Bigg Boss 7 Telugu: బిగ్ బాస్‌లోకి యువ రైతు.. స్పెషల్ రిక్వెస్ట్‌తో ఆఫర్.. రెమ్యూనరేషన్ షాకింగ్‌గా!

ఎన్నో అనుమానాల నడుమ తెలుగు బుల్లితెరపైకి వచ్చినా.. ఎవరూ ఊహించని రీతిలో ప్రేక్షకుల మనసులు దోచుకున్న ఏకైక షో బిగ్ బాస్. అందుకే ఈ కార్యక్రమం వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటూ వెళ్తోంది. ఇలా ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను కంప్లీట్ చేసుకుని.. ఇప్పుడు ఏడో దానికై సంసిద్ధం అవుతోంది. ఇక, ఈ సీజన్‌కు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పాల్గొనే కంటెస్టెంట్ల పేర్లు లీక్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఓ షాకింగ్ నేమ్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసమే!

ఏడో సీజన్‌‌ అప్పుడే స్టార్ట్:బిగ్ బాస్ షో ఇండియాలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోంది. కానీ, తెలుగులో మాత్రమే అదిరిపోయే రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. ఫలితంగా ప్రతి ఏడాది ఒక సీజన్ ఉండేలా నిర్వహకులు ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా అక్కినేని నాగార్జునే హోస్టుగా వ్యవహరించబోతున్నాడు.

Farmer Pallavi Prashanth Likely Entry To Bigg Boss 7 Telugu

ఉల్టాపుల్టా కాన్సెప్టుతోనే:మొదటి ఐదు సీజన్లు ఒక దానికి మించి ఒకటి సక్సెస్ అయ్యాయి. కానీ, ఆరోది మాత్రం ప్రేక్షకుల మెప్పును పొందలేకపోయింది. దీంతో ఏడో సీజన్‌ను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని నిర్వహకులు పట్టుదలగా ఉన్నారు. ఇందుకోసం ఉల్టాపుల్టా అనే కొత్త కాన్సెప్టును తీసుకు వస్తున్నట్లు నాగార్జున చెప్పాడు. దీంతో ఈ సీజన్‌పై ఆరంభం నుంచే అంచనాలు పెరుగుతున్నాయి.

ఆ పనులు చివరి దశలో:సెప్టెంబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌ పనులు దాదాపుగా పూర్తైనట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే షో హౌస్ సెట్‌‌కు సంబంధించిన వర్కును, స్టేజ్‌ను కూడా చాలా వరకూ రెడీ చేసేశారట. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇంట్లో సదుపాయాలను ఏర్పాటు చేశారని తెలిసింది. అలాగే, కాన్సెప్టు వర్క్ కూడా దాదాపుగా కంప్లీట్ అయిందట.

20 మంది.. కొన్ని పేర్లు:అతి త్వరలోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌కు సంబంధించిన కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియను నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించారు. ఇలా ఇప్పటికే 20 మందితో కూడిన ఫైనల్ లిస్టును వాళ్లు రెడీ చేశారట. మోహన భోగరాజు, అమర్‌దీప్, అంజలి, సందీప్ మాస్టర్, జబర్ధస్త్ మహేశ్, నిఖిల్, రియాజ్, సింగర్ దామిని, బుల్లెట్ భాస్కర్, పవిత్ర పేర్లు వినిపిస్తున్నాయి.

షోలో గల్లీ యువ రైతు:భారీ అంచనాల నడుమ గ్రాండ్‌గా లాంచ్ కాబోతున్న ఏడో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో నిర్వహకులు ఎన్నో ప్లాన్లు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇందులో కామన్ మ్యాన్ కేటగిరిలోనూ ఫేమస్ అయిన సోషల్ మీడియా స్టార్లనే తీసుకోబోతున్నారు. ఇందులో భాగంగానే ఈ కోటాలో యువ రైతు పల్లవి ప్రశాంత్‌ను ఎంపిక చేసినట్లు తాజాగా ఓ న్యూస్ లీకైంది.

Farmer Pallavi Prashanth Likely Entry To Bigg Boss 7 Telugu

అతడి కోరుకోవడంతో:సోషల్ మీడియాలో వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు చేస్తూ పల్లవి ప్రశాంత్ ఫేమస్ అయ్యాడు. అతడికి క్రమంగా ఫాలోయింగ్ కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో రెండు, మూడు సీజన్ల నుంచి తనను బిగ్ బాస్‌కు ఎంపిక చేయాలని అతడు కోరుతున్నాడు. ఈ కారణంగానే ఇప్పుడు పల్లవి ప్రశాంత్‌కు నిర్వహకులు ప్రాధాన్యం ఇచ్చి.. షోలోకి తీసుకున్నారని తెలుస్తోంది.

షాకింగ్ రెమ్యూనరేషన్:వాస్తవానికి బిగ్ బాస్ నిర్వహకులు సెలెబ్రిటీల డిమాండ్‌ను బట్టి రెమ్యూనరేషన్ ఇస్తుంటారు. కానీ, పల్లవి ప్రశాంత్ తన ఇష్టంతో షోలోకి రావాలని అనుకున్నాడు. దీంతో ఈ యువ రైతుకు అతి తక్కువ రెమ్యూనరేషన్ మాత్రమే ఇచ్చి తీసుకు వస్తున్నారట. అంతేకాదు, ఈ సీజన్‌లో రాబోయే కంటెస్టెంట్లు అందరిలోనూ ప్రశాంత్‌కే తక్కువ మొత్తం ఇస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X