ఆ నటికి మెంటల్ సమస్య ఉందా? స్టార్ హీరో సినిమాకు ఇదో తలనొప్పి కానుందా?

తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా ప్రారంభమైన 'బిగ్ బాస్ 3' షో రసవత్తరంగా సాగుతోంది. జూన్ 24న మొదలైన ఈ రియాల్టీ షో మొత్తం 15 మంది కంటెస్టెంట్లతో ప్రారంభం అవ్వగా.... మొదటి కంటెస్టెంటుగా ప్రముఖ తమిళ నటి ఫాతి బాబు హౌస్‌లోకి అడుగు పెట్టారు. ఆశ్చర్యకరంగా ఆమెనే ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన తొలి వ్యక్తి కావడం గమనార్హం.

షో ప్రారంభమైన రెండు వారాల తర్వాత బిగ్ బాస్ తమిళ 3లో ఎలిమినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం....అతి తక్కువ ఓట్లు పోలవ్వడంతో ఈ షో నుంచి ఫాతి బాబు బయటు రాక తప్పలేదు. షో నుంచి బయటకు వచ్చిన అనంతరం మీడియా ఇంటర్వ్యూల్లో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమె కొందరు కంటెస్టెంట్లపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అభిరామికి మెంటల్ ప్రాబ్లం ఉంది

అభిరామికి మెంటల్ ప్రాబ్లం ఉంది

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఫాతిమా బాబు మాట్లాడుతూ... ‘బిగ్ బాస్ షోలో కంటెస్టెంటుగా ఉన్న అభిరామి వెంకటాచలం చాలా సెన్సిటివ్ పర్సన్. ఆమెను పరిశీలించినపుడు మెంటల్ సమస్య ఉందని అర్థమైంది. ప్రతి చిన్న విషయానికి డిస్ట్రబ్ అవ్వడం గమనించాను.' అన్నారు.

షోలోకి వచ్చే ముందు సైకియార్టిస్టుకు చూపిస్తే బావుండేది

షోలోకి వచ్చే ముందు సైకియార్టిస్టుకు చూపిస్తే బావుండేది

బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకొచ్చే ముందు ఆమెను సైకియార్టిస్టుకు చూపిస్తే బావుండేది. అభిరామి మీద అరవడం లాంటివి చేయకూడదని, ఆమెను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని వనితా, ఇతర కంటెస్టెంట్లకు చెప్పాను. ఆమె డిప్రెషన్ సమస్యల కారణంగా షో నుంచి బయటకు పంపించాలని అంతా భావించారని, అయితే ఆ సమయంలో తాను సపోర్ట్ చేసినట్లు ఫాతిమా బాబు తెలిపారు.

ఎవరీ అభిరామి వెంకటాచలం

ఎవరీ అభిరామి వెంకటాచలం

తమిళ టీవీ, సినీ నటి అభిరామి వెంకటాచలనం...‘లవ్ మి లవ్లీ లేడీ' అనే మ్యూజిక్ వీడియో ద్వారా తన కెరీర్ మొదలు పెట్టారు. ‘కలవు' అనే సినిమా ద్వారా నటిగా కెరీర్ మొదలు పెట్టింది. అజిత్ నటించిన లేటెస్ట్ మూవీ ‘నేర్కొండ పార్వాయ్'లో కీలక పాత్ర పోషించింది.

అభిరామి బిగ్ బాస్ ఇంట్లో చేస్తున్న పనులు స్టార్ హీరో సినిమాకు నష్టం కలిగిస్తుందా?

అభిరామి బిగ్ బాస్ ఇంట్లో చేస్తున్న పనులు స్టార్ హీరో సినిమాకు నష్టం కలిగిస్తుందా?

‘నేర్కొండ పార్వాయ్' మూవీ ఆగస్టు 1న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నరు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షోలో అభిరామి ప్రవర్తన ఈ సినిమాపై ప్రభావం చూపే అవకాశం ఉందనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. మరి అప్పటి వరకు అభిరామి షోలో కొనసాగుతుందా? ఎలిమినేట్ అవుతుందా? అనేది చూడాలి.

తమిళ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్

తమిళ బిగ్ బాస్ 3 కంటెస్టెంట్స్

ఈ షో నుంచి ఫాతిమా బాబు బయటకు రావడంతో... ప్రస్తుతం లోస్లియా మరియనేసన్, సాక్షి అగర్వాల్, జంగిరి మధుమిత, కెవిన్, అభిరామి వెంకటాచలం, శరవణన్, వనితా విజయ్ కుమార్, చేరన్, షెరిన్ శ్రింగర్, మోహన్ వైద్య, థర్శన్ త్యాగరాజన్, డాన్స్ మాస్టర్ సాండీ, ముగెన్ రావు, రేష్మా పసుపులేటి, వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన మీరా మిథున్ కొనసాగుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X