Brahmamudi February 14th రాజ్, శ్వేత బాగోతం గురించి తెలుసుకున్న ఇందిరాదేవి... కావ్య జీవితంలోకి కొత్త వ్యక్తి!

నేటి బ్రహ్మముడి సీరియల్ ఫిబ్రవరి 14వ తేదీన కనకం, మూర్తి బయట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాజ్‌, కావ్య వస్తారు. వారిని చూసిన కనకం అల్లుడు గారు వచ్చారు అని మూర్తికి చెబుతూనే కారు దగ్గరకు వెళ్తుంది. లోపలికి రమ్మని రాజ్‌ ను పిలుస్తుంది కనకం. కానీ పని ఉందని కావ్యను డ్రాప్‌ చేయడానికి వచ్చానని చెప్తాడు రాజ్‌. కనీసం కాఫీ అయినా తాగి వెళ్లండని కనకం రిక్వెస్ట్‌ చేస్తుంది. దీంతో కావ్య కోపంగా ఎందుకు బతిమాలుతున్నావని.. ఉండాలనుకునే వాళ్లు ఎలాగైనా ఉంటారని.. వెళ్లాలనుకున్నవాళ్లు ఎలా వెళ్లాలా? అని ఆలోచిస్తారని కోపంగా చెప్పి లోపలికి వెళ్తుంది.

రాజ్‌ కూడా తనకు టైం అవుతుందని చెప్పి వెళ్లిపోతాడు. లోపల కావ్య ఆలోచిస్తూ ఉంటే.. అక్క ఏమైందక్కా, ఏం జరిగందని అడుగుతుంది అప్పు. లోపలికి వచ్చిన కనకం... ఏం జరిగిందే అల్లుడుగారేమో అర్థం కానట్లు మాట్లాడి వెళ్లిపోయారు. నువ్వేమో మౌనంగా నిలబడ్డావని అడుగుతుంది. ఆయన మాటలే కాదమ్మా ఆయన ప్రవర్తన కూడా అర్థం కావడం లేదని కావ్య అంటుంది. అసలు ఏం జరిగిందమ్మా అని మూర్తి అడుగుతాడు. కావ్య ఏడుస్తూ మీ అల్లుడుగారు వేరే అమ్మాయితో తిరుగుతున్నారని చెప్తుంది.

February 14th 2024 Episode number 332 in Brahmamudi Telugu Serial

ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. తర్వాత అప్పు కోపంగా బావను నిలదీస్తానని వెళ్లబోతుంటే ఆపి వద్దని వారిస్తారు. దీంతో కోపంగా అప్పు తెలియక తప్పు చేస్తే సరిదిద్దొచ్చు.. కానీ తెలిసి తప్పు చేస్తే ఎలా సరిచేయగలం అని వాదిస్తుంది. అవసరవమైతే కోర్టుకు లాగాలని అప్పు అంటుంది. ఆయన నన్ను నమ్మించడానికి వేరే అమ్మాయితో తిరుగుతున్నట్లు నటించారని.. ఆయనకు నాతో కలిసి ఉండటమే ఇష్టం లేదని బాధపడుతుంది కావ్య.

అయితే ఇప్పుడు ఏం చేయాలనకుకుంటున్నావే అంటూ కనకం అడుగుతుంది. తెలియదన్నట్లు కావ్య చూస్తుంది. మరోవైపు దుగ్గిరాల ఇంట్లో అపర్ణ, అనామిక, రుద్రాణి, ధాన్యలక్ష్మీ హాల్లో కూర్చుని ఉంటారు. ఇంతలో రాజ్‌ ఆఫీసు నుంచి వస్తాడు. ఒక్క నిమిషం రాజ్‌ నీతో మాట్లాడాలి. మీరే వచ్చారు ఆ మహరాణి ఏది అని ధాన్యలక్ష్మి అంటుంది. కావ్యనా? అని రాజ్ అంటాడు. అవును ఈ ఇంటి పెద్ద కోడలని మీ అమ్మ తన నెత్తిన కీర్తి కిరీటాలు పెట్టింది. మన ఇంటి మహాలక్ష్మీ అని మీ నాన్నమ్మ ఆవిడ కోసం ఒక సింహాసనమే వేసింది. కనకపు సింహాసనం అని ధాన్యలక్ష్మి అంటుంది.

ఏమైంది నీకు అంత వెటకారంగా మాట్లాడుతున్నావేంటని ప్రకాష్ అంటాడు. ఏమైందా? ఎవరు ఏంటనేది అర్థమైంది. నాకే కాదు ఈ ఇంట్లో ఆడవాళ్లందరికీ అర్థం అయింది. మీ ముగ్గురికే అర్థం కాలేదని ధాన్యలక్ష్మి అంటుంది. ఏం జరిగిందో చెప్పు పిన్ని అని రాజ్ అంటాడు. ఏం లేదు రాజ్‌ మార్నింగ్‌ మీ అమ్మా కావ్యకు లాకర్‌ కీస్‌ ఇచ్చింది. తనేమో ఎవ్వరికీ చెప్పకుండా అందులోంచి రెండు లక్షలు తీసుకువెళ్లిందని రుద్రాణి అంటుంది.

February 14th 2024 Episode number 332 in Brahmamudi Telugu Serial

మీరు 5 లక్షలు ఇవ్వమని మనిషిని పంపిచినప్పుడే ఈ విషయం బయటపడింది బావగారని ధాన్యలక్ష్మి చెప్తుంది. ధాన్యలక్ష్మీ కావ్యను దొంగను చేసి మాట్లాడుతుంది. దీంతో రాజ్‌ కోపంగా ధాన్యలక్ష్మీని తిడతాడు. తనకు ఏ అవసరం వచ్చిందో తీసుకుని ఉండోచ్చని అంటాడు. దీంతో అందరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చివరికి కావ్యను ఈ ఇంట్లో ఎవరూ ఏమీ అడగొద్దని తెగేసి చెప్పి వెళ్లిపోతాడు రాజ్‌. సుభాష్ కూడా ధాన్యలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

మరోవైపు కావ్య ఏడుస్తుంటే ఈ సమస్యను ఎదురించి పరిష్కరించుకోవాలని అప్పు చెప్తుంది. అయితే ఎదిరించి సాధించుకోవడానికి ఇవి ఆస్తి హక్కులు కావని కావ్య చెప్తుంది. మరి ఎం చేద్దామని కనకం, మూర్తి అడగ్గానే నేను ఆయన జీవితంలోంచి తప్పుకోవాలనుకుంటున్నాను అంటుంది కావ్య. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి వచ్చి తప్పుకుని.. నువ్వు తప్పు చేసిన దానివి అవుతావా? అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ఇక తదుపరి ఎపిసోడ్ లో వాడికే తెలియకుండా వాడు నీ మీద ప్రేమ పెంచుకున్నాడు. ఆ ప్రేమ వెలికి తీయాలని ఇందిరాదేవి చెప్తుంది. కానీ ఎలాగో నాకు అర్థం కావడం లేదని కావ్య అంటుంది. నాకు అర్ధం అయిందని.. ముల్లును ముల్లుతోనే తీయాలనే సామేతఎలా పుట్టిందో గానీ... వాడు అమ్మాయిని అడ్డుపెట్టుకుని నిన్ను వదులుకోవాలి అనుకున్నట్లుగానే నువ్వు ఓ అబ్బాయిని అడ్డుపెట్టుకుని దూరం అయితున్నట్లు నటించాలని ఇందిరాదేవి చెప్తుంది. దీంతో కావ్య షాక్ అవుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X