బాయ్‌ఫ్రెండ్‌ కావాలంటూ.. డేటింగ్ యాప్‌లో యాంకర్ మంజూష ఫొటోస్..

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని రూమర్స్ ఎవరు ఊహించని విధంగా ఉంటాయి. ఇంటర్నెట్ కాలంలో అభివృద్ధి చెందుతున్నారా లేక విలువలు కోల్పోయేలా అడుగులు వేస్తున్నారా అనే విషయం అర్థం కావడం లేదు. కొంతమంది టెక్నాలజీని ఉపయోగించుకొని సినీ తారలను తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మంజూష కూడా అలాంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొంది.

 వారిని కూడా..

వారిని కూడా..

టాలీవుడ్ యాంకర్స్ లో ప్రస్తుతం పోటీ తీవ్రత గట్టిగానే పెరుగుతోంది. ఇలాంటి సమయంలో నిలదొక్కుకోవాలి అంటే కొంచెం కష్టమే. అయితే యాంకర్స్ పై రూమర్స్ గాసిప్స్ రావడం ఈ మధ్య ఎక్కువవుతున్నాయి. మొన్నటివారకు హీరోయిన్స్ మాత్రమే టార్గెట్ చేసే ఈ రూమర్స్ ఇప్పుడు యాంకర్స్ తో పాటు బుల్లితెర నటీనటులను కూడా ఇబ్బంది పెడుతున్నాయి.

మంజూష ఫొటోస్ వైరల్..

మంజూష ఫొటోస్ వైరల్..

యాంకర్ మంజూష ఫోటోతో డేటింగ్ యాప్స్ నిర్వాహకులు ఎవరు ఊహించని విధంగా ప్రవర్తించారు. పైగా సోషల్ మీడియాలో కూడా ప్రమోషన్స్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. ఇదివరకే చాలా సార్లు ఈ విధంగా కొంతమంది నటిమణుల ఫొటోలతో అమాయకులను మోసం చేసినట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఇక ఇప్పుడు మంజూష ఫోటోలు కూడా వాడేశారు.

డైరెక్ట్ చాటింగ్..

డైరెక్ట్ చాటింగ్..

ఇక 23 ఏళ్ల అమ్మాయి మీ కోసం ఎదురుచూస్తోంది. వెంటనే యాప్ డౌన్ లోడ్ చేసుకొని చాట్ చేయండి అంటూ అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మంజూష ఇవన్నీ ఫేక్ అంటూ.. తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఆమె సీరియస్ అయినట్లు సమాచారం. అలాగే మంజూష పోలీసులకు పిర్యాదు చేయడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Recommended Video

Anchor Anasuya Vs Anchor Manjusha In Jabardasth Comedy Show
యాంకర్ గా బిజీ లైఫ్..

యాంకర్ గా బిజీ లైఫ్..

నటిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన మంజూష ఆ తరువాత యాంకర్ గా బిజీ అయ్యింది. అలాగే స్టార్ హీరోల సినిమాల ప్రమోషన్స్ లో ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా పలు రియాలిటీ షోలకు కూడా యాంకరింగ్ చేస్తోంది. అలాగే ఇటీవల ఆమె జబర్దస్త్ యాంకర్ గా కూడా వర్క్ చేయనున్నట్లు రూమర్స్ వచ్చిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X