Brahmamudi February 16th రుద్రాణి కొంపముచ్చిన స్వప్న... రాజ్‌కు కావ్య షాకింగ్ సర్ ప్రైజ్!

నేటి బ్రహ్మముడి సీరియల్లో షాపింగ్‌ చేసుకుని ఇంట్లోకి కోపంగా వచ్చిన స్వప్న రుద్రాణి, ధాన్యలక్ష్మీని తిడుతుంది. ఆ తర్వాత అపర్ణకు సారీ చెప్తుంది. కావ్య ఆ రెండు లక్షలు తనకే ఇచ్చిందని అంటుంది. దీంతో కావ్యతో సహా అందరూ షాక్‌ అవుతారు. ఇంతలో రుద్రాణి కోపంగా ఈ షాపింగ్‌ అంతా అదేనా తీసుకున్న రెండు లక్షలు ఇష్టం వచ్చినట్లు ఖర్చుపెట్టుకుని వచ్చావా? అంటూ కోపంగా నిలదీస్తుంది.

దేవుడు మీ ఇద్దరికి నోళ్లు ఇచ్చి బ్రెయిన్‌ ఇవ్వడం మర్చిపోయాడని స్వప్న అంటుంది. మా కావ్యకి బ్రెయిన్‌ ఇచ్చి నోరు ఇవ్వడం మర్చిపోయాడని చెప్తుంది. పూర్తిగా చెప్పకుండా ఎవరెవరు అడ్డు పడదలచుకున్నారో వాళ్లంతా బయటకు వెళ్లండని ఇందిరాదేవి అంటుంది. కావ్య రెండు లక్షల నాకే ఇచ్చింది. తను ఆఫీసుకు వెళ్తున్నందుకు ఇంట్లో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే ఇవ్వమని చెప్పింది. అందుకే అవి నేనే భద్రంగా దాచానని స్వప్న చెప్తుంది.

February 16th 2024 Episode number 334 in Brahmamudi Telugu Serial

స్వప్న చెప్పగానే రుద్రాణి అబద్దం అని చెప్తుంది. అయితే నిజం ఏంటని చెప్పమని స్వప్న అడగ్గానే రుద్రాణి నోరు మూసుకుంటుంది. ఇంతలో స్వప్న పైకి వెళ్లి రెండు లక్షలు తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అపర్ణ కోపంగా ధాన్యలక్ష్మీని నిలదీస్తుంది. ప్రకాష్‌ ధాన్యలక్ష్మీని తిట్టి లోపలకి వెళ్లమంటాడు. లోపలికి కోపంగా వెళ్తున్న రుద్రాణి వెనకాల రాహుల్‌ వెళ్లి రుద్రాణిని వెటకారంగా మాట్లాడతాడు. స్వప్నకు కనిపించేలా డబ్బు ఎందుకు దాచావని అడుగుతాడు.

దానికి కనిపించేలా ఎందుకు దాస్తానని కంగారుగా బీరువా తెరచి చూస్తుంది రుద్రాణి. అందులో తాను దాచుకున్న 5 లక్షలు కొట్టేసిందని ఇద్దరూ బాధపడుతారు. ఇంతలో స్వప్న వస్తుంది. ఏంటి నిజం తెలిసిపోయిదా? మీకు నేనే కరెక్టు. ఏ పాపం తెలియని నా చెల్లిని దొంగను చేయాలని చూశారుగా అందుకే ఐదు లక్షల్లోంచి రెండు లక్షలు తీసి వాళ్లకి ఇచ్చేశానని చెప్తుంది. మరి మూడు లక్షలు? అని రుద్రాణి అంటుంది.

ఇంకెక్కడి మూడు లక్షలు ఇందాకా మోసుకొచ్చిన క్యారీబ్యాగ్స్‌ ఏమనుకుంటున్నారు. వాటి నిండా షాపింగ్‌ చేసి మూడు లక్షలు ఖర్చు పెట్టానని చెప్తుంది స్వప్న. ఏయ్‌ ఇప్పుడే వెళ్లి జరిగిందంతా అందరితో చెప్పేస్తానని రుద్రాణి అంటుంది. అనగానే ఇదొక్కటే కాదు ఆ ఐదు లక్షల గురించి మీరు కొట్టేసిన రెండు లక్షల గురించి కూడా చెప్పు వాటికి లెక్కలు చెప్పు అంటూ స్వప్న బెదిరించడంతో రుద్రాణి, రాహుల్‌ షాక్‌ అవుతారు.

