ప్రతి రాత్రి ఫస్ట్ నైటే అంటూ రెచ్చిపోయిన ఫైమా: ఆపుకోలేక అక్కడ పట్టుకుని మరీ దారుణంగా!
తెలుగు బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది లోకల్ అమ్మాయిలు తెగ సందడి చేస్తోన్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే అసాధారణమైన ప్రతిభతో సత్తా చాటుతోన్నారు. వారిలో జబర్ధస్త్ ఫేం ఫైమా ఒకరు. లేడీ కమెడియన్‌గా కెరీర్‌ను ఆరంభించిన ఈ చిన్నది.. అనతి కాలంలోనే ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకుంది. ఫలితంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇప్పుడు ఓ ఫేమస్ షోలో భాగం అయింది. ఇందులో ఆమె నాటీ కామెంట్స్ చేసి షాకిచ్చింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన వివరాలు మీకోసం!

పటాస్‌లా వచ్చి జబర్ధస్త్‌గా
'పటాస్' అనే షో ద్వారా ఫైమా వెలుగులోకి వచ్చింది. అయితే, అది ఆగిపోవడంతో ఈ చిన్నది జబర్ధస్త్‌లోకి వచ్చింది. అందులో తనదైన కామెడీతో అలరించిన ఈ బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ క్రేజ్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆఫర్లు భారీగా వచ్చాయి. ఇలా ఇప్పటికే ఎన్నో షోలు, ఈవెంట్లను చేసి తన కెరీర్‌ను జబర్ధస్త్‌గా సాగిస్తూ దూసుకుపోతోంది.

బిగ్ బాస్‌తో క్రేజ్ రెట్టింపు
గత ఏడాది ప్రసారం అయిన బిగ్ బాస్ ఆరో సీజన్‌లో 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో జబర్ధస్త్ ఫైమా లేడీ కమెడియన్‌గా ఎంట్రీ ఇచ్చి.. ఆరంభంలోనే యమ ఫోకస్ అయింది. అంతేకాదు, ఆరంభం నుంచే ఆటకు ఆటతో పాటు వినోదాన్ని కూడా అందించి విశేషమైన పేరు ప్రఖ్యాతలను కూడా దక్కించుకుంది. దీంతో ఎన్నోసార్లు ఎలిమినేషన్ నుంచి సేఫ్ అయింది.

గెలవకున్నా మంచిగానే
తనదైన ఆటతీరు, ఎంటర్‌టైన్‌మెంట్‌తో బిగ్ బాస్ షోలో ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకున్న జబర్ధస్త్ ఫైమా.. కచ్చితంగా టాప్ 5లో ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడప్పుడూ గొడవలు పడుతూ విమర్శలను ఎదుర్కొంది. దీంతో ఈ చిన్నది 13వ వారంలో ఎలిమినేట్ అయింది. అయినప్పటికీ ఈ షో వల్ల ఆమె కెరీర్ బాగా స్పీడుగా సాగిపోతోంది.

ఆఫర్లు ఫుల్.. ఆ షోలలో
బిగ్ బాస్ షో తర్వాత ఫైమాకు క్రేజ్ పెరగడంతో పాటు ఆఫర్లు కూడా భారీ స్థాయిలో వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ చిన్నది ఇప్పుడు 'బీబీ జోడీ' అనే డ్యాన్స్ షోలో సూర్యతో కలిసి సందడి చేస్తోంది. అలాగే, 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం'లో కూడా భాగం అయింది. వీటితో పాటు కొన్ని స్పెషల్ ఈవెంట్లను కూడా చేస్తూ కెరీర్ పరంగా జెట్ స్పీడుతో దూసుకుపోతోంది.

అందులో స్పెషల్ రోల్
ప్రతి ఆదివారం ప్రసారం అవుతున్న 'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' ప్రేక్షకులను యమా అలరిస్తూ సాగిపోతోంది. ఇందులో యాంకర్ శ్రీముఖి చేసే అల్లరితో పాటు గెస్టుల హడావిడి బాగుంటుంది. అలాగే, ముక్కు అవినాష్ కూడా ఓ రేంజ్‌లో సందడి చేస్తోన్నాడు. ఇక, ఈ ఆదివారం ప్రసారం అయ్యే ఎపిసోడ్‌కు సింగర్స్ గెస్టులుగా వచ్చారు. ఈ ప్రోమో ఇటీవలే వచ్చింది.

ప్రతి రాత్రి.. ఫస్ట్ నైట్
'ఆదివారం విత్ స్టార్ మా పరివారం' షోలో భాగంగా ఈరోజు ప్రసారం అయ్యే ఎపిసోడ్‌లో ఫైమా సింగర్‌గా పరిచయమైంది. ఆమె రావడమే టైటానిక్ సినిమాలోని పాటను పాడింది. అప్పుడామె 'ఎవ్రీ నైట్ ఇన్ మై డ్రీమ్' అనకుండా 'ఎవ్రీ నైట్ ఇన్ ఫస్ట్ నైట్' అంటూ రెచ్చిపోయింది. ఆ తర్వాత శ్రీముఖి అలా పాడకూడదు అని అనడంతో ఇద్దరూ కలిసి ఆ పాటను ఆలపించారు.

శ్రీముఖికి అవినాష్ హగ్
ఫైమా పాట పాడడం అయిపోయిన తర్వాత ముక్కు అవినాష్ ఎంట్రీ ఇచ్చాడు. అతడు రావడమే 'అమ్మగారు ఎందుకలా పిలుస్తున్నారు. నన్ను మిస్ అవుతున్నారా' అంటూ ఆమెను బలవంతంగా కౌగిలించుకుని నలిపేశాడు. ఆ తర్వాత ఆమెను చందమామ అంటూ ఫ్లట్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ ఎపిసోడ్ అంతా డబుల్ మీనింగ్ డైలాగులతో సాగబోతుంది.


Click it and Unblock the Notifications











