Brahmamudi February 15th అనామిక, రుద్రాణి ప్లాన్‌కి స్వప్న ట్విస్ట్... కావ్య జీవితంలోకి బావ ఎంటర్!

నేటి బ్రహ్మముడి సీరియల్లో కావ్య ఏడుస్తూ రాజ్‌ జీవితంలోంచి తప్పుకుంటానని చెప్తుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్‌ అవుతారు. ఇంతలో ఇందిరాదేవి ఎంట్రీ ఇస్తుంది. నువ్వు తప్పుకుంటాననడంలోనే తప్పు ఉందని నువ్వెందుకు అలాంటి తప్పు చేస్తావని అడుగుతుంది. ఇందిరాదేవిని చూసిన కావ్య షాక్‌ అవుతుంది. లేచి అమ్మమ్మగారు అంటూ దగ్గరకు వెళ్తుంది. నువ్వు నీ స్నేహితురాలి కథ అంటూ నీ కథే చెప్తున్నావని నాకప్పుడే అర్థం అయ్యిందని ఇందిరాదేవి అంటుంది.

అందుకే నేను తొందరపడకుండా నీ సమస్యకు ఒక పరిష్కారం సూచించానని చెప్తుంది. నీకు పరిష్కారం దొరకలేదని సమస్యని మరింత పెద్దది చేసుకోవాలనుకుంటున్నావని... అది నేనెప్పటికీ సమర్థించను కావ్య అంటూ చెప్తుంది. ఎంత మంది దంపతులు సుఖంగా ఉన్నారు. ఎంత మంది సంతోషంగా ఉన్నారు. ఇంటింటి కిటికీ తెరచి చూస్తే లోపల కలిసి ఉండేవాళ్లు కొందరు సర్దుకుపోయేవాళ్లు కొందరు, పోట్లాడుకునే వాళ్లు కొందరు. కానీ వాళ్లంతా తప్పుకోవాలని అనుకోవడం లేదు కదా అన్ని కుటుంబాలు అలాగే ఉంటాయని నేను చెప్పడం లేదు. అభిప్రాయ బేధాలున్నా భార్యాభర్తల గురించే మాట్లాడుతున్నానని ఇందిరాదేవి చెప్తుంది.

February 15th 2024 Episode number 333 in Brahmamudi Telugu Serial

మీకు తెలియదు అమ్మమ్మగారు. ఆయనకు నేను అక్కర్లేదని కావ్య అంటుంది. అక్కర్లేదు అనుకున్నవాడు ఇంతకాలం ఎందుకు ఆగుతాడని ఇందిరాదేవి అంటుంది. ఇంట్లోని పరిస్థితులు ఆయన్ని ఆపుతున్నాయి తప్పా ఆయన నాతో కలిపి ఉంటానని ఏనాడు అనలేదు. అనుకోలేదు. కలిసే ఉంటున్నాడు కదా అని ఇందిరాదేవి అంటుంది. ఇది కూడా కలిసి ఉండటమేనని మీరనుకుంటున్నారా? అని కావ్య అంటుంది.

ఇలా కూడా కలిసి ఉండే భార్యాభర్తలు చాలా మందే ఉన్నారని అంటున్నాను. అలాగని నీ మనసు చంపుకుని నీ ఉనికిని నీ వ్యక్తిత్వాన్ని, నీ అస్థిత్వాన్ని వదులుకుని బానిసలా పడుండమని చెప్పడం నా ఉద్దేశం కాదని ఇందిరాదేవి చెప్తుంది. ఒక మాట అడుగుతాను చెప్పు వాడి మనసులో నువ్వు లేవని ఎందుకు అనుకుంటున్నావని నిలదీస్తుంది. ఉన్నానని ఎలా అనుకోవాలి అమ్మమ్మ.. నన్ను వదిలించుకోవాడానికి వేరే దారి లేక ఇంకో అమ్మాయిని అడ్డుపెట్టుకుంటున్నారని కావ్య అంటుంది.

కానీ ఆ అమ్మాయితో వాడు ఎలాంటి తప్పుడు సంబంధం పెట్టుకోలేదు కదా? అని ఇందిరాదేవి అంటుంది. అవకాశం ఉన్నా పరాయి స్త్రీని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచాడని నీకు అర్థం అయ్యింది కదా? అది వాడి వ్యక్తిత్వమని చెప్తుంది. మీరు చెప్పేవన్నీ నిజమే అమ్మమ్మగారు కానీ నేను ఎందుకు వద్దు? ఏం తప్పు చేశాను. నాకు అందం లేదా? చదువు లేదా? ఎవరితో ఎలా నడుచుకోవాలో వివేకం లేదా? గదిలో అంత బాధ అనుభవిస్తున్న బయటికి వస్తే ఎవ్వరికీ చెప్పుకోలేనంత విజ్ఞత లేదా? అని ప్రశ్నిస్తుంది కావ్య.

