For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అషు రెడ్డి క్యారెక్టర్‌పై కమెడియన్ సంచలన వ్యాఖ్యలు.. అందుకే అలా చూపిస్తూ తిరుగుతుందంటూ!

  |

  సోషల్ మీడియా పుణ్యమా అని ఎంతో మంది అమ్మాయిలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వారిలో చాలా మంది ఇప్పుడు వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతున్నారు. అలాంటి వారిలో తెలుగు అమ్మాయి అషు రెడ్డి ఒకరు. తన అందచందాలతో ఇంటర్నెట్‌ను షేక్ చేసిన ఈ బ్యూటీ.. చాలా తక్కువ సమయంలోనే బిగ్ సెలెబ్రిటీగా మారిపోయింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే వరుసగా అవకాశాలను అందుకుంటూ బుల్లితెరపై కొంత కాలంగా హల్‌చల్ చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా అషు రెడ్డి క్యారెక్టర్‌పై ఓ కమెడియన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆమెను అలా పెంచారని.. అందుకే చూపిస్తూ తిరుగుతుందని షాకింగ్‌గా మాట్లాడాడు. ఇంతకీ ఏం జరిగింది? ఆ సంగతులు మీకోసం!

  అలా వచ్చింది.. జూనియర్ సమంతగా పేరు

  అలా వచ్చింది.. జూనియర్ సమంతగా పేరు

  కొన్నేళ్ల క్రితం డబ్‌స్మాష్ వీడియోలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీటి వల్లే చాలా మంది టాలెంట్ ఉన్న వాళ్లు వెలుగులోకి వచ్చారు. ఈ క్రమంలోనే తెలుగు బ్యూటీ అషు రెడ్డి కూడా ఎనలేని క్రేజ్‌ను దక్కించుకుంది. ఈ వీడియోల్లో చూడ్డానికి అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించిన ఈమె.. జూనియర్ సమంతగానూ పేరును తెచ్చుకుంది. ఆ తర్వాత యూత్ స్టార్ నితిన్ నటించిన ‘ఛల్ మోహనరంగ'లో కీలక పాత్రలో కనిపించి మెప్పించింది. దాని తర్వాత చాలా కాలం పాటు కనిపించని అషు రెడ్డి.. బిగ్ బాస్ మూడో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటింది.

  హాట్ ఫొటోతో హీటు పెంచిన లెజెండ్ హీరోయిన్: అరాచకమైన ఫోజుతో రెచ్చిపోయిన భామ

  అందులో బిజీ.. టాటూలు.. లవ్ ట్రాకులతో

  అందులో బిజీ.. టాటూలు.. లవ్ ట్రాకులతో

  అషు రెడ్డి ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ అందులో హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. ఇందులో భాగంగానే అప్పట్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును తన ప్రైవేట్ పార్ట్‌పై వేసుకున్న విషయాన్ని రివీల్ చేసింది. అలాగే, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లీగంజ్‌తో ప్రేమాయణం సాగిస్తున్నట్లు పోస్టులు పెట్టింది. ఇలా విచిత్రమైన వ్యవహార శైలితో గ్లామరస్ భామ అషు రెడ్డి తరచూ హాట్ టాపిక్ అవుతూనే ఉంది.

   ఆ కామెడీ షోలో సందడి చేస్తోన్న అషు రెడ్డి

  ఆ కామెడీ షోలో సందడి చేస్తోన్న అషు రెడ్డి

  సోషల్ మీడియా సెన్సేషన్‌గా గుర్తింపు పొందిన అషు రెడ్డి.. ఆ తర్వాత బిగ్ బాస్ షోతో తన ఫాలోయింగ్‌ను రెట్టింపు చేసుకుంది. ఇక, ఇప్పుడు మాత్రం ఈ అమ్మడు వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. ఇందులో భాగంగానే ప్రస్తుతం స్టార్ మాలో ప్రసారం అవుతోన్న ‘కామెడీ స్టార్స్' ద్వారా బుల్లితెరపైనా అషు రెడ్డి బిజీ అయింది. ఈ షోలో ఈ అమ్మడు తన అందచందాలను చూపించడంతో పాటు ప్రేక్షకులకు కామెడీని కూడా పంచుతూ తెగ సందడి చేస్తోంది. దీనితో పాటు యాంకర్ రవితో కలిసి ‘హ్యాపీడేస్' అనే డైలీ షో ద్వారా అషు రెడ్డి యాంకర్‌గా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది.

