Brahmamudi February 10th కావ్యను ఇరికించేందుకు అనామిక, రుద్రాణి ప్లాన్... శ్వేతతో రాజ్ పెళ్లి!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ (జనవరి 10వ తేదీన) హాల్లో ఇందిరాదేవి, అపర్ణ కూర్చొని ఉంటారు. ఇంతలో ఇంట్లోని వారంతా వచ్చి నెలకు సరిపడ సామానుల లిస్టు ఇస్తుంటారు. ఇక ధాన్యలక్ష్మి కూడా తనకు కావాల్సిన నెల సామాను లిస్టును ఇవ్వాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు నీకు అహం అడ్డు వస్తుందా.. ఇస్తాను ఉండు దిమ్మతిరిగిపోయే షాక్ అని అపర్ణ అనుకుంటుంది. కావ్యను పిలిచి నీకేం అక్కర్లేదా అని అంటుంది అపర్ణ. నాకేం వద్దని.. కావాల్సినవి రాజ్ లిస్టులోనే రాశాను అని చెప్తుంది.

సరే ఇవాళ్టి నుంచి నువ్వు ఒక పని చేయాలని.. ఇంటి బాధ్యతలు నువ్వే తీసుకోవాలని అపర్ణ.. కావ్యకు చెప్తుంది. అది విన్న ధాన్యలక్ష్మి, రుద్రాణి, అనామిక షాక్ అవుతారు. పెద్దకోడలిగా ఇవాళ్టి నుంచి నీదే బాధ్యత అంటూ అపర్ణ కావ్యకు తాళాలు ఇస్తుంది. ఇందిరాదేవి కూడా తీసుకోమని కావ్యకు చెప్తుంది. ఇవి ఈ ఇంటి గౌరవానికి గుర్తులు అంటుంది. ఎవరికి ఏ అవసరం వచ్చిన నీ దగ్గరకు రావాలని కావ్యకు చెప్తుంది కావ్య.

February 10th 2024 Episode number 329 in Brahmamudi Telugu Serial

ఇది నీ హక్కు అని అపర్ణ అంటుంది. కావ్య ఆ తాళాలను తీసుకుంటుంది. ఇక కల్యాణ్ కూడా సంతోషిస్తాడు. అనామక మాత్రం కోపంతో రగిలిపోతుంది. ఇందులో ఉన్నవి తెప్పించి ఎవరికి కావాల్సినవి వాళ్లను తీసుకోమను అని అపర్ణ ఇస్తుంది. ఇక కల్యాణ్ కూడా లిస్ట్ ఇస్తాడు. వాళ్ల ఆవిడ కోసం రోజుకో రెండు మూరలు మల్లేపూలు తెప్పించు కావ్య అని అంటుంది ఇందిరాదేవి. అనామిక నువ్వేమి ఇవ్వలేదా అని కల్యాణ్ అడుగుతాడు.

నాకు కావాల్సినవి పుట్టింటి నుంచి నుంచి తెచ్చుకున్నాను అని అనామిక అంటుంది. అపర్ణ ఫైర్ అవుతుంది. పుట్టింటి నుంచి తెచ్చుకోవద్దని చెప్తుంది. ఇక కావ్య కూడా తనకు కావాల్సినవి ఏమైనా ఉంటే లిస్ట్ ఇవ్వమంటుంది. తన పుట్టింటి నుంచి తీసుకువచ్చినవి వెనక్కి పంపమని కల్యాణ్ కు చెప్తుంది. ఇక ఆ సంగతి వదిలేసి.. ఎవరైన లిస్ట్ ఇచ్చేది ఉంటే ఇవ్వమని అపర్ణ ఆర్డర్ వేస్తుంది. ధాన్యలక్ష్మి ఇవాల వద్దా అని ఆలోచిస్తూ ఉంటుంది.

