అమ్మాయితో హోటల్ రూమ్‌లో సుడిగాలి సుధీర్: అతడు చేసిన పనికి వాళ్లంతా షాక్

తెలుగు బుల్లితెరపైకి కొంత కాలంగా ఎంతో మంది ఆర్టిస్టులు ఎంట్రీ ఇస్తున్నారు. అయితే, వారిలో అందరూ సక్సెస్ కావడం లేదు. కేవలం కొందరు మాత్రమే తమ టాలెంట్లతో జనాల దృష్టిలో పడడంతో పాటు స్టార్లుగా ఎదిగిపోతున్నారు. అలాంటి వారిలో జబర్ధస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ ఒకరు. సుదీర్ఘ కాలంగా తనలోని అన్ని రకాల టాలెంట్లను చూపిస్తూ సత్తా చాటుతున్నాడు.

దీంతో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను భారీగా పెంచుకోవడంతో పాటు వరుస పెట్టి ఆఫర్లను కూడా సొంతం చేసుకుంటున్నాడు. దీంతో సుధీర్ పేరు తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ యంగ్ కమెడియన్ అమ్మాయితో హోటల్ రూమ్‌ అంటూ రచ్చ చేశాడు. ఇంతకీ ఏం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

సుదీర్ఘ ప్రయాణంతో జబర్ధస్త్‌గా

సుదీర్ఘ ప్రయాణంతో జబర్ధస్త్‌గా

మ్యాజిక్‌లు చేసుకుంటూ తన కెరీర్‌ను ప్రారంభించాడు సుధీర్. ఈ క్రమంలోనే జబర్ధస్త్ షోలోకి ఆర్టిస్టుగా అడుగు పెట్టాడు. అలా వచ్చిన చాలా తక్కువ సమయంలోనే తనదైన శైలి టైమింగ్‌తో విశేషమైన గుర్తింపు అందుకున్నాడు. దీంతో షో నిర్వహకులు సుధీర్‌కు టీమ్ లీడర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఇక, అప్పటి నుంచి మరింత ఉత్సాహంగా కనిపిస్తూ మజాను పంచుతూనే ఉన్నాడు.

రష్మీ డేటింగ్‌తో మరింత ఫేమ్

రష్మీ డేటింగ్‌తో మరింత ఫేమ్

యాక్టింగ్, డ్యాన్స్, కామెడీ, సాంగ్స్ ఇలా అన్నింట్లోనూ సత్తా చాటుతూ సుడిగాలి సుధీర్ ఎనలేని క్రేజ్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలోనే యాంకర్ రష్మీ గౌతమ్‌తో లవ్ ట్రాక్ నడుపుతున్నాడన్న వార్తలతో మరింత ఫేమస్ అయ్యాడు. చాలా కాలంగా ఆమెతో వ్యవహారం నడుపుతున్నట్లు కనిపిస్తున్నాడు. అంతేకాదు, వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నాడని కూడా ప్రచారం జరుగుతోంది.

సినిమాల్లోనూ సుధీర్ దూకుడు

సినిమాల్లోనూ సుధీర్ దూకుడు

సుదీర్ఘ కాలంగా సుడిగాలి సుధీర్ బుల్లితెరపై టాప్ ఆర్టిస్టుగా వెలుగొందుతున్నాడు. ఈ క్రమంలోనే సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇలా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో మంచి మంచి పాత్రల్లో నటించాడు. అలాగే హీరోగానూ మారి 'సాఫ్ట్‌వేర్ సుధీర్', 'త్రీమంకీస్' అనే సినిమాలు చేశాడు. ఇక, ఇప్పుడు సుధీర్ హీరోగా 'కాలింగ్ సహస్రా', 'గాలోడు' అనే సినిమాల్లో నటిస్తున్నాడు.

ఆ రెండు షోలు మాత్రమే చేస్తూ

ఆ రెండు షోలు మాత్రమే చేస్తూ

ఆ మధ్య సుడిగాలి సుధీర్ 'పోవే పోరా' అనే షోతో యాంకర్‌గానూ మారి తెగ సందడి చేశాడు. హోస్టుగానూ తన మార్క్‌ను చూపించి ఆకట్టుకున్నాడు. కానీ, ఆ షోతో యాంకరింగ్‌ను ఆపేశాడు. ఇలాంటి సమయంలో ప్రముఖ ఛానెల్‌లో వస్తున్న 'శ్రీదేవి డ్రామా కంపెనీ' అనే షోతో యాంకర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు దీనితో పాటు జబర్ధస్త్‌లో మాత్రమే అతడు అలరిస్తున్నాడు.

ప్రత్యేక ఆకర్షణగా సుధీర్ టీమ్

ప్రత్యేక ఆకర్షణగా సుధీర్ టీమ్

వచ్చే శుక్రవారం ప్రసారం కాబోతున్న ఎక్స్‌స్ట్రా జబర్ధస్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో అన్ని టీమ్‌లు తమ తమ స్కిట్లతో తెగ సందడి చేశాయి. మరీ ముఖ్యంగా ఇందులో సుడిగాలి సుధీర్ బృందం చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పంచులతో ప్రసాద్.. ప్రత్యేకమైన మేనరిజంతో శ్రీను.. తనదైన కామెడీతో సుధీర్ అల్లరి చేయడం ప్రత్యేకంగా నిలిచింది.

అమ్మాయితో హోటల్ రూమ్

అమ్మాయితో హోటల్ రూమ్

వచ్చే వారం ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో.. గెటప్ శ్రీను సుధీర్‌తో 'నేను ఇచ్చిన ఐదు వేలు ఏం చేశావ్' అని ప్రశ్నిస్తాడు. దీనికతడు.. 'ఆఫీస్ నుంచి వస్తుంటే అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఇద్దరం వెళ్తుండగా ఫుల్ వర్షం వచ్చింది. దీంతో హోటల్ రూమ్ తీసుకుని నైటంతా ఇద్దరం బట్టలు ఆరబెట్టుకున్నాం' అంటూ ఊహించని విధంగా డైలాగులు చెప్పాడు.

ఫ్యాన్స్ షాక్.. అలాంటివి వద్దని

ఫ్యాన్స్ షాక్.. అలాంటివి వద్దని

జబర్ధస్త్ కమెడియన్‌గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. కొన్ని స్కిట్లలో దిగజారి తనపై తానే పంచులు వేసుకుంటున్నాడు. ఇక, ఇప్పుడు అమ్మాయిని హోటల్ రూమ్‌కు తీసుకెళ్లానని చెప్పాడు. దీంతో ఇప్పుడు అతడు చేసిన కామెంట్ల పట్ల ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు. దయచేసి అలాంటి స్కిట్లు చేయొద్దంటూ యూట్యూబ్‌లో కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X