Bigg Boss: రేవంత్‌కు కోలుకోలేని షాక్.. ప్లాన్ ప్రకారమే టార్గెట్.. ఇలా అయితే గెలుపు కష్టమే!
నిజమైన సన్నివేశాల కూర్పుతో నడుస్తూ.. తెలుగు ప్రేక్షకులకు ఓ రేంజ్‌లో మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఎప్పటికప్పుడు చిత్ర విచిత్రమైన సంఘటనలతో, దిమ్మతిరిగే ట్విస్టులతో సాగిపోతోన్న ఈ టాప్ షో.. ఇప్పటికే ఏకంగా ఐదు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇటీవలే మొదలైన ఆరో సీజన్ కూడా ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇక, తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో టైటిల్ ఫేవరెట్ రేవంత్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి సంగతులను మీరే చూసేయండి మరి!

బీట్ చేయాలనుకుంటే షాక్
మిగిలిన భాషల కంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్పందన వస్తోంది. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో ప్రయోగాలతో రసవత్తరంగా నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, దీనికి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే వస్తోంది. దీంతో ఈ సీజన్‌కు రేటింగ్ ఆశించిన రీతిలో రావడంలేదు.

టైటిల్ ఫేవరెట్‌గానే రేవంత్
తాజాగా జరుగుతోన్న ఆరో సీజన్‌లో ఏకంగా 21 మంది కంటెస్టెంట్లు వచ్చారు. వీళ్లంతా తమ తమ విభాగాల్లో గుర్తింపును దక్కించుకున్నారు. అందులో పలువురు మాత్రమే టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగారు. అందులో సింగర్ రేవంత్ ఒకడన్న విషయం తెలిసిందే. సింగర్‌గా టాలీవుడ్‌లో సత్తా చాటిన అతడు.. ఇండియన్ ఐడల్ కూడా గెలిచాడు. దీంతో అతడిపై అంచనాలున్నాయి.

చెడ్డపేరు తెచ్చుకున్నాడుగా
బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచే సింగర్ రేవంత్ తన మార్కు చూపించే ప్రయత్నాలు చేస్తున్నాడు. షోలో ఇచ్చే టాస్కుల్లో ఎంతో యాక్టివ్‌గా పాల్గొంటున్నాడు. వాటిలో తనదైన ఆటతో ఆకట్టుకుంటున్నాడు. కానీ, తరచూ కోపంతో గొడవలు పెట్టుకుంటున్నాడు. దీంతో ఆరంభంలోనే అతడు కోపిస్టి అనే పేరును తెచ్చుకున్నాడు. ఇది అతడికి మైనస్‌గా మారిపోయింది.

నిత్య గొడవలు.. ఎల్లో కార్డుతో
బిగ్ బాస్ ఆరో సీజన్‌లో రేవంత్ ఇప్పటికే పలుమార్లు నామినేట్ అయ్యాడు. కానీ, అతడికి ఫాలోయింగ్ ఉన్న కారణంగా ప్రతిసారీ సేఫ్ అయ్యాడు. ఇది అతడి కాన్ఫిడెన్స్ మరింత పెంచిందేమో కానీ.. రేవంత్ తరచూ గొడవలు పడుతూ రెచ్చిపోతోన్నాడు. దీంతో ఇటీవలే నాగార్జున అతడికి ఎల్లో కార్డు కూడా ఇచ్చాడు. మళ్లీ గొడవలు పడితే రెడ్ కార్డు ఇచ్చి పంపేస్తానని వార్నింగ్ ఇచ్చాడు.

స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్
తాజా సీజన్‌లో పదో వారానికి సంబంధించిన కెప్టెన్ కోసం పోటీదారులను ఎంపిక చేసేందుకు 'స్నేక్ అండ్ ల్యాడర్' అనే టాస్కును ఇచ్చారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లను రెండు టీమ్‌లుగా విభజించారు. ఇందులో మట్టితో నిచ్చేన, పాము ఆకారాలను కట్టాల్సి ఉంటుంది. ఈ టాస్కులో గెలిచిన టీమ్ సభ్యులు కెప్టెన్సీ పోటీదారులు అవుతారని బిగ్ బాస్ ప్రకటించాడు.

రేవంత్‌ను టార్గెట్ చేశారు
బుధవారం జరిగిన 'స్నేక్ అండ్ ల్యాడర్ టాస్క్'లో పాము టీమ్‌లోని ఫైమా మిగిలిన వాళ్లతో 'మనం రేవంత్‌ను టార్గెట్ చేద్దాం. అతడు మనల్ని టచ్ చేసిన వెంటనే ఫిజికల్ అవుతున్నాడని అందాం. అలా చేస్తే ఇంకా కోపం వచ్చి పిచ్చి పిచ్చిగా చేస్తాడు. గేమ్ నుంచి తప్పుకుంటాడు' అని చెప్పింది. అందుకు ఆది రెడ్డితో పాటు అందరూ ఓకే అనేసి రేవంత్‌ను టార్గెట్ చేశారు.

ఓడిపోయిన రేవంత్ టీమ్
స్నేక్ టీమ్‌లోని ఫైమా, ఆది రెడ్డి, కీర్తిలు రేవంత్ ఫిజికల్ అవుతున్నాడని పదే పదే అతడితో గొడవలు పెట్టుకున్నారు. దీంతో అతడు పలుమార్లు సహనం కోల్పోయి వాళ్లతో కొట్లాటలకు దిగాడు. అదే అదునుగా చేసుకుని ఫైమా టీమ్ ఈ టాస్కులో విజయం సాధించింది. మొత్తంగా వాళ్లు రేవంత్‌ను ప్లాన్ ప్రకారం టార్గెట్ చేసి టాస్క్ గెలిచారు. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











