Brahmamudi February 19th ఇంట్లో పెత్తనం కోసం ధాన్యలక్ష్మి, అనామిక రచ్చ... కావ్య బావ కోసం రాజ్ వెయింటింగ్!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ఫిబ్రవరి 19న తేదీన అనామిక షాపింగ్ వెళ్దామంటే కార్డ్స్ వదిన దగ్గర ఉన్నాయి అని చెప్పడంతో కోపంతో ఊగిపోతుంది. అనామిక.. ధాన్యలక్ష్మి దగ్గరకు వెళ్లి రెచ్చగొడుతుంది. ఆమె ఆఫీసుకు వెళ్తుంది కదా నీ దగ్గరైన తాళాలు పెట్టుకోండి లేదంటే నాకైనా ఇవ్వండి ఏదో ఒకటి తేల్చండి అని అంటుంది. దీంతో ధాన్యలక్ష్మి ఆవేశంతో కోడలిని లాక్కొని హాల్లోకి వస్తుంది. అపర్ణ ఏంటి అని అడుగుతుంది. నేను, నా కోడలు, మా ఆయన, నా కోడుకు ఇంటి పనులు చేస్తారంటూ వెటకారంగా మాట్లాడుతుంది.
నీ కోడలు మాత్రమేనా నా కోడలు ఈ ఇంటి కోడలు కాదా అని ధాన్యలక్ష్మి అడుగుతుంది. ఇప్పుడు ఏమైందని అపర్ణ, ఇందీరాదేవి అడుగుతుంది. కావ్యను మాత్రమే ఈ ఇంటికోడలుగా చూస్తున్నారని ధాన్యలక్ష్మి అంటుంది. దుగ్గిరాల వంశంలో పెద్దకోడలికే పీఠం వేస్తారా అని అడుగుతుంది. దీంతో ప్రకాశం కలుగజేసుకుని పుట్టింటికి పంపిచేస్తా అంటూ ఫైర్ అవుతాడు. సుభాష్ ఏమైందని అడుగుతాడు. మీకు ఎందులో తక్కువ చేశారు ఏమైందని అడుగుతాడు. నీకు అన్ని హక్కులు, అధికారులు ఉంటాయని అంటాడు.

అనామిక కల్యాణ్ ను షాపింగ్ తీసుకువెళ్లమని చెప్పిందట. అయితే కార్డ్స్ కల్యాణ్ దగ్గర ఉన్నాయంట. ప్రతిదీ కావ్యను అడిగి తీసుకోవాలా అని ధాన్యలక్ష్మి అంటుంది. కల్యాణ్ మాట్లాడుతూ... నాకంటూ ఖర్చులు ఉండవని కార్డ్స్ లాకర్లో పెట్టమని నేనే పెద్దమ్మకు ఇచ్చాను. ఇప్పుడు ఆ తాళాలు కావ్య వదిన దగ్గర ఉన్నాయి. నేను అడిగి తీసుకువస్తాను అని చెప్పాను. ఈలోపే అత్త కోడాళ్లు ప్రపంచం మునిగిపోయినట్లు చేశారు అంటూ చెప్పుకువస్తాడు.
ధాన్యలక్ష్మి.. చివరకు నా కోడలకు బాధ్యతలు అప్పగించమని అడుగుతుంది. అది విని ఇంట్లో వారంతా షాక్ అవుతారు. దీంతో స్వప్న కూడా ఫైర్ అవుతుంది. అదండి విషయం.. ఇంట్లోని బాధ్యతల కోసం ఇంత చేశారు.. నిన్న కాక మొన్న వచ్చిన పిల్లకాకి అనామికకు ఇంటి బాధ్యతలు అప్పగించాలా వెటకారంగా మాట్లాడుతుంది. ధాన్యలక్ష్మికి గట్టిగానే స్వప్న గడ్డిపెడుతుంది. అపర్ణ కూడా ఇవ్వడం కుదరదని చెప్పి పంచాయితీకి చెక్ పడుతుంది.
కల్యాణ్ కు చివరగా నీ కార్డ్స్ నీ దగ్గరే పెట్టుకో.. ఎంతైనా ఖర్చు పెట్టుకో నీ పెళ్లాం చేతిని నువ్వే పట్టుకుని తిరుగు... మీ అమ్మ చేతికి అప్పగించకు అని అపర్ణ చెప్తుంది. ఇక మరోవైపు ఆఫీసుకు రాజ్ వెళ్లి కావ్య కోసం ఎదురు చూస్తు ఉంటాడు. బావ వస్తున్నాడు అంటూ వెళ్లి రెండు గంటలు దాటింది. ఇంకా రావడం లేదు. శృతిని పిలిచి అడుగుతాడు. కావ్య ఎందుకు రాలేదు అని. నాకు తెలియదు అని శృతి చెబుతుంది.

తెలుసుకునే బాధ్యత లేదా అని రాజ్ సిరీయస్ అవుతాడు. ఇంతలో శ్వేత కూడా వస్తుంది. ఎయిర్ పోర్టుకు వెళ్లి 3 గంటలు దాటింది ఇంకా రాలేదు అని రాజ్ అనుకుంటాడు. రాని వచ్చాక చెప్తా దాని సంగతి అని అనుకుంటాడు. మరోవైపు అనామిక, కల్యాణ్ షాపింగ్ వెళ్తుంటారు. ఇంతలో అప్పు బైక్ మీద వస్తుంటే.. ఎదురుగా వీరి కారు వచ్చి గుద్దబోతుంది. సీరియస్ గా అనామిక, అప్పు గొడవపడుదామని అనుకుంటారు.
ఒకరినొకరు చూసి షాక్ అవుతారు. బ్రో అంటూ కల్యాణ్ మాట్లాడుతాడు. అనామిక మాత్రం వెటకారంగా మాట్లాడుతుంది. పదా వెళ్దాం అని కల్యాణ్ అంటే.. అప్పుతో మాట్లాడి వస్తానువ్వు వెళ్లు అని చెప్తుంది అనామిక. దీంతో కారులో కూర్చుంటాడు కల్యాణ్. అనామిక రెచ్చిపోయి మాట్లాడుతుంది. దీంతో అప్పుకు కోపం వచ్చి... ఇప్పుడు కూడా కల్యాణ్ ను నేను సొంతం చేసుకోవాలి అనుకుంటే ఎంతో సమయం పట్టదు.. కల్యాణ్ మంచివాడు.. సరిగ్గా కాపురం చేసుకో అని చెప్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. తదుపరి ఎపిసోడ్ లో కావ్య బావ కారులోంచి దిగుతాడు. రాజ్ కూడా దొంగచాటుగా చూస్తుంటాడు.


Click it and Unblock the Notifications










