Brahmamudi February 13th కావ్యపై దొంగతనం మోపిన రుద్రాణి... రాజ్ బాగోతం గురించి తెలుసుకున్న మూర్తి!
నేటి బ్రహ్మముడి సీరియల్ (ఫిబ్రవరి 13వ తేదీ ఎపిసోడ్)లో రాజ్ తన ఛాంబర్ లోకి కావ్యను పిలిచి మీటింగ్ ఎందుకు అటెండ్ అయ్యావని తిడుతాడు. నేను లేకుండా మీటింగ్ పెట్టడంలో నీ ఉద్ద్యేశం ఏంటని అడుగుతాడు. మీరు మీ ఫియాన్సీతో ఊరేగుతుంటే మేమిక్కడ ఖాళీగా కూర్చోవాలా అని కావ్య ప్రశ్నిస్తుంది. నువ్వు ఏ ఉద్ద్యేశంతో మీటింగ్ కంటిన్యూ చేశావో నాకు తెలుసని రాజ్ అంటాడు. ఏ ఉద్యేశంతో చేశానని అనుకుంటున్నారని కావ్య అంటుంది.
నిన్ను వదిలేస్తానని చెప్పాను కాబట్టి ఈలోగా మా డాడీ దగ్గర మార్కులు కొట్టేసి.. నా ఫ్యామిలీ మొత్తాన్ని నీ వైపు తిప్పుకోవాలని ఇదంతా చేస్తున్నావని రాజ్ ఫైర్ అవుతాడు. రేపు నేను నీకు విడాకులిస్తానంటే నా వాళ్లంతా నీకు సపోర్టు చేయాలని ఇదంతా చేస్తున్నావని ఆవేశంగా చెప్తాడు. నాది అంత చీప్ క్యారెక్టర్ కాదని మీకు ఎన్ని సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని కావ్య చెప్తుంది. కళ్యాణ్ ఫోన్ నుంచి చేస్తే వస్తానని చెప్పి ఎప్పుడొచ్చారు అంటుంది.

