బిగ్ బ్రేకింగ్: అమర్‌దీప్ ఫ్యామిలీపై దాడి.. పూర్తిగా ధ్వంసమైన కారు.. భార్య, తల్లిని కూడా వదలకుండా!
తెలుగు వాళ్లకు పరిచయం లేని కంటెంట్‌తో వచ్చినా తక్కువ సమయంలోనే అక్కున చేర్చుకుని సూపర్ సక్సెస్ చేసిన షోనే బిగ్ బాస్. అందుకే ఇది వరుసగా సీజన్లను జరుపుకుంటూ వస్తోంది. ఇలా ఇటీవలే నిర్వహకులు ఏడో సీజన్‌ను కూడా మొదలెట్టారు.
Recommended Video

ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో ప్రసారం అయిన ఇందులో ఎన్నో కొత్త అంశాలను చూపించి ప్రేక్షకులకు వినోదాన్ని పంచారు. ఇలా 15 వారాల పాటు ఎంటర్‌టైన్ చేసిన ఏడో సీజన్ తాజాగా ముగిసింది. ఈ నేపథ్యంలో సీజన్ రన్నర్ అమర్‌దీప్ ఫ్యామిలీపై దాడి సంచలనంగా మారింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

గ్రాండ్‌గా జరిగిన ఫినాలే: ఉల్టా పుల్టా ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ఎంతో వైభవంగా జరిగింది. ఇందులో ముందుగా మాజీ కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లు చూపించారు. ఆ తర్వాత వాళ్లందరితో హోస్ట్ నాగార్జున మాట్లాడారు. అనంతరం కొందరు సెలెబ్రిటీలు వచ్చి ఇందులో సందడి చేసేశారు. ఈ క్రమంలోనే ఒక్కొక్కరిని వరుసగా షో నుంచి ఎలిమినేట్ చేస్తూ బయటకు పంపేశారు.
సీజన్ విన్నర్ ప్రశాంత్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా మిగిలారు. వీరిలో అంబటి అర్జున్ ముందుగా ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత ప్రియాంక జైన్ కూడా వెళ్లిపోయింది. ప్రిన్స్ యావర్ డబ్బు తీసుకుని తప్పుకున్నాడు. ఆ తర్వాత శివాజి కూడా ఎలిమినేట్ అయిపోయాడు. చివరికి అందరూ అనుకున్నట్లుగానే పల్లవి ప్రశాంత్ ఈ సీజన్‌లో విజేతగా నిలిచాడు.
రన్నరప్‌గా అమర్‌దీప్: ఆరుగురు ఫైనలిస్టులలో నలుగురు ఎలిమినేట్ అవడంతో అమర్‌దీప్ చౌదరి, పల్లవి ప్రశాంత్ టాప్ 2 కంటెస్టెంట్లుగా మిగిలారు. వీళ్లిద్దరిలో ఎవరు గెలుస్తారన్న దానిపై చివర్లో చాలా ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ ప్రేక్షకులకు అంచనాలకు అనుగుణంగానే వీరిలో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజయం సాధించడంతో అమర్‌దీప్ చౌదరి రన్నరప్‌గా మిగిలిపోయాడు.

అమర్ ఫ్యామిలీపై దాడి: ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చాలా మంది చేరుకున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్లను చూసేందుకు వాళ్లంతా పోటీ పడి రచ్చ చేశారు. ఈ క్రమంలోనే కొందరు అభిమానులు అమర్‌దీప్ చౌదరి ఫ్యామిలీపై దాడి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రావడంతో అతడి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

బాగా ధ్వంసమైన కారు: అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తున్న సమయంలో అమర్‌దీప్ చౌదరి కారు కదలకుండా చాలా మంది అడ్డుకున్నారు. ఆ సమయంలోనే వాళ్లపై కొందరు ఆకతాయిలు దాడి చేశారు. అంతేకాదు, అమర్‌దీప్ చౌదరి ప్రయాణిస్తున్న కారును పూర్తి ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఆ వాహనం వెనుక అద్దాలు పూర్తి పగిలిపోగా.. కొంత భాగంలోనూ డ్యామేజ్ అయిపోయింది.
భయంతో కేకలు వేస్తూ: అన్నపూర్ణ స్టూడియో దగ్గర తమ కారుపై దాడి చేస్తున్న సమయంలో అందులో ఉన్న అమర్‌దీప్ చౌదరి భార్య తేజస్విని, తల్లి బాగా భయపడిపోయారు. అప్పుడు వదిలిపెట్టమని వాళ్లను వేడుకున్నారు. కానీ, ఆ ఆకతాయిలు మాత్రం దాడిని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంతేకాదు, ఆ ఆడవాళ్లను సైతం బండ బూతులు తిడుతూ వాళ్లంతా వీరంగం సృష్టించారు.

స్పందించని అమర్: దాడి జరిగిన తర్వాత అదే కారులో అమర్‌దీప్ చౌదరి, అతడి ఫ్యామిలీతో పాటు ఓ పార్టీ హాల్‌కు చేరుకున్నాడు. అక్కడ అభిమానులతో మాట్లాడిన తర్వాత ఇంటికి వెళ్లిపోయాడు. అయితే, తమ కుటుంబం జరిగిన దాడి గురించి అమర్‌దీప్ చౌదరి మాత్రం ఇంకా స్పందించలేదు. అసలు అతడి పరిస్థితి ఎలా ఉందా అని వాళ్ల అభిమానులు మాత్రం టెన్షన్ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











