Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి మరో బోల్డు హీరోయిన్.. హౌస్‌లో హీటెక్కించడం ఖాయం
సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలుస్తూనే భారీ స్థాయిలో ఆదరణను సొంతం చేసుకుంటూ సూపర్ హిట్ షోగా మారిపోయింది బిగ్ బాస్. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం అన్ని భాషల కంటే తెలుగులోనే ఎక్కువగా రెస్పాన్స్‌ను అందుకుంటూ రేటింగ్‌ను రాబడుతోంది. దీంతో నిర్వహకులు క్రమం తప్పకుండా సీజన్లను పూర్తి చేస్తున్నారు. ఇలా కొద్ది రోజుల్లోనే ఏడో సీజన్‌ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇందులో పాల్గొనబోయే మరో కంటెస్టెంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఆ పూర్తి విషయాలను మీరే చూసేయండి!
కొద్ది రోజుల్లోనే సంబరంగా:తెలుగులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చినా.. తక్కువ సమయంలోనే బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. దీంతో నిర్వహకులు వరుసగా ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ప్లాన్ చేశారు. దీన్ని సెప్టెంబర్ 3వ తేదీ నుంచి మొదలుపెడుతున్నారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేస్తున్నారు.

కొత్త కాన్సెప్టుతో వస్తుంది:బిగ్ బాస్ షో ఎప్పుడు ప్రసారం అయినా అదిరిపోయే రెస్పాన్స్‌ను అందుకుంటోంది. అయితే, గత రెండు సీజన్ల నుంచి అన్నీ లీక్ అవడం.. విజేత ఎవరో ముందే తెలిసిపోవడంతో రేటింగ్ రావడం లేదు. దీంతో ఇప్పుడు ఏడో సీజన్‌ను సరికొత్తగా 'ఉల్టాపుల్టా' అనే కాన్సెప్టుతో డిజైన్ చేశారు. ఫలితంగా ఆరంభంలోనే ఈ సీజన్‌పై ఆసక్తిని పెంచేశారని చెప్పుకోవాలి.
అవి కంప్లీట్.. షూట్లతోనే:వచ్చే ఆదివారం అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు పనులను చాలా వరకూ కంప్లీట్ చేశారని తెలిసింది. ముఖ్యంగా కంటెస్టెంట్లను ఉంచే హౌస్‌కు సంబంధించిన సెట్ పూర్తి చేశారు. అలాగే, స్టేజ్ పనులు కూడా కంప్లీట్ అయింది. శుక్ర, శనివారం కంటెస్టెంట్ల ఏవీలు, ఎంట్రీ పెర్ఫార్మెన్స్‌లను షూట్ చేయబోతున్నారు.
20 మంది.. ఫైనల్ కాలే:ఎన్నో అంచనాలతో ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. ఇలా ఇప్పటికే 20 మందితో కూడిన ఫైనల్ లిస్టును వాళ్లు రెడీ చేశారట. అయితే, వీరిలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారని తెలిసింది. అంటే.. ఇప్పటి వరకూ హౌస్‌లోకి వెళ్లే కంటెస్టెంట్ల లిస్టు ఫైనల్ కాలేదనే టాక్ వినిపిస్తోంది.
అలాంటి వాళ్లే ఎక్కువ:ఏడో సీజన్‌ను బిగ్ బాస్ నిర్వహకులు ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న కంటెస్టెంట్లను తీసుకు రావడమే మంచి మార్గం అని భావించారు. ఇందులో భాగంగానే ఈ సీజన్‌లో రాబోతున్న కంటెస్టెంట్లలో ఎక్కువ శాతం మందిని వివాదాలతో సంబంధం ఉన్న వాళ్లనే తీసుకుంటున్నారని తాజాగా తెలిసింది.

బోల్డు బ్యూటీకి అవకాశం:సెప్టెంబర్ 3వ తేదీన హై రేంజ్‌లో లాంచ్ కాబోతున్న ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో ప్లాన్లు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఒకప్పుడు బోల్డు యాక్టింగ్‌తో ఫేమస్ అయిన కిరణ్ రాథోడ్ను కూడా ఈ సీజన్ కోసం ఎంపిక చేశారని తెలిసింది. ఈ అమ్మడు గతంలో స్పెషల్ సాంగ్‌లతో పాటు 'హైస్కూల్', 'భాగ్యలక్ష్మీ బంపర్ డ్రా' మూవీలు చేసింది.

ఆ రెండూ ఉంటాయిగా:సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచీ బోల్డు బ్యూటీగా పేరు తెచ్చుకున్న కిరణ్ రాథోడ్.. ఇప్పుడు ఏడో సీజన్ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆమె సినిమాల్లో మాదిరిగానే హౌస్‌లో కూడా గ్లామర్ ట్రీట్‌ను ఇవ్వడంతో పాటు దూకుడు స్వభావంతో గొడవల్లోనూ భాగం అయ్యే అవకాశం ఉందని చాలా మంది అనుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