రాజ్ కోపంగా శ్వేతకు త్వరలోనే విడాకులు రాబోతున్నాయి. ఆ వెంటనే నేను నీకు విడాకులు ఇచ్చి నేను శ్వేత పెళ్లి చేసుకుంటామని అంటాడు. నువ్వికి నా జీవితంలోంచి వెళ్లిపో అని అరుస్తాడు. దీంతో కావ్య ఏడుస్తూ వెళ్లిపోతుంది. కావ్యను చూసిన శ్వేత కోపంగా లోపలికి వెళ్లి రాజ్ ను తిడుతుంది. తను నాతో హ్యాపీగా లేదని అందుకే ఇష్టం లేకపోయినా ఇలా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం అని అబద్దం చెప్పానని రాజ్ అంటాడు.
అప్పుడైనా తనకు కావ్య దూరం అవుతుందని రాజ్ చెప్పగానే శ్వేత ఒక అమ్మాయిని బాధపెట్టడం పద్దతి కాదంటుంది. దీంతో చాటు నుంచి కావ్య మొత్తం విని ఏడుస్తూ వెళ్లిపోతుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో రుద్రాణి, అనామిక హాల్లో కూర్చుని గుసగుసలాడుకుంటుంటారు. ఈ మధ్య మీ పెద్దత్త మీ అత్తని తెగ ఆడేసుకుంటుందని రుద్రాణి అంటుంది. ఏం మిమ్మల్నేమయినా తక్కువ అంటున్నారా? అని అనామిక సెటైర్ వేస్తుంది.
నేనంటే ఆడపడుచుని నన్ను అనడానికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ మీ అత్తకే పాపం ఇత్తడైపోతుందని రుద్రాణి అంటుంది. అవును పాపం అని అనామిక అంటుంటే.. నువ్వు మీ అత్తను వెనకేసుకొచ్చి మీ పెద్దత్తను గట్టిగా దులిపేయ్యోచ్చు కదా? అని రుద్రాణి అంటుంది. మా అత్తకు చెప్పుకునే దిక్కులేదు. ఇక నన్ను కరివేపాకు కింద తీసిపారేయదని అనామిక అంటుంది. నువ్విలాగే ఉంటే అంతే సంగతులని రుద్రాణి అంటుంది.
ఇద్దరూ మాట్లాడుకుంటుంటే ఇంతలో అక్కడకు అపర్ణ వస్తుంది. ఇద్దరూ సైలెంట్ అవుతారు. ఆఫీసు నుంచి సంపత్ వచ్చి సుభాష్ సార్ పంపిచారు అని ఐదు లక్షలు తీసుకురమ్మని చెప్పారని అపర్ణకు చెప్తాడు. అపర్ణ లోపలికి వెళ్లి లాకర్ లో డబ్బులు చూసి మూడు లక్షలే ఉన్నాయేంటి అనుకుని బయటకు వచ్చి సంపత్ కు మూడు లక్షలు ఇస్తుంది. మిగతా రెండు లక్షలు ట్రాన్స్ ఫర్ చేస్తానని చెప్పు అని చెప్తుంది. దీంతో సంపత్ వెళ్లిపోతాడు.
అదేంటి వదిన డబ్బులు ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అడుగుతుంది రుద్రాణి. లాకర్‌లో ఐదు లక్షలుండాలి. కానీ ఇప్పుడు చూస్తే మూడు లక్షలే ఉన్నాయని అపర్ణ చెప్తుంది. రుద్రాణి, అనామిక షాక్ అయినట్లు నటిస్తూ.. ఏంటి నీకు తెలియకుండా అంత డబ్బు ఎలా మాయం అంవుతుంది. ఎక్కడికి పోతాయి ఎవరు తీసి ఉంటారని రుద్రాణి అంటుంది. ఇంకెవరు తీసుంటారు. దొంగ చేతికి తాళాలు ఇస్తే.. ఇలాగే ఉంటుందని చెప్తుంది ధాన్యలక్ష్మి.
రెండు లక్షలు కావ్య తీసి ఉండొచ్చని ఆమెపై దొంగతనం మోపి.. తాళం ఇచ్చిన మొదటిరోజే ఇలా చేసింది అని ధాన్యలక్ష్మి, రుద్రాణి అంటారు. దీంతో అపర్ణ కోపంగా నీ కోడలు కూడా తీసి ఉండొచ్చు కదా ఎందుకంటే ఇంతకు ముందు తాళాలు తీసుకొచ్చి ఇచ్చింది నీ కోడలే అంటూ లోపలికి వెళ్లిపోతుంది. దీంతో ధాన్యలక్ష్మీ, రుద్రాణి, అనామిక చాలా హ్యాపీగా ఇవాళ ఆ కావ్య పని అయిపోయిందని ఫీలవుతారు. అనామిక ఈ నిజం తెలిస్తే నా పని అయిపోయినట్లే అని మనసులో అనుకుంటుంది.

మరోవైపు ఆఫీసు నుంచి బాధగా ఇంటికి వస్తున్న కావ్య కారు మధ్యలో ఆగిపోతుంది. ఇంతలో రాజ్ వచ్చి ఏమైందని డ్రైవర్‌ను అడుగుతాడు. ఏదో ప్రాబ్లమ్ సార్ అని చెప్పడంతో రాజ్ డ్రైవర్‌ను తిట్టి కావ్యను తన కారులో వెళ్దామని చెప్పడంతో కావ్య రానని చెప్తుంది. దీంతో రాజ్, కావ్యపై కోప్పడటంతో రాజ్‌ను కావ్య తిడుతుంది. నేను ఇంటికి రావడం లేదని నేను నా పుట్టింటికి వెళ్తున్నానని చెప్పడంతో.. సరే అక్కడే డ్రాప్ చేస్తాను పద అనగానే కావ్య రాజ్ కారు ఎక్కి వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
తదుపరి ఎపిసోడ్ లో పుట్టింటికి వెళ్లిన కావ్య బాధతో ఉంటుంది. ఏమైందని కావ్యను కృష్ణమూర్తిని అడుగుతాడు. మీ అల్లుడుగారు ఇంకో అమ్మాయితో తిరుగుతున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు అని ఏడుస్తూ చెప్తుంది. ఇది విన్న మూర్తి, కనకం, అప్పు షాక్ అవుతారు.


Click it and Unblock the Notifications











