Jabardasth లోకి మరో సీనియర్ హీరోయిన్.. రష్మి గౌతమ్, జోర్ధార్ సుజాత కన్య కాదని సెటైర్లు!

బుల్లితెర ప్రపంచంలో గత కొన్నేళ్లుగా నెంబర్ వన్ కామెడీ షోగా జబర్దస్త్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవలే షోకు సంబంధించిన కొన్ని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. విబేధాలు రావడం వల్లనే జడ్జీలు, కంటెస్టెంట్స్ జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిపోతున్నట్లు టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు జబర్దస్త్ లోకి మరో కొత్త జడ్జ్ రావడం జరిగింది. ఇక ఆ ఎపిసోడ్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కమెడియన్స్ షాక్ ఇచ్చారు. ఇక నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ కాబోయే ఆ ఎపిసోడ్ ప్రోమో కూడా వచ్చేసింది. వివరాల్లోకి వెళితే..

ఆ కారణంగా జడ్జీలు జౌట్

ఆ కారణంగా జడ్జీలు జౌట్

మొదట్లో జబర్దస్త్ ఆ తరువాత ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలతో జడ్జిలుగా నాగబాబు, రోజా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే వారిద్దరూ కూడా కూడా వివిధ కారణాల వలన ఈ కామేడి షో నుంచి బయటకు వెళ్లిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా నాగబాబు అయితే అక్కడ నిర్వాహకుల కారణంగానే వెళ్లిపోయినట్లు చాలా క్లారిటీగా అర్ధమయ్యింది. అనంతరం రోజా మాత్రం రాజకీయ పరిస్థితుల వలన వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఖుష్బూ సుందర్ ఎంట్రీ

ఖుష్బూ సుందర్ ఎంట్రీ

ఇక వారు వెళ్ళిపోవడం తో చాలామంది సినీ ప్రముఖులు జబర్దస్త్ లో జడ్జీలుగా వచ్చారు. అయితే ఎవరు కూడా నిలకడగా కొనసాగలేకపోయారు. ఇక సింగర్ మనో, సీనియర్ నటి ఇంద్రజ కొన్నాళ్ళు ఉన్నప్పటికీ ఆ తరువాత మనో గ్యాప్ ఇచ్చాడు. ఈ తరుణంలో న్యూ ఎపిసోడ్ కు మరో సీనియర్ నటి ఖుష్బూ సుందర్ ఎంట్రీ ఇచ్చారు. వచ్చి రావడంతోనే ఆమె యాంకర్ రశ్మితో కలిసి స్టెప్పులు వేశారు.

చెంబుతో లండన్

చెంబుతో లండన్

నల్లని స్టైలిష్ డ్రెస్ లో ఖుష్బూ ఎక్స్ ట్రా జబర్దస్త్ లోకి రావడం సరికొత్త వాతావరణం క్రియేట్ అయ్యింది. ఇక ఆమె హావభావాలతో ఎంతగానో మెప్పించారు. ఇక మిగతా కమెడియన్స్ కూడా ఖుష్బూ పాత సినిమాలపై పంచ్ లు వేశారు. బుల్లెట్ భాస్కర్ అయితే చెంబుతో లండన్ స్కిట్ చేసి షాక్ ఇచ్చాడు. ఫైమా కూడా ఖుష్బూ తరహాలో కామెడీగా రెడీ అయ్యి పర్ఫెమెన్స్ ఇచ్చింది. ఇక బుల్లెట్ భాస్కర్ బుల్లెట్ స్ట్రైట్ గానే బుల్లెట్ దించినట్లు ఖుష్బూ చెప్పింది.

రష్మి చేయి పట్టుకున్న రామ్ ప్రసాద్

రష్మి చేయి పట్టుకున్న రామ్ ప్రసాద్

ఆటో రామ్ ప్రసాద్ కూడా ఖుష్బూ గురించి చెబుతూ మీ కోసం ఫ్యాన్స్ గుడి కట్టారాని ఇక్కడే ఉంటే మేము కూడా కట్టేస్తామని అన్నారు. ఇంకా కట్టలేదా అంటూ ఖుష్బూ కూడా కౌంటర్ ఇచ్చింది. అనంతరం డాక్టర్ తరహాలో రష్మి చేయి చూసిన రామ్ ప్రసాద్ కంగ్రాట్స్ గుడ్ న్యూస్ అంటూ ఆమె పై డబుల్ మీనింగ్ పంచ్ వేశాడు. అలాగే రామ్ ప్రసాద్ తో అన్నపూర్ణ కూడా తనదైన కామెడీతో మెప్పించారు.

 సుజాత కన్య కాదంటూ..

సుజాత కన్య కాదంటూ..

ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లో ఏకంగా సుజాత పై సెటైర్ వేశారు. అమ్రీష్ దోష అంటూ వచ్చిన కమెడియన్ దేవకన్యగా జోర్ధార్ సుజాతను చూస్తూ ఈ కన్య మాములు కన్య కాదు.. దగ్గరి నుంచి చూస్తే అసలు కన్యే కాదని దారుణంగా జోక్ వేయడం షాక్ అనిపించింది. సుజాత తనలో తానే నవ్వేసుకుంది. ఇక కమెడియన్స్ ఈసారి హద్దులు దాటేసి మరింత ఘాటైన డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రాబోతున్నట్లు అర్థమవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X