలో కలకలం: బిగ్ బాస్ బ్యూటీకి రైటర్ ముద్దు.. ఇష్టం లేదన్నా బలవంతం చేయడంతో!
తెలుగు బుల్లితెరపై ఈ మధ్య కాలంలో ఎన్నో రకాల కొత్త కొత్త షోలు వస్తున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల ఆదరాభిమానాలను సొంతం చేసుకుంటూ సక్సెస్‌ఫుల్ షోలుగా దూసుకుపోతోన్నాయి. అందులో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' అనే షో ఒకటి. శ్రీముఖి హోస్ట్ చేస్తున్న ఈ కామెడీ గేమ్ షో విజయవంతంగా సాగిపోతోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాబోతున్న ఎపిసోడ్‌లో ఓ ఊహించని సంఘటనను చూపించారు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇంతకీ ఏం జరిగింది? ఆ వివరాలు మీకోసం!

ఆదివారం విత్ స్టార్ మా
తెలుగు బుల్లితెరపై సక్సెస్‌ఫుల్ షోలతో ఒకటిగా వెలుగొందుతోంది 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'. ఈ మధ్య కాలంలో ప్రేక్షకులను ఇది యమా అలరిస్తూ సాగిపోతోంది. ఇందులో యాంకర్ శ్రీముఖి చేసే అల్లరితో పాటు గెస్టుల హడావిడి బాగుంటుంది. అలాగే, ముక్కు అవినాష్, ఫైమా కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నారు. ఇది ప్రతి ఆదివారం ప్రసారం అవుతోంది.

సెలెబ్రిటీలకు చుక్కలు
సుదీర్ఘమైన కెరీర్‌లో శ్రీముఖి ఎన్నో వినోదాత్మక కార్యక్రమాలు చేసింది. వీటిలో చాలా వరకు సూపర్ హిట్ అవడంతో పాటు ఆమెకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. అందులో 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కూడా ఒకటి. బుల్లితెర, వెండితెరకు చెందిన సెలెబ్రిటీలు హాజరయ్యే ఈ షో విజయవంతంగా ప్రసారం అవుతోంది. దీనికి వచ్చిన వారికి శ్రీముఖి చుక్కలు చూపిస్తోంది.

ఆదివారం వాళ్లందరూ
వచ్చే ఆదివారం ప్రసారం కాబోతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' కార్యక్రమానికి హాట్ బ్యూటీలు ఆరియానా గ్లోరీ, అషు రెడ్డి, భాను, ఇనాయా సుల్తానాలతో పాటు సద్దాం, భాస్కర్, యాదమ్మ రాజు, జ్ఞానేశ్వర్‌లు రెండు టీమ్‌లుగా ఎంట్రీ ఇచ్చారు. వీళ్లంతా తమదైన రీతిలో షోలోకి ప్రవేశించి డ్యాన్సులు చేశారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది.

వాళ్లిద్దరూ షోకు దూరం
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో అవినాష్, ఫైమాలు తెగ సందడి చేస్తున్నారు. అయితే, ఈ వారం వాళ్లు కాకుండా ఎక్స్‌ప్రెస్ హరి వచ్చాడు. దీంతో శ్రీముఖి అతడిని ప్రశ్నించగా.. 'వాళ్లు రారు.. రానివ్వను. డైలాగులు చెప్పి, డ్యాన్సులు చేసే వాళ్లకే అంత ఉంటే.. వాళ్ల తలరాతను రాసే రైటర్‌ను నాకెంత ఉండాలి' అన్నాడు. తర్వాత వాళ్లను కిడ్నాప్ చేసినట్లు చూపారు.

ఆ టాటూ.. రెచ్చగొట్టేలా
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా యాంకర్ శ్రీముఖి 'అప్పుడు కామెడీ స్టార్స్ షోలో చూపించిన టాటూను మరోసారి చూడాలని ఉంది' అని కోరుకుంది. దీంతో అషు 'ఏదైనా చూడాలనుకో పర్లేదు కానీ.. టాటూ మాత్రం వద్దు' అని బదులిచ్చింది. ఆ తర్వాత ఆమెతో అవినాష్.. హరితో ఆరియానా గ్లోరీ డ్యాన్సులు చేసి ఒకరినొకరు రెచ్చగొట్టుకుంటూ మజాను పంచారు.
Jr NTR: ఎన్టీఆర్‌కు తప్పిన ప్రమాదం.. ఆ కుర్రాడు చేసిన పనితో కలకలం.. ఇక చేయను అంటూ తారక్ సీరియస్
https://telugu.filmibeat.com/news/fan-pulled-jr-ntr-at-vishwak-sen-das-ka-dhamki-event-118167.html
ఆర్జీవీ ఫోన్.. అషుకి కిస్
ఎంతో సందడిగా సాగిన 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో ముగ్గురు అమ్మాయిలతో రాంగోపాల్ వర్మకు ఫోన్ చేయించారు. కానీ, ఎవరీ కాల్ లిఫ్ట్ చేయని ఆయన.. అషుతోనే మాట్లాడారు. ఇది అయిపోయిన తర్వాత ఓ గేమ్ ఆడగా.. అందులో అషుకు హరి ముద్దు పెట్టాలని వచ్చింది. దీంతో అతడు తనలోని ప్రేమను మొత్తం బయట పెట్టేస్తూ మురిసిపోయాడు.

బలవంతంగానే ప్రపోజ్
ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్ హరి మోకాళ్లపై కూర్చుని మరీ అషు రెడ్డికి ప్రపోజ్ చేశాడు. దీంతో ఆమె ఒక్కసారిగా షాకైపోయింది. అంతేకాదు, తనకు అలాంటి ఫీలింగ్ లేదని కూడా చెప్పింది. అయినప్పటికీ హరి మాత్రం ఆమె అంటే చాలా ఇష్టం అని చెప్పాడు. మొత్తంగా అషుపై ఉన్న ప్రేమను మరోసారి వ్యక్తపరిచాడు. దీంతో ఈ ప్రోమో వీడియో విపరీతంగా వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