కావ్యకు లిస్టు ఇవ్వలేక అక్కడే పేపర్ పడేసి పోతుంది. ఇక ఆ పేపర్ తీసుకుని.. అందరికి తెప్పించాల్సిన లిస్టులో కలుపుతుంది. మరోవైపు అనామిక రుద్రాణి మాట్లాడుకుంటారు. ఇంటి అధికారం కోసం నేను ఎదిరిస్తాను అంటూ అనామిక అంటుంది. కావ్యను ఇరికించడానికి మంచి అవకాశం దొరికిందని చెప్తుంది రుద్రాణి. ఇద్దరు కలిసి కావ్య మీద కుట్ర పన్నుతారు. మరోవైపు అప్పు పోలీస్ ట్రైనింగ్ కోసం మూర్తితో కలిసి ట్రైనింగ్ సెంటర్ కు వెళ్తుంది.

నోటిఫికేషన్ పడేలోపు నా వైపు ఫిట్ గా ఉంటే.. గ్యారెంటిగా జాబ్ వస్తుందని అప్పు అంటుంది. ఇక ఓ వ్యక్తి వచ్చి తనకు 5లక్షలు ఇస్తే.. జాబ్ ఇప్పిస్తాను అని చెప్తాడు. దీంతో అప్పు, కృష్ణ మూర్తి ఫైర్ అవుతారు. చెప్పుతో కొడతాను అని మూర్తి వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఆ వ్యక్తి పారిపోతాడు. ఇక తాను ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగం సాధిస్తాను.. నువ్వేం ఫికర్ చేయకు అని అప్పు తండ్రికి చెప్తుంది.

February 10th 2024 Episode number 329 in Brahmamudi Telugu Serial

మరోవైపు గదిలో అనామిక రెడీ అవుతుంటే కల్యాణ్ వస్తాడు. అనామిక అందాలను చూసి పడిపోతాడు కల్యాణ్. అనామిక నడుమును చూసి ఫ్లాట్ అయిపోతాడు. అనామికకు ముద్దు పెడుదామని దగ్గరకు వెళ్తుంటే అనామిక తోసేస్తుంది. ముందు ఆఫీసుకు పోతేనే తాను దగ్గర అవుతాను అంటూ కండిషన్ పెడుతుంది. ఆఫీసుకు పోవాలని అంటుంది. సరే అని కల్యాణ్ అంటాడు. మరోవైపు ఆఫీసుకు రాజ్ రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలో శ్వేత కాల్ చేస్తుంది.

హాయ్ శ్వేత అంటూ మాట్లాడుతాడు. ఈరోజు నా భర్త విడాకుల సైన్ కోసం వస్తున్నాడు. అతను పక్కన ఉంటే ఏం చేస్తాడో అని భయంగా ఉందని చెప్తుంది శ్వేత. ఇక ఇప్పుడే వస్తున్నా అంటూ రాజ్ బయలుదేరుతాడు. కావ్య రాజ్ ను ఫాలో అవ్వాలి అనుకుంటుంది. ఇంతలో రుద్రాణి వచ్చి లాకర్ తాళాలు కొట్టేయాలనుకుంటుంది. కావ్యను మాటల్లో పెట్టి.. లాకర్ తాళాలు కొట్టేస్తుంది. ఇక ఆ లాకర్ తాళాలు తీసుకుని అనామిక దగ్గరకు వస్తుంది. కల్యాణ్ ను ఆఫీసుకు పంపించాను అని చెప్తుంది.

నిన్ను చూస్తుంటే నా ఆశలు అన్ని నేరవేరేలా ఉన్నాయని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో శ్వేతకు విడాకులు వస్తాయి. దీంతో రాజ్... సంతోషంతో నీకు విడాకులు వచ్చేశాయి కాబట్టి మన పెళ్లికి ఎలాంటి అడ్డంకులు లేవు కదా అని అంటాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్.. మనకు విడాకులు రాలేదానా అని అంటాడు. ఎలాగూ కళావతికి కూడా చెప్పేశాను అని చెప్తాడు. ఇదంతా కావ్య విని కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X