అషు రెడ్డి కొత్త లవ్ ట్రాక్: అందరి ముందే షాకిచ్చిన కమెడియన్.. అదే లేకపోతే కన్నీళ్లు వస్తాయా అంటూ!
ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకు అవకాశాలు దొరకవు అన్న టాక్ ఉంది. అయితే, అదంతా గతం. ఇప్పుడు ఎంతో మంది లోకల్ బ్యూటీలు వెండితెరతో పాటు బుల్లితెరపైనా సందడి చేస్తున్నారు. తద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను వరుస ఆఫర్లను అందుకుంటున్నారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ అషు రెడ్డి ఒకరు. అద్భుతమైన అందంతో పాటు యాక్టింగ్‌లోనూ రాణిస్తోన్న ఈమె.. కొద్ది రోజులుగా విచిత్రమైన వ్యవహార శైలితో షాకిస్తోంది. ఇందులో భాగంగానే ఓ కమెడియన్‌తో లవ్ ట్రాక్ నడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడు.. అషుకు షాకిచ్చాడు. ఆ వివరాలు మీకోసం!
బ్రాలో అందాలను ఆరబోసిన హీనా పంచల్.. బికినీలో అదరగొట్టిన యువ హీరోయిన్

సమంతలా కనిపిస్తూ.. సినిమాలో ఛాన్స్
అప్పట్లో డబ్‌స్మాష్ వీడియోలు ఎంత హల్‌చల్ చేశాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వీడియోల ద్వారానే అషు రెడ్డి ప్రపంచానికి పరిచయం అయింది. వాటిలో అచ్చం స్టార్ హీరోయిన్ సమంతలా కనిపించడంతో ఆమె ఫుల్ పాపులర్ అయింది. దీంతో జూనియర్ సామ్ అనే పేరును సొంతం చేసుకుంది. తద్వారా నితిన్ నటించిన 'ఛల్ మోహనరంగ'లో హీరోయిన్ ఫ్రెండ్‌గా ఛాన్స్ పట్టేసింది.

నిత్యం అందులోనే.. పవన్ టాటూతో రచ్చ
అషు రెడ్డి ఫేమస్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ అమ్మడు అందులో రచ్చ చేస్తోంది. ఒకానొక సందర్భంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పేరును తన ప్రైవేటు పార్టులో టాటూగా వేయించుకుని చూపించింది. ఇక ఇటీవల ఆయనను కలిసింది. ఆ సమయంలోనే నెటిజన్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం చెప్పి హాట్ టాపిక్ అయింది.

ఆ స్టార్స్‌తో కలిసి కామెడీని పంచుతుందిగా
స్టార్ మాలో 'కామెడీ స్టార్స్' అనే షో ప్రారంభం అయిన విషయం తెలిసిందే. ఇందులో అప్పటి హీరోయిన్ శ్రీదేవి, శేఖర్ మాస్టర్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. వర్షిణి యాంకరింగ్ బాధ్యతలు నిర్వహిస్తోంది. అవినాష్, చమ్మక్ చంద్ర, జోర్ధార్ సుజాతతో పాటు అషు రెడ్డి కూడా ఇందులో హల్‌చల్ చేస్తోంది. ఈ క్రమంలోనే షూటింగ్ స్పాట్‌లో తీసిన కొన్ని వీడియోలను వదులుతోంది.

కమెడియన్‌కు ముద్దులు.. హగ్గులు ఇచ్చి
అషు రెడ్డి కామెడీ స్టార్స్‌లో ఫుల్ టైమ్ ఆర్టిస్టుగా మారిపోయింది. దీంతో ఆమె కొన్ని స్కిట్లలోనూ నటిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల ఆమె ఎక్స్‌ప్రెస్ హరితో స్కిట్ చేసింది. ఇందులో అతడికి హగ్గులు, ముద్దులు పెట్టి అక్కడున్న వారితో పాటు ప్రేక్షకులను షాక్‌కు గురి చేసింది. ఆ తర్వాత కూడా అదే కంటిన్యూ చేసింది. దీంతో వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ సాగుతోందన్న టాక్ వినిపించింది.

అతడితో ప్రేమాయణంపై అషు రెడ్డి వివరణ
అషు రెడ్డి.. యాంకర్ రవితో కలిసి 'హ్యాపీ డేస్' అనే షో చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఎక్స్‌ప్రెస్ హరి స్క్రిప్టు రైటర్‌గా పని చేస్తుండగా.. ముక్కు అవినాష్ సోదరుడు అజయ్ కీలక పాత్రను పోషిస్తున్నాడు. వీళ్లంతా కలిసి సోషల్ మీడియాలో లైవ్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా హరి తనకు అన్నయ్యలాంటి వాడని చెప్పి.. అతడితో ఉన్న రిలేషన్‌పై అషు రెడ్డి క్లారిటీ ఇచ్చింది.
శేఖర్ మాస్టర్ బయట పెట్టిన వ్యవహారం
కామెడీ స్టార్స్ షోకు అషు రెడ్డి కొన్ని వారాలు రాలేదు. దీంతో శేఖర్ మాస్టర్ 'నువ్వు రాలేదని హరి ఎంత బాధపడ్డాడో తెలుసా? ఇప్పుడు నువ్వు ఇలా వచ్చేసరికి ఎంతో మారిపోయాడు.. ఆనందభాష్పాలు వచ్చేశాయ్.. అతడి ముఖంలో ఏదో తెలియని ఆనందం ఉంది' అంటూ హరి గురించి అషూకి చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలై వైరల్ అవుతోంది.

అందరి ముందే షాకిచ్చిన ఎక్స్‌ప్రెస్ హరి
శేఖర్ మాస్టర్ చెప్పిన తర్వాత ఎక్స్‌ప్రెస్ హరి మాట్లాడుతూ.. 'తనకు (అషు రెడ్డి) బాగా లేదని తెలిసింది. వెంటనే మార్నింగ్ ఫోన్ చేశాను. కానీ లిఫ్ట్ చేయలేదు. ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదంటే నిజంగానే బాగా లేదని అనుకున్నాను. కానీ.. అప్పుడు నాకు కన్నీళ్లు వస్తున్నాయని తెలియలేదు' అంటూ తన ప్రేమను బయట పెట్టాడు. దీంతో అక్కడున్న వాళ్లంతా షాక్‌కు గురయ్యారు.


Click it and Unblock the Notifications











