స్టేజ్ మీదే ఐ లవ్యూ... అషూకు ప్రపోజ్ చేసిన ఎక్స్ ప్రెస్ హరి.. అంతా ఆ ముద్దు ఎఫెక్ట్!
బుల్లితెరపై వినోదపు కార్యక్రమాలంటే అందులో కచ్చితంగా లవ్ ట్రాకులు ఉండాల్సిందే. ప్రస్తుతం అన్ని షోలు అదే ఫార్మూలాను వాడేస్తున్నాయి. కొత్త జంటలు పుట్టుకొచ్చేలా తమ క్రియేటివిటీకి పదును పెడుతున్నారు. ఈక్రమంలో వర్ష ఇమ్మాన్యుయేల్ జంట వచ్చింది. ఇప్పుడు ఆ జంటకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు కామెడీ స్టార్స్ పుణ్యమా అని కొత్త జంట పుట్టింది.
బెడ్ మీద హాట్ ఫోజుతో బబ్లీ తెలుగు హీరోయిన్ (ఫోటోలు)

కామెడీ స్టార్స్..
బిగ్ బాస్ తరువాత మొదలైన కామెడీ స్టార్స్ షోలో అవినాష్ అంతా తానై ప్రారంభించేశాడు. అందులో తన స్నేహితురాలైన అరియానాను బాగానే వాడేస్తున్నాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్లైన సుజాత, అషూ రెడ్డిలను కూడా తీసుకొచ్చాడు. అదే విధంగా బొమ్మ అదిరింది టీంను కూడా లాగేశారు.
తెల్లచీరలో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ (ఫొటోలు)

హరి, అషూల రచ్చ..
అయితే గత రెండు వారాల నుంచి అషూ రెడ్డి ఎక్స్‌ప్రెస్ హరిల మధ్య ఏడో నడుస్తోన్నట్టుగా వ్యవహారం తేడా కొడుతోంది. అషూ రెడ్డి కోసం హరి కూడా ప్రయత్నాలు చేస్తోన్నట్టుగానే వెరైటీ స్కిట్లు వేస్తున్నాడు. హరి ప్రయత్నాలకు అషూ రెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగానే వ్యవహరిస్తోంది.
అంతా నవ్వులమయం: జాతిరత్నాలు సక్సెస్ జోష్ లో నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ (ఫొటోలు)

హగ్గులు, ముద్దులు..
గత వారం నాటి ఎపిసోడ్‌లో హరి, అషూలు రచ్చ రచ్చ చేశారు. ఏకంగా హగ్ ఇవ్వడమే కాదు బుగ్గ మీద ముద్దు పెట్టేసింది. దీంతో హరి అక్కడే కుప్పకూలిపోయాడు. ఆ ఘటనతో జడ్జ్‌గా ఉన్న శేఖర్ మాస్టర్ కూడా షాకైపోయాడు. అయితే ఆ ఎఫెక్ట్ ఇప్పుడు బాగానే కలిసి వచ్చినట్టుంది.

ప్రపోజ్ చేసేశాడు..
ఈ ఆదివారం ప్రసారం కాబోతోన్న కామెడీ స్టార్స్ షోకు సంబంధించిన ప్రోమో బయటకు వచ్చింది. ఇందులో రవి లాస్యలు చేసింది ఒకెత్తు అయితే చివర్లో అషూ, హరిలు చేసింది మరో ఎత్తు. స్కిట్‌లో భాగంగా చేశాడో ఏమో తెలియదు గానీ ఏకంగా ప్రపోజ్ చేసేశాడు హరి. అషూ ఐ లవ్యూ అంటూ చెప్పేశాడు. మొత్తానికి ఈ కొత్త జంటకు మాత్రం నెట్టింట్లో బాగానే మద్దతు లభిస్తోంది.

అలా వైరల్..
అషూ రెడ్డి ఆ మధ్య పవన్ కళ్యాణ్ విషయంలో బాగా ట్రోలింగ్‌కు గురైంది. పవన్ కళ్యాణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేయడం, వాటిపై పిచ్చి పిచ్చి కామెంట్లు రావడం, వాటికి అంతే స్థాయిలో అషూ రెడ్డి రిప్లై ఇవ్వడంతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. చివరకు పిచ్చి పిచ్చి వార్తలపై అషూ ఆగ్రహం వ్యక్తం చేసింది.


Click it and Unblock the Notifications











