పూర్తిగా ఆగిపోతున్న జబర్ధస్త్ షో: ఆరోజు ఎపిసోడ్‌తో ఆఖరు.. ఎందుకో తెలిస్తే అవాక్కవుతారు!
దాదాపు దశాబ్ద కాలంగా తెలుగు బుల్లితెరపై తిరుగులేని షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఇది ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చి.. ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది. ఫలితంగా మరే షోకూ దక్కనంత రేటింగ్‌తో దూసుకుపోతోంది. మొదట ఒక్కరోజు మాత్రమే వచ్చిన ఇది.. ఆ తర్వాత ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ పేరుతో రెండో రోజు కూడా ప్రసారం అయింది. ఇలా చాలా ఏళ్లుగా ప్రభావాన్ని చూపిస్తూ వెళ్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జబర్ధస్త్ షో ఆగిపోబోతుంది. ఈ విషయాన్ని ప్రోమోలో ప్రకటించారు. అసలేం జరిగిందో మీరే చూడండి!
వందల సంఖ్యలోనే వచ్చారు:జబర్ధస్త్ షో 2013లో ప్రారంభం అయింది. అప్పుడు వారంలో ఒకరోజు మాత్రమే ప్రసారం అయిన ఈ షో.. కొద్ది రోజుల తర్వాత రెండు రోజులకే చేరింది. ఈ క్రమంలోనే జబర్ధస్త్‌లోకి ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు వచ్చారు. వీరిలో చాలా మంది పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్లంతా సెలెబ్రిటీలుగా వెలుగొందుతున్నారంటే ఈ షోనే కారణం అని తెలిసిందే.

ఆర్టిస్టులే కాదు.. వాళ్లు కూడా:జబర్ధస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది టాలెంట్ వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అదే సమయంలో ఈ షోకు జడ్జ్‌లుగా వ్యవహరించిన సీనియర్ హీరోయిన్ రోజా, మెగా బ్రదర్ నాగబాబు, ఇంద్రజ కూడా మరింతగా హైలైట్ అయ్యారు. వాళ్లు మాత్రమే కాదు.. ఈ షోకు యాంకర్లుగా చేసిన రష్మీ గౌతమ్, అనసూయ భరద్వాజ్ పెద్ద పెద్ద స్టార్లుగా మారిపోయారు.
వాళ్లు వెళ్లడంతో వీళ్లందరినీ:సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతున్న జబర్ధస్త్ షోలో ఉన్నట్లుండి కుదుపులు వచ్చాయి. మొదటి నుంచీ ఈ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తున్న నాగబాబు, ఆ తర్వాత రోజా షో నుంచి వెళ్లిపోయారు. అలాగే మొదటి తరం కమెడియన్లు కూడా ఈ షోకు దూరం అయ్యారు. దీంతో జడ్జ్‌లు, యాంకర్లు, టీమ్ లీడర్లు, కమెడియన్లను కొత్త వాళ్లను తెచ్చి షోను మరింత ఫన్నీగా నడిపే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంద్రజ కూడా బయటకు:జబర్ధస్త్ షో నుంచి నాగబాబు, రోజా వెళ్లిపోయిన తర్వాత ఎంతో మంది జడ్జ్‌లుగా వచ్చారు. కానీ, వాళ్లందరిలోనూ ప్రత్యేకంగా నిలిచింది మాత్రం ఇంద్రజనే అన్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఆమె షోను సక్సెస్ చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. కానీ, వచ్చే వారం నుంచి జబర్ధస్త్ నుంచి ఇంద్రజ తప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ప్రోమోలో చూపించారు.
షో మొత్తాన్నే ఆపేస్తున్నారు:జబర్ధస్త్, ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ ప్రారంభం అయిన తర్వాత లాక్‌డౌన్ సమయంలో తప్పితే ఎప్పుడూ ఆగిపోలేదు. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా ఈ రెండు షోలనూ నిర్వహకులు సక్సెస్‌ఫుల్‌గా నడిపించారు. కానీ, ఇప్పుడు ఈ వారం నుంచే ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు, ఇకపై గురు, శుక్రవారాల్లో జబర్ధస్త్ మాత్రమే ప్రసారం అవుతున్నట్లు తాజాగా వచ్చిన ప్రోమోలో చెప్పారు.
ఆటో రాంప్రసాద్ కామెంట్స్:ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్ షోను ఆపేస్తున్నట్లు ఆటో రాంప్రసాద్ తన స్కిట్ ద్వారా తెలిపాడు. 'మాకు రెండు కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రెండింటినీ కలిపి ఒకటే చేస్తానంటున్నారు. నేను ఫస్ట్ నుంచీ ఇందులోనే ఉన్నాను. షడన్‌గా వెళ్లిపోతుంటే బాధగా ఉంది. ఎందులోకి వెళ్లినా సంపాదిస్తాము కానీ, ఇందులో సంతోషం ఉంటుంది' అంటూ తన బాధను వ్యక్తం చేశాడు.

అసలు ఎందుకిలా చేశారు?:ఆ తర్వాత రాంప్రసాద్ 'మన పేరు ముందు ఇంటి పేరు ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు అది మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అనంతరం యాంకర్ రష్మీ 'ఎక్స్‌స్ట్రా' పదం మిస్ అవుతుంది. కానీ రెండు ఎపిసోడ్స్ వస్తాయి' అని చెప్పింది. మొత్తానికి ఈ షో రెండు రోజులు వచ్చినా 'ఎక్స్‌స్ట్రా' అనేది మాత్రం ఉండదని చెప్పారు.


Click it and Unblock the Notifications