February 16th 2024 Episode number 334 in Brahmamudi Telugu Serial

మీరు నా చెల్లి విషయంలో జోక్యం చేసుకుంటే మీకిలాగే ఉంటుందని స్వప్న అంటుంది. జాగ్రత్త అంటూ హెచ్చరించి వెళ్లిపోతుంది. బయటకు వచ్చిన స్వప్నను కావ్య వచ్చి హగ్‌ చేసుకుని నాకు చాలా హెల్ఫ్‌ చేశావు అంటూ హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు హాల్లో తదేకంగా రాజ్‌ను చూస్తూ ఉంటుంది ఇందిరాదేవి. పైకి ఇంక మంచిగా కనబడతాడు వీడా కాపురాన్ని పాడుచేసుకునేది అని మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్‌ దగ్గరకు వచ్చి ఏంటి నాన్నమ్మ అలా చూస్తున్నావని అడుగుతాడు.

రేయ్‌ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా? అని ఇందిరాదేవి అడుగుతుంది. దేని గురించి నాన్నమ్మ అని అంటాడు రాజ్. నీ కాపురం గురించి అని అంటుంది. అదేంటి నాన్నమ్మ పెళ్లైన ఇన్ని రోజులకు ఈ ప్రశ్న వేస్తున్నావని రాజ్ అంటాడు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదురా అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతేనే ఎదురు ప్రశ్న వేస్తారు. పెళ్లైన ఇన్ని రోజులకు కూడా నీ కాపురం చక్కబడినట్లు లేదు. అందుకే అడుగుతున్నానని అంటుంది.

అసలు నీకెందుకు ఆ అనుమానం వచ్చిందని రాజ్ అంటాడు. కావ్య ఇంతకు ముందులా లేదని మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది. అంటూ ఇందిరాదేవి నిలదీయడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. ఇంతలో కావ్య కిచెన్‌ లోంచి వస్తుంటే పిలిచి నాన్నమ్మకు మనమీద అనుమానం వచ్చిందట అంటూ లేని ప్రేమను ఉన్నట్లు నాటకమాడటంతో ఇందిరాదేవి, కావ్య నవ్వు కుంటారు. రాజ్‌ పైకి వెళ్తాడు. వాడు నాతోనే నాటకాలు ఆడుతున్నాడు.

నువ్వు నాటకం ఆడటంలో తప్పేం లేదు. నువ్వు వెంటనే తెర తియ్యి నీ వెనకాల నేనుంటాను అని ఇందిరాదేవి చెప్తుంది. పైకి వెళ్లిన రాజ్‌ రూంలోకి కావ్య రావడం చూసి గట్టిగా శ్వేతతో ప్రేమగా మాట్లాడుతున్నట్లు నటిస్తాడు. శ్వేతతో మీరు బాగా మాట్లాడుకోండి నేను మిమ్మల్ని డిస్టర్బ్‌ చేయను. కావాలంటే నేను బయటకు వెళ్లి పడుకుంటానని కావ్య అంటుంది. మనలో మనకు దాపరికాలు ఎందుకు మీరు క్లియర్‌గా చెప్పారని అంటుంది.

నేను అర్థం చేసుకున్నానని బెడ్‌ షీట్స్‌ తీసుకుని బయటకు వెళ్తూ.. నేను బయట పడుకుంటే అందరికీ అనుమానం వస్తుంది. మీ ఇద్దరికీ పెళ్లై నేను మా ఇంటికి ఆటోలో వెళ్లేదాకా ఇక్కడే పడుకుంటాను అని కావ్య చెప్పడంతో రాజ్‌ షాక్‌ అవుతాడు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది. ఆ తర్వాతి ఎపిసోడ్ లో రాజ్ కు కావ్య సర్ ప్రైజ్ ఇస్తాను అని చెప్తుంది. రాత్రంతా దాని గురించి ఆలోచిస్తూ నిద్రపోడు.

తెల్లారి లేచి కావ్యను అడుగుతాడు. సర్ ప్రైజ్ ఏంటని.. ఇంతలో ఇందిరాదేవి వస్తుంది. ఇంకా అలాగే ఉన్నవ్ ఏంటి సర్ ప్రైజ్ ఇవ్వాలి కదా రెడీ అవ్వాలని చెప్తుంది. రాజ్ వచ్చి నానమ్మ నీకు సర్ ప్రైజ్ గురించి తెలుసా అంటే.. తెలుసు అంటుంది. ఏంటది అని అడిగితే సర్ ప్రైజ్ అంటుంది. ఇంతలో కావ్య రెడీ అయి వస్తుంది. ఎయిర్ పోర్టుకు పోవాలి అని చెప్తుంది. కావ్య సిగ్గుపడుతూ ఉంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X