అదిరింది షోకు ఊహించని కష్టాలు: నాగబాబు సహా అందరిపై అసంతృప్తి

By Manoj Kumar P

తెలుగు బుల్లితెరపై కామెడీ షోలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ విభాగానికి చెందిన ఎన్నో షోలు సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యాయి. ఇక, ప్రముఖ చానెల్‌లో వస్తోన్న 'జబర్ధస్త్' అయితే దాదాపు ఏడేళ్లుగా తన హవాను చూపిస్తోంది. దీనిని బీట్ చేసేందుకు మధ్యలో ఎన్నో షోలు పుట్టుకొచ్చినప్పటికీ.. ఏవీ హిట్ అవలేదు. అయితే, మెగా బ్రదర్ నాగబాబు సారథ్యంలో వస్తోన్న 'అదిరింది' మాత్రం జబర్ధస్త్‌కు పోటీగా నిలుస్తోంది. ఇప్పుడిప్పుడే సక్సెస్‌ఫుల్ షోగా పేరు తెచ్చుకుంటోన్న తరుణంలో అదిరింది షోకు ఊహించని కష్టాలు ఎదరవుతున్నాయి. ఆ విషయాలు మీకోసం.!

అక్కడి నుంచి ఇక్కడకు జంప్

అక్కడి నుంచి ఇక్కడకు జంప్

జబర్ధస్త్ షో ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయిన దర్శకులు నితిన్, భరత్... ఆ షోకు గుడ్‌బై చెప్పేశారు. వీళ్లకు మెగా బ్రదర్ నాగబాబు మద్దతివ్వడంతో మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే షోను ప్రారంభించారు. ఎంతో గ్రాండ్‌గా మొదలైన ఈ షోలో జబర్ధస్త్ కమెడియన్లే టీమ్ లీడర్లుగా పరిచయం అయ్యారు. అలాగే, ఎంతో మంది ఆర్టిస్టులు అక్కడి నుంచి ఇక్కడకు జంప్ అయ్యారు.

షో అదిరింది.. రేటింగ్ పెరిగింది

షో అదిరింది.. రేటింగ్ పెరిగింది

ఎన్నో అంచనాల నడుమ నాగబాబు సారథ్యంలో ప్రారంభం అయింది ‘అదిరింది' షో. చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీ, వేణు, ధన్‌రాజ్‌తో పాటు యువ కమెడియన్ల గల్లీ బాయ్స్‌ టీమ్‌ల స్కిట్లతో వచ్చినా ఈ షోకు మొదట్లో పెద్దగా ఆదరణ లభించలేదు. కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ దీనికి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఫలితంగా సదరు ఛానెల్ టీఆర్పీ రేటింగ్ కూడా పెరిగిపోయింది.

బొమ్మ అదిరింది అని కొత్తగా

బొమ్మ అదిరింది అని కొత్తగా

ముందుగా ప్లాన్ చేసుకున్నట్లు అదిరింది షోను కొన్ని వారాలకే పరిమితం చేశారు నిర్వహకులు. ఆ తర్వాత దీనికి మేజర్ మార్పులు చేసి ‘బొమ్మ అదిరింది' పేరిట సీజన్ 2ను ప్రారంభించారు. ఇటీవలే మొదలైన ఈ షోకు శ్రీముఖి యాంకరింగ్ చేస్తోంది. అలాగే, పలువురు ప్రముఖులు గెస్టులుగా విచ్చేశారు. జడ్జ్‌గా ఉన్న నవదీప్ వెళ్లిపోగా నాగబాబు మాత్రం కొనసాగుతున్నారు.

రికార్డులు బ్రేక్.. అప్పుడే షాక్

రికార్డులు బ్రేక్.. అప్పుడే షాక్

గురువారం, శుక్రవారం ప్రసారం అయ్యే జబర్ధస్త్ షోకు సంబంధించిన స్కిట్లు అన్నీ యూట్యూబ్‌లో సత్తా చాటుతున్నాయి. మరీ ముఖ్యంగా హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్కిట్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో అదిరింది షోలోని గల్లీ బాయ్స్ సహా మరికొన్ని స్కిట్లు వాటికి పోటీగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఆ షో స్కిట్లు యూట్యూబ్‌లో అప్‌లోడ్ అవడం లేదు.

Recommended Video

Nagababu Praises Kirrak RP At His New Movie Opening Event
 అన్నీ అక్కడే.. రూల్స్ ప్రకారమే

అన్నీ అక్కడే.. రూల్స్ ప్రకారమే

అదిరింది షో జీ తెలుగు చానెల్‌లో ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ‘బొమ్మ అదిరింది' కూడా అదే ఛానెల్‌లో వస్తోంది. అయితే, ఈ ఛానెల్‌కు ZEE5 ప్రత్యేకమైన ఓటీటీ ఫ్లాట్‌ఫాం ఉంది. సో.. అన్ని షోలతో పాటు అదిరింది స్కిట్లు కూడా అందులోనే అప్‌లోడ్ చేస్తున్నారు. సదరు యాప్‌లో షో చూడాలంటే మాత్రం మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది.

అదిరింది షోకు ఊహించని కష్టాలు

అదిరింది షోకు ఊహించని కష్టాలు

అదిరింది స్కిట్లు యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయని కారణంగా ఆ షో ఫ్యాన్స్ యూనిట్‌పై విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ‘బొమ్మ అదిరింది' స్కిట్లు కూడా అందులో కనిపించకపోవడంతో వాళ్లంతా ఫైర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల విడుదల చేసిన ప్రోమో కామెంట్ సెక్షన్‌లో షో జడ్జ్ మెగా బ్రదర్ నాగబాబుతో పాటు షో నిర్వహకులను బండ బూతులు తిడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X