jabardasth ఆసియాను నూకరాజు చీట్ చేశాడా? ఆ జబర్దస్త్ కమెడియన్‌పై మోజు పడి!

పటాస్ ద్వారా కెరీర్ మొదలుపెట్టింది ఫైమా. కామెడీ పంచులతో అభిమానులను అలరిస్తూ పటాస్ ఫైమాగా మారింది. ఆ తరువాత జబర్దస్త్ లో ఛాన్స్ పట్టేసింది. ఇక ఈ కామెడీ షో.. ఫైమా జీవితాన్నే మార్చేసింది. తన కామెడీతో జబర్దస్త్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. పేదరికంలో పుట్టి పెరిగిన ఫైమా.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని చివరికి జబర్దస్త్ లో తన సత్తా చాటి .. పేరు తెచ్చుకుంది. ఈ గుర్తింపుతో అమ్మడు బిగ్ బాస్ లోకి కూడా వెళ్లి వచ్చింది. అంతేకాకుండా తల్లికి ఒక ఇల్లు కట్టించి మంచి కూతురు కూడా అనిపించుకుంది.

ప్రస్తుతం ఒక పక్క సినిమాలతో, ఇంకోపక్క షోస్ తో బిజీగా ఉన్న ఫైమా.. రిలేషన్ షిప్ లో మాత్రం అబ్బాయిలతో ఆడుకుంటుంది అనే పేరును సంపాదించుకుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. ప్రేమ పేరుతో ఫైమా.. ఇప్పటికే ఇద్దరిని మోసం చేసిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఇక ఇప్పుడు మరో కామెడీ షో ద్వారా మూడో ప్రేమ బయటపడింది. అసలు విషయం ఏంటంటే..

faima reveals nukaraju also her crush beacause he cares alot

ఫైమా.. పటాస్ షోలో ఉన్నప్పటినుంచే ప్రవీణ్ తో ప్రేమాయణం నడపడం మొదలుపెట్టింది. ఇక వీరిద్దరూ జబర్దస్త్ స్టేజిపై ప్రేమికులుగా మారారు . పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్నీ బిగ్ బాస్ స్టేజి మీద ప్రవీణ్ కూడా ఒప్పుకున్నాడు. నాగార్జున ముందే ఫైమా సైతం.. ప్రవీణ్ కోసమే ఈ హౌస్ కు వచ్చినట్లు తెలిపింది. ఇక హౌస్ నుంచి వచ్చాకా వీరి పెళ్లి ఉంటుంది అనుకున్నారు. కానీ, హౌస్ నుంచి బయటకు వచ్చాకా .. అసలు వీరు ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికే ఇబ్బంది పడ్డారు.

బిగ్ బాస్ నుంచి వచ్చాకా ఫైమా మారిపోయిందని, తనతో మాట్లాడడం మానేసిందని ప్రవీణ్ చెప్పుకొచ్చాడు. ఇంకోపక్క ఫైమా.. మేము కేవలం స్టేజి మీద వరకే ప్రేమికులం.. బయట మేము మంచిస్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చింది. అది కూడా ఇద్దరం కలిసి వీడియోస్ చేస్తుంటే వ్యూస్ వస్తున్నాయి కాబట్టి అలా నటించాం.. అంతే తప్ప మా ఇద్దరి మధ్య ఏం లేదు అని, ప్రవీణ్ సింపతీ కోసం ఇంటర్వ్యూలలో నేను మోసం చేసినట్లు చెప్తున్నాడని తెలిపింది.

ఇక వీరిద్దరి మధ్య గొడవలు జరుగుతున్నా సమయంలోనే నా బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ అంటూ మరో ప్రవీణ్ ను పరిచయం చేసింది ఫైమా . వీళ్లిద్దరి మధ్య ప్రేమ ఉందని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్న మాట నిజమే. ఫైమా కూడా ఇప్పుడు దానిని అధికారికంగా ప్రకటించింది. ఫైమా బర్త్ డే ను ప్రవీణ్ చాలా గ్రాండ్ గా జరిపించాడు. హ్యాపీ బర్త్ డే మై లవ్.. అప్పుడే ఐదేళ్లు గడిచిపోయాయి. ఎలా గడిచిపోయాయో కూడా తెలీదు. నా జీవితం మొత్తం నీతో గడిపేయాలి. ఐ లవ్ ఫరెవర్ కన్నా అంటూ రాసుకురావడంతో.. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని తెలిసిపోయింది. ఇక దీంతో జబర్దస్త్ ప్రవీణ్ ను మోసం చేసింది.. అంటూ పుకార్లు మొదలయ్యాయి.

faima reveals nukaraju also her crush beacause he cares alot

ఇక ఇప్పుడు తన బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ ను కూడా ఫైమా మోసం చేస్తుందని నెటిజన్స్ మాట్లాడుకుంటున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీలో ఫైమా కన్ను.. నూకరాజు మీద పడింది. ఒక గేమ్ లో భాగంగా ఫైమా క్రష్ ఎవరు అని చూపించగా.. జబర్దస్త్ ప్రవీణ్, ఇంకో ప్రవీణ్ తో పాటు నూకరాజు ఫోటో కూడా ఉంది. దీంతో రష్మీ.. నూకరాజు పై నిజంగా క్రష్ ఉందా అని అడగ్గా.. లైఫ్ లో కనెక్ట్ అయ్యినవాళ్లు.. మనకోసం ఆలోచించేవాళ్ళు.. అలా ఉన్నవాళ్లలో నూకరాజు కూడా ఉన్నాడు అని చెప్పుకొచ్చింది.

ఇక నూకరాజు సైతం.. నన్ను పట్టించుకొనేవాళ్లలో తను కూడా ఉంది అని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇక నూకరాజు ఫ్యాన్స్ మాత్రం మరి ఆసియా పరిస్థితి ఏంటి అని అడిగేస్తున్నారు. నూకరాజు ఆసియా ప్రేమించుకుంటున్న విషయం తెల్సిందే. త్వరలోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇది కూడా రేటింగ్ కోసమేనా.. ? మరి ఇంకేదైనానా ..? అనేది తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X