అషు బాయ్‌ఫ్రెండ్‌కు ఫైమా ముద్దులు: లవర్ ఉన్నా రెచ్చిపోయిన పిల్ల.. చివరకు బలవంతం చేశారంటూ!

గతంలో కంటే ఈ మధ్య కాలంలో తెలుగు బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు. అందులో కొందరు మాత్రమే తమదైన టాలెంట్లను చూపించి స్టార్లుగా సత్తా చాటుతోన్నారు. అలాంటి వారిలో ఫైమా ఒకరు. చాలా తక్కువ సమయంలోనే జబర్ధస్త్ షోలో టాప్ కమెడియన్‌గా ఎదిగిన ఈ భామ.. బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన క్రేజ్‌ను మరింతగా పెంచుకుంది. కానీ, మధ్యలోనే ఎలిమినేట్ అయినా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ షోలో ఫైమా ఓ కమెడియన్‌కు ముద్దులు పెట్టింది. ఆ పూర్తి వివరాలు మీకోసం!

అలా పరిచయం.. జబర్ధస్త్‌లో

అలా పరిచయం.. జబర్ధస్త్‌లో

ఫైమా 'పటాస్' అనే షో ద్వారా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. దీంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తుతోన్నాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లలో భాగం అయింది. తద్వారా కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తూ క్రేజ్‌ను పెంచేసుకుంది.

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

బిగ్ బాస్ ఎంట్రీతో పాపులర్

బిగ్ బాస్ ఆరో సీజన్లో 21 మంది కంటెస్టెంట్లను ఒకేసారి ఇంట్లోకి పంపించారు. అందులో జబర్ధస్త్ ఫైమా లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే యమ ఫోకస్ అయింది. అంతేకాదు, ఆరంభం నుంచే ఆటకు ఆటతో పాటు ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందించి విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా అందుకుంది. దీంతో ఎన్నోసార్లు ఎలిమినేషన్‌ను కూడా తప్పించుకుంది.

ఎలిమినేట్ అయినా మంచే

ఎలిమినేట్ అయినా మంచే

బిగ్ బాస్ షోలో తనదైన ఆటతీరు, వినోదంతో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న జబర్ధస్త్ ఫైమా.. కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడప్పుడూ గొడవలు పడుతూ విమర్శలను ఎదుర్కొంది. అదే ఆమెకు మైనస్‌గా మారింది. దీంతో ఈ చిన్నది 13వ వారంలో ఎలిమినేట్ అయింది. మొత్తానికి ఈ షోతో ఆమెకు మంచి పేరు లభించింది.

వరుస ఆఫర్లు... ఆ షోలలో

వరుస ఆఫర్లు... ఆ షోలలో


బిగ్ బాస్ షో పుణ్యమా అని ఫైమాకు క్రేజ్ పెరగడంతో పాటు ఆఫర్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఇప్పుడు 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో సూర్యతో కలిసి సందడి చేస్తోంది. అలాగే, 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో కూడా భాగం అయింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ ఈవెంట్లను కూడా చేస్తూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోంది.

రియల్ జోడీలతో పరివారం

రియల్ జోడీలతో పరివారం

ప్రతి ఆదివారం ప్రసారం కాబోతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ప్రేక్షకులను యమా అలరిస్తూ సాగిపోతోంది. ఇందులో యాంకర్ శ్రీముఖి చేసే అల్లరితో పాటు గెస్టుల హడావిడి బాగుంటుంది. ఇక, వచ్చే ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు ప్రేమికుల రోజును సందర్భంగా రియల్ జోడీలు రాబోతున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయింది.

అతడికి జోడీగా ఫైమా రాక

అతడికి జోడీగా ఫైమా రాక


'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా శ్రీముఖి 'ఇప్పుడు స్టేజ్ మీదకు మరో ప్రేమికుల జంట రాబోతుంది' అని ప్రకటించగానే.. ఫైమా - ఎక్స్‌ప్రెస్ హరి ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ ఎంట్రీ ఇచ్చారు. అప్పుడతను 'నువ్వెందుకు నిన్న నా దగ్గర లేవు' అనగా.. ఫైమా 'నా ఫ్రెండ్‌కు హార్ట్ ఇచ్చేసి వచ్చా. ఎందుకంటే నాకు నువ్వు ఉన్నావు కదరా' అంటూ డైలాగ్ కొట్టింది.

ముద్దులతో రచ్చ.. ట్రోల్స్

ఇక, ఈ షోలో భాగంగా జబర్ధస్త్ ఫైమా.. ఎక్స్‌ప్రెస్ హరికి ముద్దు పెట్టింది. ఆ వెంటనే అతడు కూడా ఆమెకు కిస్ ఇచ్చాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. ఆ తర్వాత హరి 'నా జీవితంలో చేయలేనివి అన్నీ చేయిస్తున్నారురా' అని అన్నాడు. ఇక, ఫైమా అతడికి ముద్దు పెట్టడంతో.. జబర్ధస్త్ ప్రవీణ్ గురించి ప్రస్తావిస్తూ చాలా మంది ఆమెను విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X