Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ సేవ్ చేస్తున్నా బిగ్ షాకిస్తున్న ఫ్యాన్స్.. టాప్ 5 లిస్టు మొత్తం ఉల్టాపుల్టా

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో కానీ అద్భుతమైన రెప్సాన్స్ తో దూసుకెళ్తోంది. ఎవరూ ఊహించని విధంగా షో రవసత్తరంగా సాగుతోంది. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన బిగ్ బాస్.. ఎప్పుడు ఏం చేస్తారో, ఏం చేయబోతున్నారో ఎవరి అంచనాలకు అందడం లేదు. ముందుగా 14 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపిన బిగ్ బాస్... ఆ తర్వాత నాలుగు వారాల పాటు నలుగురిని ఎలిమినేట్ చేశారు. ఐదో వారంలో ఐదుగురు వైల్డ్ కార్డ్ కంటస్టెంట్లను ఇంట్లోకి తీసుకు వచ్చారు.

అయితే ఈ సారి సీజన్ లో సీరియల్ నటులే ఎక్కువగా ఉన్నారు. మొత్తం ఐదుగురు సీరియల్ గ్రూపుకు చెందిన వాళ్లే కావడం ఇదే తొలసారి. మొదటి వారంలోనే అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్ లు ఇంట్లో అడుగు పెట్టారు. ఈ ముగ్గురు కంటెస్టెంట్లు ముందు నుంచి స్టార్ మాకు సంబంధించిన సీరియల్స్ లోనే ఎక్కువగా చేశారు. దీంతో బిగ్ బాస్ టీం నిర్వాహకులు వీరికి ఫేవర్ గా ఉంటున్నారు. వారిని టాప్ 5 వరకు తీసుకు వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. వీరు ముగ్గురే కాకుండా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అంబటి అర్జున్, పూజా మూర్తిలు ఇంట్లోకి వచ్చారు.

 Fans Get Shock to SPA Batch Even Bigg Boss Saved And Present Top Top 5 List of Bigg boss Telugu 7

అయితే దురదృష్టవశాత్తు.. పూజా మూర్తి త్వరగానే ఎలిమినేట్ అయి వెళ్లిపోయింది. కానీ అంబటి అర్జున్ మాత్రం టాప్ కి వచ్చేశాడు. ఆయనకు అంతగా ఓటింగ్ లేకపోయినప్పటికీ... ఫినాలే అస్త్ర గెలుచుకుని ఇంట్లో కొనసాగుతున్నాడు. 13వ వారంలో అంబటి అర్జున్ యే ఎలిమినేట్ కావాల్సి ఉండగా... ఫినాలే అస్త్రతో సేవ్ అయిపోయాడు. ఫలితంగా గౌతమ్ కృష్ణ ఎలిమినేట్ అయిపోయాడు. అయితే ఆ వారంలో శోభాశెట్టికి చాలా తక్కువగా ఓటింగ్ పడింది. కానీ బిగ్ బాస్ మాత్రం ఆమెను మరోసారి సేవ్ చేశాడు.

 Fans Get Shock to SPA Batch Even Bigg Boss Saved And Present Top Top 5 List of Bigg boss Telugu 7

ప్రస్తుతం ఇంట్లో ఏడుగురు ఉండగా.. నలుగురు సీరియల్ బ్యాచ్ కు చెందిన వాళ్లే. ఈ చుక్క బ్యాచ్ ను కాపాడుకోవడానికి... అమర్ దీప్ ను విన్నర్ గా చేయడానికి బిగ్ బాస్ టీం నిర్వాహకులు చాలానే కృషి చేశారు. కానీ బుల్లితెర ప్రేక్షకులు మాత్రం వాళ్లకు గట్టి షాక్ ఇస్తున్నారు. ఎంత ప్రయత్నించినా వారిని ఇప్పుడు కాపాడుకోలేకుండా చేస్తున్నారు. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లందరినీ కింద పడేసేలా... మిగతా ముగ్గురిని టాప్ 3 లో నిలబెడుతున్నారు.

 Fans Get Shock to SPA Batch Even Bigg Boss Saved And Present Top Top 5 List of Bigg boss Telugu 7

ప్రస్తుతం నడుస్తున్న ఓటింగ్ లెక్కలు చూస్తుంటే టాప్ 1 లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. అలాగే రెండో స్థానంలో శివాజి, మూడో స్థానంలో ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఇక ఆ తర్వాతి స్థానాల్లో సీరియల్ గ్రూపుకు చెందిన అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టిలు ఉన్నారు. ఇలా బిగ్ బాస్ ప్లాన్ ను తిప్పికొడుతూ.. బిగ్ బాస్ టీం నిర్వాహకులుక బిగ్ షాకిస్తున్నారు ప్రేక్షకులు. ఇదంతా చూస్తుంటేనే ఈ సీజన్ విన్నర్ గా పల్లవి ప్రశాంత్ నిలవబోతున్నాడని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X