For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘Karthika Deepam’ హీరో షాకింగ్ పోస్ట్: వాళ్లిద్దరితో కలిసి ఏకంగా అలా.. ఈ ఘోరంతో నాకేం సంబంధం లేదంటూ!

  |

  తెలుగు బుల్లితెరపై చాలా కాలంగా హవాను చూపిస్తూ నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోంది 'కార్తీక దీపం'. లేడీ సెంటిమెంట్‌తో నడిచే ఈ ధారావాహికకు మన ప్రేక్షకులు అదిరిపోయే స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఇది మూడేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌లో రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఇక, ఈ సీరియల్ వల్ల హీరో నిరుపమ్ పరిటాల ఎంతో పేరు సంపాదించాడు. తాజాగా అతడు ఓ షాకింగ్ పోస్ట్ చేశాడు. అంతేకాదు, ఈ ఘోరానికి నాకూ ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పాడు. ఆ వివరాలు మీకోసం!

  ‘కార్తీక దీపం' సీరియల్ అలా వచ్చింది

  ‘కార్తీక దీపం' సీరియల్ అలా వచ్చింది

  చాలా కాలంగా తెలుగులో నెంబర్ వన్ సీరియల్‌గా వెలుగొందుతోన్న ‘కార్తీక దీపం' రియల్ కథతో వచ్చినది కాదు. ఇది ముందుగా మలయాళంలో ‘కరుతముత్తు' అనే టైటిల్‌తో ప్రసారం అయింది. అక్కడ కూడా ఇది సూపర్ హిట్ అయింది. అందులోనూ ప్రేమీ విశ్వనాథే హీరోయిన్‌గా చేసింది. ఒరిజినల్ క్యారెక్టర్ అయితేనే బాగుంటుందని ఆమెను మన భాషలోకి కూడా పరిచయం చేశారు.

   మన సీరియల్... నేషనల్ రికార్డులతో

  మన సీరియల్... నేషనల్ రికార్డులతో

  ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రారంభం అయిన ‘కార్తీక దీపం' సీరియల్‌కు తెలుగు ప్రేక్షకులు ఓ రేంజ్‌లో మద్దతు తెలుపుతున్నారు. అందుకే దాదాపు మూడున్నరేళ్లుగా వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌తో సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. అదే సమయంలో టీఆర్పీ రేటింగ్‌లోనూ సత్తా చాటుతూ దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే జాతీయ స్థాయిలో రికార్డులను క్రియేట్ చేస్తూ సత్తా చాటుతోంది.

  డాక్టర్ బాబు మారాడు.. ఫ్యాన్స్ ఖుషీ

  డాక్టర్ బాబు మారాడు.. ఫ్యాన్స్ ఖుషీ

  ‘కార్తీక దీపం' సీరియల్ ఇంత సక్సెస్ అవడానికి అందులో వచ్చే మలుపులే కారణం అన్న విషయం తెలిసిందే. అందుకే ఇది రోజు రోజుకూ ఆసక్తికరంగా ప్రసారం అవుతోంది. ఈ మధ్య సీరియల్‌లో శుభ పరిణామం జరిగింది. ఇంత కాలం దీప అలియాస్ వంటలక్కను అనుమానించిన డాక్టర్ బాబు.. అసలు నిజం తెలుసుకున్నాడు. దీంతో ఈ సీరియల్ అభిమానులు ఖుషీ అయిపోయారు.

  గర్భం దాల్చిన మోనిత... కథలో ట్విస్ట్

  గర్భం దాల్చిన మోనిత... కథలో ట్విస్ట్

  హిమ, శౌర్యలు తనకు పుట్టిన పిల్లలే అని తెలుసుకున్న డాక్టర్ బాబు.. దీప కాళ్లు పట్టుకుంటాడు. దీంతో ‘కార్తీక దీపం' సీరియల్‌కు ఎండ్ కార్డ్ పడుతుందని అంతా అనుకున్నారు. కానీ, అప్పుడే తాను కార్తీక్ వల్ల గర్భవతిని అయ్యానంటూ మోనిత బాంబ్ పేల్చింది. తాగిన మైకంలో డాక్టర్ బాబు తనపై లైంగిక దాడి చేశాడని అతడితో పాటు అందరినీ నమ్మించింది. దీంతో కథ అడ్డం తిరిగింది.

   వంటలక్కలా మారిన డాక్టర్ బాబు పాత్ర

  వంటలక్కలా మారిన డాక్టర్ బాబు పాత్ర

  మోనిత ప్రెగ్నెంట్ అయిన విషయం తెలిసిన తర్వాత దీప.. డాక్టర్ బాబును దూరం పెట్టడం మొదలు పెట్టింది. ఇన్ని రోజులూ వదిలేసి ఉన్న కార్తీక్.. ఇప్పుడు వంటలక్కను ఏలుకోడానికి ప్రయత్నాలు జరుపుతుంటే.. ఆమె మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు. అంతేకాదు, గతంలో దీప ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొందో.. ఇప్పుడు డాక్టర్ బాబు కూడా అలాగే బాధ పడుతున్నాడు.

  వాళ్లిద్దరితో కలిసి.. ఏకంగా డాక్టర్ బాబు

  వాళ్లిద్దరితో కలిసి.. ఏకంగా డాక్టర్ బాబు

  రెండు రోజుల క్రితం RRR మూవీ నుంచి ఓ అదిరిపోయే పోస్టర్ వచ్చిన విషయం తెలిసిందే. అందులో ఎన్టీఆర్ బైక్ నడుపుతుండగా.. రామ్ చరణ్ వెనుక కూర్చుని ఉన్నాడు. ఇది ట్రెండ్ అవడంతో ఈ ఫొటోపై ఎన్నో రకాల మీమ్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే కార్తీక దీపం హీరో డాక్టర్ బాబు.. మోనిత, దీపతో కలిసి బైక్ నడుపుతున్నట్లు ఫొటోను ఎడిట్ చేశారు. దీన్ని నిరుపమ్ పోస్ట్ చేశాడు.

   ఈ ఘోరంతో సంబంధం లేదంటూ పోస్ట్

  ఈ ఘోరంతో సంబంధం లేదంటూ పోస్ట్

  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ ఫొటోను స్టోరీగా షేర్ చేసుకున్న ‘కార్తీక దీపం' హీరో నిరుపమ్ పరిటాల.. ‘ఎలాంటి పోస్టర్‌ను ఎలా చేశార్రా బాబు.. నాకూ ఈ ఘోరానికి ఎలాంటి సంబంధం లేదు' అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్టుకు సంబంధించిన స్క్రీన్ షాట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఫలితంగా కార్తీక దీపం సీరియల్ మరోసారి ట్రెండ్ అవుతోంది.

  English summary
  Karthika Deepam Is Top Serial in Telugu Television History. Now Fans Create Memes on Karthika Deepam Hero Nirupam Paritala, Deepa and Monitha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X