ఎక్స్‌ట్రా కామెడీ కావాలా నాయనా..
హైదరాబాద్ :ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఖతర్నాక్ కామెడీ షో 'జబర్దస్త్'. దీనికి మరికాస్త వినోదం పూత జోడించి 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'గా రూపొందించాయి ఈటీవీ- మల్లెమాల ఎంటర్‌టైన్మెంట్స్. ఇందులోనూ నాగబాబు, రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమం నేటి నుంచి ప్రతి శుక్రవారం రాత్రి 9.30కు ఈటీవీలో ప్రసారమవుతుంది.

తెలుగు టీవీ ప్రేక్షకులను గత కొద్దికాలంగా నవ్విస్తోన్న పోగ్రాం జబర్దస్త్. ఈ పోగ్రాం ఇప్పుడు 'ఎక్స్‌ట్రా జబర్దస్త్' గా మారి రంగం సిద్ధమైంది. నేటి నుంచి నవ్వులు పంచడానికి సర్వం సన్నద్ధమైంది. ఈ సందర్భంగా నాగబాబు, రోజాల మనోభావాలు, కొత్త జబర్దస్త్
నాగబాబు మాట్లాడుతూ... ''ప్రేక్షకులను నవ్వించడమే ధ్యేయంగా పెట్టుకొని 'జబర్దస్త్'ను రూపొందించారు. వారంలో ఒక్కరోజు మాత్రమేనా రెండు రోజులకు పెంచితే ఎలా ఉంటుంది అనే ఆలోచనే మా 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'. గురువారం నవ్విస్తున్నారు కదా మళ్లీ శుక్రవారం కూడా నవ్వించాలా అని అన్నారు కొందరు. ఒకసారి వినోదం పంచితే రెండోసారి నవ్వించకూడదా? ఎక్కువసార్లు నవ్విస్తే చిరాకు రాదు కదా. నవ్విస్తే మేం నవ్వం అని ఎవరూ అనరు కూడా. ఇంకాస్త నవ్వుకుంటాం అంటారు. నవ్వు మనసుకు, మనిషికి ఎంతో లాభం చేకూరుస్తుంది. అందుకే మా 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'తో ఇంకొంచెం నవ్వుకొండి'' అన్నారు.

రోజా మాట్లాడుతూ... ''తెలుగు టీవీ ఛానల్స్‌లో జబర్దస్త్ బ్రాండ్‌గా మారిపోయింది. కుటుంబం మొత్తం చూసి ఆనందిస్తోంది. కుటుంబం మొత్తం చూసి నవ్వుకుంటున్నామని నన్ను కలసినవారు చెప్పేవారు. ఇప్పుడు దాన్ని మరో రోజు పొడిగించి 'ఎక్స్‌ట్రా జబర్దస్త్'గా తీసుకురావడం ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం వల్ల ప్రజల ఆరోగ్యం చాలా బాగుంది. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల మనసు, ఆరోగ్యం ప్రశాంతంగా ఉంటోంది. ఈ కార్యక్రమం వల్ల ఇప్పటివరకు చాలా మంది కమేడియన్లకు మంచి జీవితం వచ్చింది. ఇప్పుడు మరో రోజు పెరిగింది కదా ఇంకా ఎక్కువమందికి ఉపయోగపడుతుంది'' అన్నారు రోజా.


Click it and Unblock the Notifications











