Extra Jabardasth: జబర్దస్త్‌ జడ్జీగా కుష్భూ ..అలా దారుణంగా ఆడుకున్న బుల్లెట్ భాస్కర్!

Extra Jabardasth: అద్భుతమైన కామెడీ, అదిరిపోయే పంచులతో ఎప్పుడూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంలో ముందు ఉంటుంది ఎక్స్ ట్రా జబర్దస్త్. ప్రతీ శుక్రవారం ఈ షో చూసేందుకు చాలా మంది తెగ వేచి చూస్తుంటారు. కమెడియన్లు చేసే స్కిట్లు చూస్తూ తెగ నవ్వుకుంటారు. వాళ్లు ఒకరిపై ఒకరు వేసుకునే పంచులు వింటూ సంబర పడిపోతుంటారు. అయితే తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. అందులో జడ్డిలతో పాటు కమెడియన్లు చేసిన అల్లరి, సందడి అందరినీ నవ్విస్తోంది.

అయితే ప్రోమో ప్రారంభంలోనే ఇస్మార్ట్ ఇమ్మాన్యుయెల్ చేసిన స్కిట్ ను చూపించారు. అందులో కుర్రాళ్లు, కుర్రాళ్లు వెర్రెక్కి ఉన్నోళ్లు పాటతో ఇమ్మాన్యుయెల్ టీం ఎంట్రీ ఇచ్చింది. అదిరిపోయే గెటప్లలో ఉన్న కమెడియన్లు.. అంతకు మించిన పంచులతో నవ్వులు పూయించారు. ముందుగా బాబు పక్కింటి రత్తాలు రమ్మని పిలిచిందని చెబితే.. ఇమ్మాన్యుయెల్ నిన్ను వెళ్లనీయను తమ్ముడూ అంటాడు. ఎందుకు అని అన్నయ్యా బాబు అడిగితే.. నిన్ను చిన్న చిన్న వ్యవసాయ పనులకే పంపించలేదు, అలాంటిది ఇంత పెద్ద పనికి ఒక్కడిని ఎలా పంపిస్తానంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ కొడతాడు. ఈ పంచుకు అంతా కడుపుబ్బా నవ్వుతారు.

Extra Jabardasth Latest Promo Released And Its Hilarious Episode Telecasts on October 13th

ఇక ఆ తర్వాత బుల్లెట్ భాస్కర్ టీం స్టేజీపైకి రాగా.. కుష్భూ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. ఈక్రమంలోనే ఓ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు చూపించి.. అందులో భాస్కర్ కు, కుష్భూ అక్కగా నటించబోతున్నట్లు చెబుతారు. దీనికి భాస్కర్ ఫుల్లుగా హర్ట్ అవుతాడు. ముఖ్యంగా కుష్భూ నీకు అక్క క్యారెక్టర్ అని చెప్పగానే.. బుల్లెట్ భాస్కర్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్ అదిరిపోయింది. ఇక ఆ ర్వాత కుష్భూ క్యూట్ క్యూట్ గా చెప్పే డైలాగ్లు, బుల్లెట్ భాస్కర్ ఇచ్చే ఎక్స్ ప్రెషన్లు చూస్తుంటే ఎవర్రైనా కడుపు నొప్పి వచ్చేదాకా నవ్వాల్సిందే.

ఇక ఆ తర్వాత రాకింగ్ రాకేష్ టీం స్టేజీపైకి వస్తుంది.. కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలు ఇదేనా అంటూ రాకేష్ రాగానే.. చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పు విసురుతాడు. నా కూతురితో నీకేం మాటలు అంటూ ఫైర్ అవుతాడు. ఈక్రమంలోనే వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా.. ఓ వ్యక్తి వీడియో తీస్తాడు. అతడు నా వీడియోలు తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడంటూ చైల్డ్ ఆర్టిస్ట్ చెప్పే డైలాగ్స్ అదిరిపోయాయి. మీరెక్కడికి వెళ్తున్నారని రాకేష్ ను అడిగితే.. ఇదెక్కడికి వెళ్తే అక్కడి వరకు అని అతడు సమాధానం ఇస్తాడు. దీనికి సుజాత గట్టిగా నవ్వుతుంది. ఇందుకు చైల్డ్ ఆర్టిస్ట్.. గట్టిగా నవ్వకే గుక్కపట్టి చస్తావ్ అని చెప్పే డైలాగ్ భలే కామెడీగా అనిపిస్తోంది.

ఆ తర్వాత ఆటో రాం ప్రసాద్ టీం స్టేజీపైకెక్కగా... రాకెట్ లో వెళ్తున్నట్లు చూపిస్తారు. ఆయన టీంలోంచి ఓ వ్యక్తి లేచి ఇక్కడు వన్, టూ వస్తే ఏం చేయాలంటాడు. ఆపుకోవాలని రాంప్రసాద్ చెప్పగా.. మరి మూడొస్తే అని అంటాడు. అందుకు రాంప్రసాద్ ఓ గొడుపు చూపించి ఇదేంటని అడుగుతాడు. అందుకు అతను గొడుగు అనగానే.. అడుగు లోపలికి దిగుతుందంటూ గొడుగు చూపించే డైలాగ్ అందరినీ నవ్వించింది. ఆ తర్వాత రాకెట్ లో ఓ వ్యక్తి సిగరెట్ తాగబోతుండగా.. రాంప్రసాద్.. రాకెట్ లో సిగరెట్ ఎంట్రా అంటాడు. నీ రాకెట్ కు వచ్చే పొగ ముందు ఇదెంత అంటూ నవ్వించే ప్రయత్నం చేశారు.

ఫుల్లు కామెడీ, అద్భుతమైన పంచులతో అందరినీ నవ్వించేందుకు సిద్ధమైన ఈ ఎపిసోడ్.. శుక్రవారం రోజు ప్రసారం కాబోతుంది. అన్ని టీంల స్కిట్లతో పాటు వారు చేసే కామెడీ చూడాలంటే శుక్రవారం రోజు వరకూ ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X