For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Bigg Boss: నడవలేని స్థితిలో ఆ కంటెస్టెంట్లు.. మధ్యలోనే ఎలిమినేట్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన ఫైమా

  |

  ఈ మధ్య కాలంలోనే తెలుగు బుల్లితెరపైకి ఎన్నో రకాల కార్యక్రమాలు పరిచయం అయ్యాయి. అయితే, అందులో కొన్నింటిని మాత్రమే ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ షో ఒకటి. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే కాన్సెప్టుతో వచ్చినా.. దీనికి భారీ రెస్పాన్స్ దక్కింది. దీంతో వరుసగా సీజన్లను మొదలెడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆరో సీజన్‌ను నడుపుతున్నారు. ఇది చివరి దశకు చేరడంతో నిర్వహకులు ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ టాస్కును పెట్టారు. ఇందులో ఎవరు గెలిచారు? ఏం జరిగింది? అనేవి చూద్దాం పదండి!

  వాటిని దాటాలని ప్రయత్నాలు

  వాటిని దాటాలని ప్రయత్నాలు

  అన్ని భాషల కంటే తెలుగులో ప్రసారం అయ్యే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్పందన వస్తోంది. దీంతో ఆరో సీజన్‌పై అంచనాలు తారాస్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎన్నో ప్రయోగాలతో రసవత్తరంగా నడిపే ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, దీనికి స్పందన మాత్రం అంతంతమాత్రంగానే వస్తోంది. అయితే, ఇప్పుడిది చివరికి చేరడంతో రంజుగా మారింది.

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కు ఇలా

  ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కు ఇలా

  శుక్రవారం రాత్రి జరిగిన ఎపిసోడ్‌లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కును నిర్వహించారు. ముందుగా ఇందులో పాల్గొనాలనుకునే సభ్యులు.. ఎల్‌ఈడీ స్క్రీన్‌పై అమౌంట్‌ (ప్రైజ్ మనీ నుంచి తగ్గించే మొత్తం)ను చూసిన తర్వాత సౌండ్ వచ్చిన వెంటనే బజర్‌ను మోగించాల్సి ఉంటుంది. అలా చేసిన ముగ్గురు కంటెస్టెంట్లు మాత్రమే ఈ టాస్కులో పోటీ పడతారని బిగ్ బాస్ చెప్పాడు.

  ముగ్గురు కంటెస్టెంట్ల పోరాటం

  ముగ్గురు కంటెస్టెంట్ల పోరాటం

  ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో భాగంగా ముందు రౌండ్‌లో రూ. 80 వేల మొత్తానికి ఫైమా బజర్ నొక్కి పోటీదారుగా నిలిచింది. ఆ తర్వాత శ్రీహాన్ రూ. 1.50 లక్షలకు బజర్ నొక్కి మరో కంటెండర్ అయ్యాడు. ఇక, చివర్లో రూ. 1.02 లక్షలకు రేవంత్ బజర్ నొక్కాడు. ఇలా ముగ్గురు కంటెస్టెంట్లు ఈ టాస్కులో పోటీదారులుగా నిలిచారు. దీంతో ఎవరికి తోచినట్లు వాళ్లు ప్లాన్లు చేసుకున్నారు.

  Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో!

  ఆ ఒక్కరు తప్ప అంతా వాళ్లకే

  ఆ ఒక్కరు తప్ప అంతా వాళ్లకే

  ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో భాగంగా ముగ్గురు పోటీదారులు బజర్ మోగినప్పటి నుంచి తమ భుజాలపై కాడలను పెట్టుకుని నిలబడాలి. ఇక, బజర్లు మోగినప్పుడల్లా మిగిలిన ఇంటి సభ్యులు తమ దృష్టిలో ఎవరికి పాస్ అవసరం లేదు అనుకుంటున్నారో.. వాళ్ల కాడలకు అక్కడే ఉన్న ఇసుక బస్తాలను తగిలించాలి. ఇందులో శ్రీ సత్య తప్ప అందరూ రేవంత్, శ్రీహాన్‌కే బస్తాలు వేశారు.

  అర్థం చేసుకుని.. ఔట్ అయి

  అర్థం చేసుకుని.. ఔట్ అయి

  ఎంతో రసవత్తరంగా సాగిన ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో రేవంత్, శ్రీహన్‌కు మాత్రమే ఎక్కువ బరువు వచ్చింది. దీంతో వాళ్లిద్దరూ ఇవి మోయడానికి చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో శ్రీహాన్ మనకే బరువు ఎక్కువగా ఉంది. కాబట్టి మనమే ఔట్ అవుతాం అంటూ ముందుగా అతడు టాస్కు నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చాలా సేపే పోరాడిన రేవంత్ కూడా ఓటమిని అంగీకరించాడు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  పాస్ గెలిచిన ఫైమా.. వాళ్లకు

  పాస్ గెలిచిన ఫైమా.. వాళ్లకు

  ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో భాగంగా ముగ్గురు పోటీదారుల్లో రేవంత్, శ్రీహన్‌లు బరువు మోయలేక తప్పుకున్నారు. దీంతో ఈ టాస్కులో ఫైమా విజేతగా నిలిచింది. దీంతో పాస్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత ఫైమా తనకు సహాయం చేసిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. అలాగే, తనకు ఎంతో గర్వంగా ఉందని కెమెరాల ముందు చెప్పింది. దీతో ఆమె ఒక వారం సేఫ్ కానుంది.

  నడవలేని స్థితిలో.. ట్రోల్స్

  నడవలేని స్థితిలో.. ట్రోల్స్

  ఎంతో కష్టతరంగా సాగిన ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్కులో చాలా బరువులు మోసిన శ్రీహాన్, రేవంత్ గార్డెన్ ఏరియాలో పడిపోయారు. అంతేకాదు, చాలా సేపు నడవలేని స్థితిలో కనిపించారు. అంత కష్టపడినా ఓడిపోవడంతో వీళ్లిద్దరూ చాలా సేపు ఏడ్చేశారు. ఇదిలా ఉండగా.. శ్రీహాన్, రేవంత్ గతంలో చేసిన తప్పులకు కర్మ ఫలితం అనుభవిస్తున్నారంటూ కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.

  English summary
  Bigg Boss Telugu Telugu 6th Season Running Successfully. Faima Won Eviction Free Pass for This Season in Recent Episode.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X