స్టేజ్ పైనే అషురెడ్డికి లవ్ ప్రపోజ్ చేసిన కమెడియన్ హరి.. గుండెని గులాబీలా మార్చి!
టీవీ చానల్స్ టిఆర్పిల కోసం పలు ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాకులు పుట్టించడం ఈ మధ్య చాలా కామన్ గా మారిపోయింది. ఇప్పటికే సుధీర్ -రష్మీ, ఇమ్మానుయేల్- వర్ష, సుజాత -రాకేష్ వంటి జోడీలను పరిచయం చేసి ఈ టీవీ వాళ్ళు బాగా ప్రమోట్ చేస్తూ దానికి తగ్గ రేటింగ్స్, టిఆర్పిలు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక స్టార్ మా విషయానికి వస్తే పటాస్ ఫేమ్ హరి, అషు రెడ్డి మధ్య ఏదో ఉందని భ్రమ కల్పించి తద్వారా క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అసలు పార్టీ చేసుకుందాం పుష్ప రెండో ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

పార్టీ చేద్దాం పుష్ప 2
స్టార్ మాలో ఇటీవల పార్టీ చేద్దాం పుష్ప అనే ఒక కార్యక్రమం ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశారు. మొదటి భాగం సూపర్ హిట్ కావడంతో దానికి కూడా రెండో భాగం ప్లాన్ చేసి షూటింగ్ కూడా జరిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పార్ట్ టూ ప్రోమో కూడా విడుదలైంది. ఈ ఈవెంట్లో నాగబాబు, సుడిగాలి సుధీర్, అనసూయ సహా పలువురు కమెడియన్లు బిగ్ బాస్ బ్యూటీలు పాల్గొని అలరిస్తున్నారు.

ఎంకరేజ్ చేస్తూ
ఇక తాజా ఈవెంట్లో బిగ్ బాస్ భామ అషు రెడ్డికి కమెడియన్ ఎక్స్ ప్రెస్ హరి లవ్ ప్రపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. నిజానికి వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ ఉందని పలుసార్లు స్టార్ మా యజమాన్యం అనుమానం కలిగించే విధంగా పలు ప్రోగ్రామ్స్ ప్లాన్ చేశారు. హరి కూడా అషు రెడ్డి పేరు తన ఒంటి మీద టాటూ వేయించుకోవడం కూడా ఆసక్తికరంగా మారింది. ఇక అషు రెడ్డి కూడా ఎక్కడా తగ్గకుండా అతనికి బైక్ కొనివ్వడం మొదలు అనేక విషయాల్లో ఎంకరేజ్ చేస్తూ వస్తోంది.

గులాబీలా మార్చి
అయితే తాజాగా ఈ పార్టీ చేద్దాం పుష్ప 2 ప్రోమోలో చూపించిన దాని ప్రకారం హరి స్టేజ్ మీద ఆమెకు ప్రపోజ్ చేశాడు. అందరూ ఎప్పుడు ఆమె ఇస్తే తీసుకుంటావు కానీ నువ్వు ఆమెకు ఏమీ ఇవ్వవా అని అడుగుతున్నారు కానీ నేను ఆమె ఏమి ఇవ్వగలను నా గుండెని గులాబీలా మార్చి ఆమె గుమ్మం ముందు ఉంచడం తప్ప అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు హరి.

ఏం మాట్లాడిందో
ఆమె తన దేవత అని చెప్పుకొచ్చిన హరి ఆమెకు ప్రపోజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. హరి ఇలా ప్రపోజ్ చేయడంతో అషు రెడ్డి ఒక నిమిషం పాటు షాక్ కి గురైంది. దీంతో సుడిగాలి సుధీర్ హరి మీద నీ ఫీలింగ్ ఏమిటి అని అషు రెడ్డిని ప్రశ్నిస్తే దానికి ఆమె నవ్వుతూ రిప్లై ఇచ్చి కానీ ఆమె ఏం మాట్లాడింది అనే విషయాన్ని మాత్రం చూపించలేదు.

ఏమీ జరగలేదని
అయితే ఆమె కాస్త ఫైర్ అయ్యి ఉంటే కచ్చితంగా దాన్ని కూడా ప్రోమోలో చూపించేవారు కానీ ఆమె సానుకూలంగా స్పందించడంతో పెద్దగా ఏమీ జరగలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతే గాని దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపించడం లేదు.


Click it and Unblock the Notifications