ఇందులో నీ తప్పేం లేదని ఇందిరాదేవి అంటుంది. అందుకే నేను తప్పుకోవాలనుకుంటున్నాను. అప్పుడైనా ఆయన ప్రశాంతంగా ఉంటాడేమోనని చెప్తుంది కావ్య. ఉండలేడు. నిన్ను శాశ్వతంగా దుఃఖంలో ముంచేసి అక్కడ వాడు సుఖంగా ఎలా ఉంటాడనుకున్నావమ్మా? పిచ్చివాడైపోతాడు నువ్వు లేకపోతే.. వాడది గుర్తించడం లేదు అంతే అని చెప్తుంది ఇందిరాదేవి అంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో మీరే చెప్పండి అమ్మా.. అటు దేవుణ్ని తప్పు పట్టలేక.. ఇటు కన్న మమకారం వదులుకోలేక మా పరిస్థితి ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండని మూర్తి అడుగుతాడు.

February 15th 2024 Episode number 333 in Brahmamudi Telugu Serial

సహనం వహించాలి. వాడి మనసులో తొక్కి పెట్టిన ప్రేమను బయటకు తీసుకొచ్చేంత వరకు ఓపిక అవసరమని ఇందిరాదేవి చెప్తుంది. మీలాంటి వారి సిఫార్సులతో మనసులో ప్రేమ బయటకు వస్తుందా? అసలు ఆయనకు నామీద ప్రేమ లేదు కదా అని కావ్య అంటుంది. నీ మీద వాడికి ప్రేమ ఉందమ్మా.. కానీ అది ఒప్పుకోవడానికి ఇంగ్లీష్‌లో ఏదో అంటారే ఈగో అడ్డోస్తుందని చెప్తుంది ఇందిరాదేవి. ఇలా మొత్తానికి కావ్యను ఇందిరాదేవి కన్వీన్స్‌ చేస్తుంది.

వాడొక అమ్మాయిని అడ్డం పెట్టుకుని నిన్ను వదులుకోవాలనుకున్నట్లే నువ్వు ఒక అబ్బాయిని అడ్డం పెట్టుకుని దూరం అయిపోతున్నట్లు నటించాలని ఇందిరాదేవి కావ్యకు సలహా ఇస్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు. నీ వెనుక నేనుంటాను కాబట్టి నీ శీలం మీద మచ్చ పడనివ్వను అంటుంది. దీంతో మూర్తి కూడా ఈ ప్రయత్నాన్ని ఒప్పుకోమని కావ్యకు సలహా ఇస్తాడు. దీంతో కావ్య సరే అంటుంది. అయితే మూర్తి తన అక్క కొడుకు వస్తున్నాడని వాడినే సాయం అడుగుతే చేస్తాడని చెప్పడంతో అందరూ ఓకే అంటారు.

దుగ్గిరాల ఇంట్లో అందరూ ఫీలవుతుంటారు. ఇంతలో ఇందిరాదేవి, కావ్య ఇంటికి వస్తారు. ధాన్యలక్ష్మీ, రుద్రాణి ఒక్కసారిగా కావ్యపై తిట్లపురాణం మొదలుపెడతారు. దీంతో ఇందిరాదేవి వాళ్లను తిడుతుంది. అయితే రెండు లక్షలు పోయిన విషయం చెప్తుంది ధాన్యలక్ష్మీ. దీంతో షాక్‌ అయిన ఇందిరాదేవి డబ్బుల గురించి అపర్ణను అడుగుతుంది. దీంతో అపర్ణ సీరియస్‌గా పూచిక పుల్లకు కొరగాని వాళ్లకు ఇలా మాట్లాడే అవకాశం ఇవ్వడం కరెక్ట్‌ కాదని చెప్పడంతో ఇంతలో స్వప్న బయటి నుంచి వస్తూ గట్టిగా ఆపండి అంటూ అరుస్తుంది.

లోపలికి వచ్చి రుద్రాణి, ధాన్యలక్ష్మీలను తిట్టి అపర్ణ దగ్గరకు వెళ్లి సారీ చెప్పి.. ఇంత పెద్ద నింద పడటంతో కావ్య షాక్‌ అయినట్లుందని ఆ రెండు లక్షలు కావ్య నాకు ఇచ్చిందని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. తర్వాత ఎపిసోడ్ లో రాజ్ తో కావ్య మీకు ఒక సర్ ప్రైజ్ ఉంటుందని చెప్తుంది. దాంతో ఏంటది అని అడిగితే సర్ ప్రైజ్ రేపు పొద్దున్నే తెలుస్తుందని చెప్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X