Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి శృంగార తార.. షో చరిత్రలో తొలి కంటెస్టెంట్.. రెమ్యూనరేషన్ ఎంతంటే!
కొందరు కంటెస్టెంట్లను ఓ ఇంట్లో ఉంచడం.. వాళ్లకు రకరకాల టాస్కులు ఇవ్వడం.. చివరకు ప్రేక్షకుల మద్దతులో విజేతలను ప్రకటించడం.. ఇదే బిగ్ బాస్ షో సారాంశం. ఎన్నో రకాల ఎమోషన్స్‌ను బయటకు తీసుకు వచ్చే ఈ రియాలిటీ షోకు తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో వరుసగా సీజన్లు కంప్లీట్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు మొదలు పెట్టబోతున్నారు. ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల పేర్లు క్రమంగా లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా మరో పేరు బయటకొచ్చింది. ఆ సంగతులు మీకోసమే!
ఏడో సీజన్ డేట్ ప్రకటన:తెలుగులోకి ఆలస్యంగానే పరిచయం అయినా బిగ్ బాస్ షో సూపర్ సక్సెస్ అయింది. దీంతో ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ వెర్షన్ సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని ప్లాన్ చేశారు. దీన్ని సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇటీవలే విడుదలైన ప్రోమోలో ప్రకటించారు. ఈ సీజన్‌ను కూడా అక్కినేని నాగార్జునే హోస్ట్ చేయబోతున్నారు.

కొత్త కాన్సెప్టు.. ఆసక్తి ఫుల్:వాస్తవానికి తెలుగులో బిగ్ బాస్ ఎప్పుడు వచ్చినా దేశంలోనే టాప్ రేటింగ్ దక్కింది. కానీ, ఆరో సీజన్ మాత్రం నిరాశజనకంగానే సాగింది. ముఖ్యంగా ఇది సాగిన తీరుపై విమర్శలు కూడా చెలరేగాయి. దీంతో ఏడో సీజన్‌ను చాలా కొత్తగా ప్లాన్ చేశారు. 'ఉల్టాపుల్టా' అనే కాన్సెప్టుతో దీన్ని సరికొత్తగా డిజైన్ చేశారు. ఫలితంగా ఆరంభంలోనే ఈ సీజన్‌పై ఆసక్తిని రేకెత్తించారు.
వారంలోనే పూర్తి చేసేలా:అతి త్వరలోనే అంగరంగ వైభవంగా మొదలు కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించి నిర్వహకులు పనులను చాలా వరకూ కంప్లీట్ చేశారని తెలిసింది. ముఖ్యంగా కంటెస్టెంట్లను ఉంచే హౌస్‌కు సంబంధించిన సెట్ చివరి దశకు చేరుకుందట. అలాగే, స్టేజ్ పనులు కూడా దాదాపుగా కంప్లీట్ అయ్యాయని తెలిసింది. మొత్తానికి ఈ వారంలోనే అన్ని పూర్తి చేస్తారని టాక్.
20 మంది వస్తున్నారని:సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. ఇలా ఇప్పటికే 20 మందితో కూడిన ఫైనల్ లిస్టును వాళ్లు రెడీ చేశారట. వీరిలో మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, శోభా శెట్టి, నిఖిల్, రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, పవిత్ర పేర్లు బయటకు వచ్చాయి.
కాంట్రవర్శీకి ప్రాధాన్యం:బిగ్ బాస్ నిర్వహకులు ఏడో సీజన్‌ను ఎలాగైనా గ్రాండ్ సక్సెస్ చేయాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందుకోసం కాంట్రవర్శీలతో సంబంధం ఉన్న కంటెస్టెంట్లను తీసుకు రాబోతున్నారని తెలిసింది. వాళ్ల వాళ్ల పేర్లను బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారట. ఇలా ఐదారుగురు ఫేమస్ సెలెబ్రిటీలు ఉన్నారట. దీంతో బిగ్ బాస్ షోపై అంచనాలు పెరుగుతున్నాయి.
ఆ శృంగార తార ఎంట్రీ:ఎన్నో అంచనాల నడుమ హై లెవెల్‌లో ప్రారంభం కాబోతున్న ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో ప్లాన్లు చేస్తున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఒకప్పుడు శృంగారభరిత సినిమాలతో సెన్సేషన్ అయిన షకీలాను కూడా ఈ సీజన్ కోసం ఎంపిక చేశారని తెలిసింది. తద్వారా తెలుగు బిగ్ బాస్‌లోకి రాబోతున్న ఏకైక శృంగార తారగా ఆమె నిలవబోతుంది.

రెమ్యూనరేషన్ ఎంతంటే:అప్పట్లో స్టార్ హీరోలతో సమానంగా పాపులారిటీని పెంచుకున్న షకీలా.. ఈ మధ్య కాలంలో ఖాళీగానే ఉంటున్నారు. అయినప్పటికీ ఆమె డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తెలుగు బిగ్ బాస్ నిర్వహకులు ఏడో సీజన్ కోసం షకీలాకు మంచి రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు తెలిసింది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలంటే సెప్టెంబర్ 3వ తేదీ వరకూ ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