  హాట్ షోలో హద్దు దాటిన కరీనా కపూర్: బ్రాతో క్లోజప్ సెల్ఫీ.. రెచ్చిపోయి చూపించిన హీరోయిన్

  యంగ్ కమెడియన్‌కు ముద్దులు, హగ్గులు

  యంగ్ కమెడియన్‌కు ముద్దులు, హగ్గులు

  ‘కామెడీ స్టార్స్‌' షోలో అషు రెడ్డి ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించింది. అప్పటి నుంచి ఈ జంటను కూడా ప్రత్యేకంగా చూడడం మొదలు పెట్టారు ప్రేక్షకులు. అందుకు తగ్గట్లుగానే తరచూ వీళ్లిద్దరిపై నిర్వహకులు స్పెషల్ స్కిట్లు ప్లాన్ చేస్తున్నారు.

  లవ్ ట్రాకుపై క్లారిటీ.. గుండెలపై టాటూ వేసి

  లవ్ ట్రాకుపై క్లారిటీ.. గుండెలపై టాటూ వేసి

  ఎక్స్‌ప్రెస్ హరితో అషు రెడ్డి ప్రేమాయణం సాగిస్తుందన్న వార్తలు విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియా లైవ్‌లో హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. అతడితో ఉన్న రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది. కానీ, వీళ్లిద్దరూ మాత్రం స్కిట్లలో జంటగానే నటిస్తూ అనుమానాలు పెంచేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఎక్స్‌ప్రెస్ హరి తన ఛాతిపై అషు రెడ్డి పేరుతో పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు చూపించారు. అంతేకాదు.. ఈ ఎపిసోడ్‌లో ‘ఇది చెరిపితే చెరిగిపోయేది కాదు.. పర్మినెంట్ టాటూ' అని చెప్పి ఆమెతో పాటు అందరికీ షాకిచ్చాడు.

  సుడిగాలి సుధీర్‌పై దీపిక సంచలన వ్యాఖ్యలు: వద్దన్నా ఇంటికి వస్తాడంటూ మరీ దారుణంగా!

   అషు రెడ్డి డ్రెస్‌లపై ఎక్స్‌ప్రెస్ హరి కామెంట్స్

  అషు రెడ్డి డ్రెస్‌లపై ఎక్స్‌ప్రెస్ హరి కామెంట్స్

  వచ్చే ఆదివారం జరగనున్న ‘కామెడీ స్టార్స్' ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో ఎక్స్‌ప్రెస్ హరి.. అషు రెడ్డిని ప్రేమించే యువకుడిగా కనిపించాడు. ఎంట్రీ ఇచ్చిన సమయంలో ‘ఆ హీల్స్ ఏసుకుని ఎక్కడ పడిపోతావో అని భయమేస్తుంది' అని అన్నాడు హరి. దీనికి శేఖర్ మాస్టర్ ‘నువ్వు కింద చూడకు' అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు. ఆ తర్వాత అషు రెడ్డి అన్నగా వచ్చిన మహేశ్ విట్టా ‘మా చెల్లిని నెత్తి మీద పెట్టుకుని పెంచాం' అంటాడు. దీనికి ‘అంటే ఇంట్లో పెట్టి పెంచలేదన్న మాట. అందుకే ఇలాంటి బట్టలతో తిరుగుతుంది' అంటూ కామెంట్స్ చేశాడు.

  Shakalaka Shankar Corporator Movie Official Trailer Released | Filmibeat Telugu
  హగ్ చేయడానికి ప్లాన్.. చివరికి సాధించాడు

  హగ్ చేయడానికి ప్లాన్.. చివరికి సాధించాడు

  అషు రెడ్డి బట్టలపై కామెంట్స్ చేసే సమయంలో ఆమెను పైకీ కిందకు చూశాడు ఎక్స్‌ప్రెస్ హరి. దీంతో ఈ బ్యూటీ గ్లామర్ షో చేస్తుందని పరోక్షంగా చెప్పుకొచ్చాడు. ఇక, చివర్లో ఆమె వైపు బల్లిని విసిరేసి తనను హగ్ చేసుకునేలా ప్లాన్ చేస్తాడు. కానీ, ఆ బల్లి కంటే హరిని చూడడమే భయంగా ఉందని కామెంట్ చేస్తుంది అషు. ఆ తర్వాత ఆ బల్లిని తన మీద విసరమన్నాడతను. దీంతో అషు రెడ్డి అలా విసరగానే వెళ్లి ఆమెను గట్టిగా హగ్ చేసుకున్నాడు. అప్పుడు ఆమె ఎంత చెప్పినా వదిలి పెట్టలేదు. మొత్తానికి ఈ ప్రోమోతో జంట మరోసారి హైలైట్ అయింది. వీడియో వైరల్ అయింది.

  English summary
  Telugu Actress and model Ashu Reddy Now Doing Comedy Stars Show in Star Maa. Express Hari Now Did Sensational Comments on Ashu Reddy Dresses.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X