»   » డ్రగ్స్ ఓవర్ డోస్‌ కారణంగా టీవీ యాంకర్ మృతి

డ్రగ్స్ ఓవర్ డోస్‌ కారణంగా టీవీ యాంకర్ మృతి

Posted By:
Subscribe to Filmibeat Telugu

వాషింగ్టన్: ప్రముఖ అమెరికన్ టీవీ యాంకర్, మోడల్ పీచెస్ జెల్డోఫ్ అధిక మోతాదులో మాదక ద్రవ్యాలు తీసుకోవడంతో మరణించినట్లు బ్రిటిస్ పోలీసులు ధృవీకరించారు. 25 ఏళ్ల పీచెస్ జెల్డోఫ్ ఏప్రిల్ 7వ తేదీని అకస్మాత్తుగా మరణించింది. దాదాపు నెల రోజుల తర్వాత ఆమె మరణం వెనకగల నిజాలు వెలుగులోకి వచ్చాయి.

టాక్సికాలజీ రిపోర్ట్స్ ప్రకారం ఆమె మొతాదుకు మించి హెరాయిన్ తీసుకున్నట్లు గుర్తించారు. హెరాయిన్ కారణంగానే ఆమె శరీరంలో తీవ్రమైన మార్పులు జరిగి మరణం సంభవించినట్లు వైద్యులు గుర్తించారు. జెల్డోఫ్ ప్రముఖ మ్యూజీషియన్ మరియు కాంపెనీయినర్ బోబ్ జెల్డోఫ్ రెండో కుమార్తె.

Famous Model, 25-year-old Peaches Geldof died of heroin overdose

పీచెస్ జెల్డోఫ్ తల్లి పౌలా యేట్స్ కూడా అధికంగా హెరాయిన్ అనే డ్రగ్ తీసుకోవడం వల్ల 41వ ఏట మరణించింది. పీచెస్ జోల్డోఫ్‌ భర్త థామస్ కోహెన్. వీరికి 2 ఏళ్ల వయసున్న ఆస్టాలా, ఒక సంవత్సరం వయసున్న పీయద్రా అనే కుమారులు ఉన్నారు. 23 ఏళ్ల కోహెన్‌తో పీచెస్ జెల్డోఫ్ వివాహం జరిగింది.

పీచెస్ జెల్డోఫ్ బ్రతికి ఉండగా చివరగా చూసిన వ్యక్తి కోహెన్ ఫాదర్ కెయిత్. పీచెస్ జోల్డోఫ్ కుమారుడు పీయద్రాను డ్రాఫ్ చేయడానికి వచ్చినపుడు ఆమె మరణానికి ముందు రోజు రాత్రి చూసాడు. ఆ తర్వాతి రోజు ఉదయం ఆమె కాంటాక్టులోకి రాక పోవడంతో అనుమానం వచ్చిన భర్త తన తల్లి ఇంటికి పంపగా పీచెస్ జోల్డోఫ్ మరణించి కనిపించింది.

English summary
Peaches Geldof, renowned TV host and model, died from an overdose of heroin, British police said on Friday nearly a month after her death.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu