కుటుంబ సభ్యుల ఎంట్రీతో ఊహించని కష్టాలు: తీవ్ర ఆందోళనలో బిగ్ బాస్ యూనిట్.!

బుల్లితెర చరిత్రలోనే దేశ వ్యాప్తంగా సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన షో బిగ్ బాస్. చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న దీనికి ప్రేక్షకుల నుంచి ఆదరణ భారీగానే లభిస్తోంది. అందుకే ఈ షో ప్రసారం అయిన ప్రతిసారీ ఆయా భాషల్లో నెంబర్ వన్ స్థానాన్ని కైవశం చేసుకుంటోంది. మరీ ముఖ్యంగా తెలుగులో దీని ప్రభావం గట్టిగానే ఉంది. అందుకే వరుసగా సీజన్లు ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. ప్రస్తుత సీజన్‌కు కూడా రికార్డు స్థాయిలో రేటింగ్ వస్తోంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌస్‌లోకి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చారు. దీంతో ఊహించని కష్టాలు మొదలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే..

బిగ్ బాస్ 4కు అదిరిపోయే ఆరంభం

బిగ్ బాస్ 4కు అదిరిపోయే ఆరంభం

తెలుగులో కనీవినీ ఎరుగని రీతిలో రెస్పాన్స్‌ను అందుకుంటూ నెంబర్ వన్ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. అందుకే మూడు సీజన్లను పూర్తి చేసుకుని, నాలుగో దాన్ని సైతం ప్రారంభించారు నిర్వహకులు. రెండు నెలల క్రితం మొదలైన ఈ సీజన్‌కు అదిరిపోయే ఆరంభం దక్కింది. ప్రీమియర్ ఎపిసోడ్‌కు రికార్డు స్థాయిలో రేటింగ్ రావడంతో దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది.

వాటిని అధిగమించేందుకు కొత్తగా..

వాటిని అధిగమించేందుకు కొత్తగా..

ప్రీమియర్ ఎపిసోడ్‌కు ఊహించని రీతిలో స్పందన వచ్చినప్పటికీ.. ఆ తర్వాత షో చాలా చప్పగా సాగింది. అదే సమయంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ కూడా మొదలవడంతో బిగ్ బాస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో షో నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వచ్చారు. వాటి అమలు ఫలితంగా షోను సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నారు.

రేటింగ్ కోసం ఫోకస్ చేసిన బాస్

రేటింగ్ కోసం ఫోకస్ చేసిన బాస్

ఏ షో అయినా రేటింగ్ కోసమే ప్రసారం అవుతోంది. అందులోనూ భారీ ఖర్చుతో రూపొందిన బిగ్ బాస్‌కు అది చాలా ముఖ్యం. అందుకే ప్రేక్షకులు ఎటువంటి కంటెంట్‌ను ఎక్కువగా చూస్తారో.. దానినే ప్రసారం చేస్తున్నారు షో నిర్వహకులు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల మధ్య గొడవలు.. లవ్ ట్రాకులు.. ముద్దులు.. హగ్గులు తదితర అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు.

షోలో ముఖ్యమైన పార్ట్‌ ప్రారంభం

షోలో ముఖ్యమైన పార్ట్‌ ప్రారంభం

బిగ్ బాస్ షోలో ప్రీమియర్, ఫైనల్ ఎపిసోడ్స్ తర్వాత అత్యధిక స్థాయిలో రెస్పాన్స్ వచ్చేది కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు వచ్చినప్పుడే. ప్రతి సీజన్‌లోనూ ఈ పార్ట్ బాగా హైలైట్ అవుతోంది. మొదటి సీజన్ నుంచి మొదలు పెడితే మూడో సీజన్ వరకు మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పుడు నాలుగో సీజన్‌లోనూ బుధవారం ఎపిసోడ్ నుంచి వాళ్ల ఎంట్రీలు మొదలయ్యాయి.

కుటుంబ సభ్యుల ఎంట్రీతో కష్టాలు

కుటుంబ సభ్యుల ఎంట్రీతో కష్టాలు

కరోనా ప్రభావం ఉన్న నేపథ్యంలో బిగ్ బాస్ షోలోకి ఈ సారి కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు ఎంట్రీ ఇచ్చే అవకాశాలు లేవన్న టాక్ వినిపించింది. అయితే, ఊహించని విధంగా వాళ్ల కోసం మెయిన్ డోర్ దగ్గర గాజుతో రూమ్ ఏర్పాటు చేసి మరీ లోపలికి పంపుతున్నారు. ఇప్పటికే అభిజీత్, హారిక, అఖిల్, అవినాష్ వాళ్ల మదర్స్ షోలోకి ఎంట్రీ ఇచ్చారు. దీంతో కొత్త కష్టాలు మొదలయ్యాయి.

Recommended Video

Prabhas, Saif Ali Khan-Starrer 'Adipurush' To Release In August 2022
తీవ్ర ఆందోళనలో బిగ్ బాస్ యూనిట్.!

తీవ్ర ఆందోళనలో బిగ్ బాస్ యూనిట్.!

అభిజీత్, హారిక, అఖిల్, అవినాష్ వాళ్ల మదర్స్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కంటెస్టెంట్లు అందరిలోనూ జోష్ నింపారు. గొడవల గురించి ప్రత్యేకంగా స్పందిస్తూ వాటిని లైట్ తీసుకోమన్నారు. దీంతో శత్రువుల్లా ఉన్న కొందరు హౌస్‌మేట్స్ కలిసిపోయారు. ఇకపై హౌస్‌లో వార్స్ ఉండకపోవచ్చు. ఇది షో రేటింగ్‌పై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపే చాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X