రష్మీ సుధీర్ రొమాన్స్‌తో రచ్చ: అనసూయ, ఆదికి షాక్.. షోలో ఇంత జరుగుతుందా.?

By Manoj

జబర్ధస్త్... తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యధిక స్థాయిలో టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్న కామెడీ షో. రెండు రాష్ట్రాలకు చెందిన ప్రేక్షకులు గురు, శుక్రవారాల కోసం ఎదురుచూసేలా ప్రభావాన్ని చూపిస్తోందీ షో. దాదాపు ఏడేళ్లుగా విజయవంతంగా ప్రదర్శితమవుతూ ఎన్నో రికార్డులను తిరగరాసిన జబర్ధస్త్‌.. సరికొత్త ప్రయోగాలతో ముందుకు వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో జబర్ధస్త్‌గా సాగుతున్న ఈ కామెడీ షోలో అంతర్గతంగా జరుగుతున్న ఓ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఈ న్యూస్ హాట్ టాపిక్ అవుతోంది. ఆ వివరాలు మీకోసం.!

కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చిన షో

కొన్ని వందల మందికి లైఫ్ ఇచ్చిన షో

జబర్ధస్త్ షో ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదటి నుంచీ ఈ షోకు వస్తున్న రెస్పాన్సే దానికి నిదర్శనం. ఇంతటి విజయవంతమైన షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. టాలెంట్ ఉండి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న కొన్ని వందల మంది ఆర్టిస్టులను అక్కున చేర్చుకుందీ షో. అందుకే ఈ షో సూపర్ సక్సెస్ అవుతోంది.

జబర్ధస్త్ వల్ల వాళ్లూ పాపులర్ అయ్యారు

జబర్ధస్త్ వల్ల వాళ్లూ పాపులర్ అయ్యారు


చాలా మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను ఇండస్ట్రీకి పరిచయం చేసిందీ జబర్దస్త్ షో. ప్రస్తుతం వాళ్లంతా సెలెబ్రిటీ హోదాను అనుభవిస్తున్నారు. వాళ్లతో పాటు యాంకర్లు అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్‌కు కూడా ఎనలేని క్రేజ్ రావడం వెనుక షో పాత్ర ఎంతో ఉంది. అలాగే, న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించే సీనియర్ హీరోయిన్ రోజా, నాగబాబుకు కూడా మంచి పేరొచ్చింది.

ఆయన వెళ్లిపోవడంతో డౌట్లు మొదలు

ఆయన వెళ్లిపోవడంతో డౌట్లు మొదలు

చాలా కాలంగా జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించాడు మెగా బ్రదర్ నాగబాబు. ఆయన కొన్ని రోజుల క్రితం షో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అంతేకాదు, మరికొంత మందిని తీసుకుని వేరే చానెల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ సమయంలో జబర్దస్త్ షోపై నీలినీడలు కమ్ముకున్నాయి. అదే సమయంలో షో ప్రసారాలపై ఎన్నో సందేహాలు చుట్టుముట్టిన విషయం తెలిసిందే.

తగ్గలేదు... మరింత పెరిగిన స్పందన

తగ్గలేదు... మరింత పెరిగిన స్పందన

దర్శకులు నితిన్, భరత్, నాగబాబు, చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలు కలిసి ‘అదిరింది' అనే కామెడీ షోను ప్రారంభించారు. దీంతో జబర్ధస్త్‌ రేటింగ్ పడిపోతుందని అంతా భావించారు. కానీ, దానికి భిన్నంగా జరిగింది. నాగబాబు అండ్ టీమ్ చేస్తున్న షో కంటే దీనికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ క్రమంలోనే భారీ రేటింగ్, అత్యధిక వ్యూస్ సాధిస్తూ జబర్ధస్త్ దూసుకుపోతోంది.

హైపర్ ఆది, అనసూయకు భారీ షాక్

హైపర్ ఆది, అనసూయకు భారీ షాక్


క్లిష్ట సమయంలోనూ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోన్న జబర్ధస్త్ గురించి తాజాగా బయటకు వచ్చిన ఓ న్యూస్ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ప్రచారం అవుతోన్న సమాచారం ప్రకారం... లాక్‌డౌన్ తర్వాత నుంచి ప్రస్తారం అయిన ఎపిసోడ్స్‌కు... భారీ క్రేజ్ ఉన్న హైపర్ ఆది, యాంకర్ అనసూయ చేస్తున్నప్పటికీ జబర్ధస్త్‌కు తక్కువ రేటింగ్ వస్తుందట.

రష్మీ సుడిగాలి సుధీర్ రొమాన్స్‌తో రచ్చ

రష్మీ సుడిగాలి సుధీర్ రొమాన్స్‌తో రచ్చ

జబర్దస్త్ షో వారంలో రెండు రోజులు ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఇందులో గురువారం జబర్ధస్త్, శుక్రవారం ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ వస్తుంటాయి. వీటిలో యూట్యూబ్ జోడీగా పేరొందిన రష్మీ, సుధీర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ రేటింగ్‌లో దూసుకుపోతుందట. ఇది జబర్దస్త్‌ను సైతం బీట్ చేసిందని అంటున్నారు. దీనికి కారణం రష్మీ సుధీర్ మధ్య నడిస్తున్న ట్రాకే అని టాక్.

Recommended Video

Jabardasth Comedian నా పెళ్లి జరగకపోతే అందుకు కారణం Sreemukhi, Jhansi నే
జబర్ధస్త్‌లో ఇంత జరుగుతుందా.?

జబర్ధస్త్‌లో ఇంత జరుగుతుందా.?


వాస్తవానికి ఒక ఛానెల్‌.. మరో ఛానెల్‌లో ప్రసారం అయ్యే షోల మధ్య పోటీ ఉంటుంది. అంతెందుకు ఒకే ఛానెల్‌లో వచ్చే రెండు షోల మధ్యా ఆ తరహా పరిస్థితి కనిపిస్తుంది. అయితే, జబర్ధస్త్ విషయంలో మాత్రం వేరుగా ఉంటుందట. జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ మధ్య ఎంతో పోటీ ఉంటుందట. రేటింగ్ కోసం వీళ్లంతా ఎంతగానో కష్టపడుతుంటారని ప్రచారం జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X