‘కార్తీక దీపం’ హీరోకు ఊహించని కష్టం: తన పరిస్థితి తెలుపుతూ నిరుపమ్ పోస్ట్.. ఇది అరాచకం బాబూ!

తెలుగు బుల్లితెర చరిత్రలో ఎన్నో సీరియళ్లు ప్రేక్షకాదరణ పొంది సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. కొన్ని దాదాపు ఐదేళ్ల పాటు ప్రసారం అయినవి కూడా ఉన్నాయి. ఇక, ఈ మధ్య కాలంలో ఆ రేంజ్‌లో స్పందనను దక్కించుకుంటూ నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది 'కార్తీక దీపం'. దాదాపు మూడున్నరేళ్లుగా ప్రసారం అవుతోన్న ఇది రోజు రోజుకూ మలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో హీరో నిరుపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబుకు ఊహించని కష్టం ఎదురైంది. దీంతో అతడు సోషల్ మీడియాలో స్పందించాడు. ఆ సంగతులు మీకోసం!

 అక్కడి నుంచి తీసుకొచ్చిందే కార్తీక దీపం

అక్కడి నుంచి తీసుకొచ్చిందే కార్తీక దీపం

తెలుగులో భారీ స్పందనను అందుకుంటూ దూసుకుపోతోన్న 'కార్తీక దీపం' సీరియల్ మొదట మలయాళంలో 'కరుతముత్తు' అనే టైటిల్‌తో ప్రసారం అయింది. అక్కడ కూడా ఇది సూపర్ హిట్ అయింది. అందులోనూ ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా చేసింది. ఒరిజినల్ క్యారెక్టర్ అయితేనే బాగుంటుందని ఆమెను తెలుగులోకి కూడా తీసుకున్నారు. అనుకున్నట్లు నమ్మకాన్ని నిలబెట్టుకుంది.

 తెలుగులోనే కాదు.. దేశంలో నెంబర్ వన్

తెలుగులోనే కాదు.. దేశంలో నెంబర్ వన్

'కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్‌లో మద్దతు తెలుపుతున్నారు. అందుకే దాదాపు మూడున్నరేళ్లుగా వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే తెలుగులో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన ఈ సీరియల్.. నేషనల్ వైడ్‌గా టాప్ ప్లేస్‌ను అందుకుంది.

 డాక్టర్ బాబులో మార్పుతో ఫ్యాన్స్ ఖుషీ

డాక్టర్ బాబులో మార్పుతో ఫ్యాన్స్ ఖుషీ

ఆరంభం నుంచే ఎన్నో మలుపులతో సాగుతోన్న 'కార్తీక దీపం' సీరియల్.. కొద్ది రోజులుగా మరింత ఆసక్తికరంగా సాగుతోంది. ఇంత కాలం దీప అలియాస్ వంటలక్కను అనుమానించిన డాక్టర్ బాబు.. అసలు నిజం తెలుసుకున్నాడు. దీంతో సౌర్య, హిమ తనకు పుట్టినవాళ్లే అని నిర్ధారించుకున్నాడు. ఫలితంగా ఈ సూపర్ హిట్ సీరియల్ అభిమానులంతా తెగ సంబర పడిపోయారు.

మోనిత ప్రెగ్నెంట్.. సీరియల్‌లో మలుపు

మోనిత ప్రెగ్నెంట్.. సీరియల్‌లో మలుపు

డాక్టర్ బాబు నిజం తెలుసుకోగానే 'కార్తీక దీపం' సీరియల్ సుఖాంతం అవుతుందని చాలా మంది అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సంతోషంగా ఉన్న దీప కుటుంబంలో మోనిత ఓ బాంబ్‌ను వేసింది. తాను ప్రస్తుతం ప్రెగ్నెంట్‌ను అని.. దానికి కార్తీకే కారణం అంటూ అందరికీ షాకిచ్చింది. తాగిన మత్తులో డాక్టర్ బాబు అలా చేశాడని అతడినే నమ్మించింది. దీంతో కథ అడ్డం తిరిగింది.

 మళ్లీ మొదటికి వచ్చిన కార్తీక దీపం స్టోరీ

మళ్లీ మొదటికి వచ్చిన కార్తీక దీపం స్టోరీ

మోనిత ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిన తర్వాత దీప.. డాక్టర్ బాబును దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఇన్ని రోజులూ వదిలేసి ఉన్న కార్తీక్.. ఇప్పుడు వంటలక్కను ఏలుకోడానికి ప్రయత్నాలు జరుపుతుంటే.. ఆమె మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు, గతంలో దీప ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో.. ఇప్పుడు డాక్టర్ బాబు కూడా అలాగే బాధ పడుతున్నాడు.

 నిరుపమ్ పరిటాలకు ఊహించని కష్టాలు

నిరుపమ్ పరిటాలకు ఊహించని కష్టాలు

'కార్తీక దీపం' సీరియల్‌లో ప్రేమీ విశ్వనాథ్‌కే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న విషయం తెలిసిందే. ఆమెకు ఏమాత్రం తీసిపోని విధంగా తెలుగులో నిరుపమ్‌ కూడా పాపులర్ అయ్యాడు. అందుకు అనుగుణంగానే ఈ సీరియల్ విషయంలో అతడికి వాళ్లంతా మద్దతు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే డాక్టర్ బాబుకు కష్టాలు రావడంతో ఫ్యాన్స్ వినూత్న కార్యానికి శ్రీకారం చుట్టారు.

Recommended Video

Karthika Deepam సీరియల్ పై Manchu Lakshmi Tweet వైరల్!! || Filmibeat Telugu
తన పరిస్థితి తెలుపుతూ నిరుపమ్ పోస్ట్

తన పరిస్థితి తెలుపుతూ నిరుపమ్ పోస్ట్

మోనిత ప్రెగ్నెంట్ అయిన తర్వాత డాక్టర్ బాబు పాత్రపై విమర్శలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో నిరుపమ్ అభిమానులు 'డాక్టర్ బాబు తప్పు చేశాడంటారా ప్రెండ్స్' అని సోషల్ మీడియాలో పోల్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం మంది అతడు ఎలాంటి తప్పు చేయలేదని నమ్ముతున్నారు. దీనికి సంబంధించిన పోస్టునే నిరుపమ్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X