Brahmamudi February 1st శ్వేతతో సీక్రెట్ రిలేషన్ గురించి అడిగిన కావ్య.. విడిపోదామంటూ షాకిచ్చిన రాజ్
రాజ్, శ్వేతలను చూసి కావ్య ఏడుస్తూ.. ఇంటికి బయలుదేరుతుంది. ఇక ఇంటికి రాగానే.. అనామిక వచ్చి.. కాశ్మీరీ పులావ్ నేర్పించమని అడుగుతుంది. కల్యాణ్ చెప్పాడు.. నువ్వు బాగా చేస్తావ్ అని.. నాకు నేర్పించవా అంటూ విసిగిస్తుంది. అసలే బాధలో వచ్చిన కావ్య... డల్ గా పైకి వెళ్లిపోతుంది. ఇక చేయి పట్టుకుని లాగి.. కిచెన్ ఇటువైపు ఉంటే.. అటు వెళ్తావ్ ఏంటి అంటూ రచ్చ చేస్తుంది. ఈ పూటకి నువ్వే ఏదో ఒకటి చేసి పెట్టు అని కావ్య చెప్తుంది.
అదేంటక్కా కళ్యాణ్ నీకు అన్నింట్లో సపోర్ట్ చేస్తాడు నువ్వు ఈ ఒక్క చిన్నదానికి సహాయం చేయలేవా అంటుంది అనామిక. ఒక అరగంటే కదా ఆ మాత్రం స్పెండ్ చేయలేవా అక్కా అని అడుగుతుంది. అనామిక ఒక్కసారి చెబితే నీకు అర్థం కాదా? అని కావ్య సిరీయస్ అవుతుంది. నాకిప్పుడు వంట చేసే మూడ్ లేదని చెప్తుంది. అలసిపోయాను. అర్థం చేసుకోవేంటి? అందరికీ నేనొక వంటలక్కను అయిపోయానని ఫైర్ అవుతుంది.

ఇక కావ్య కోపంగా అరిచి పైకి వెళ్లబోతుంటే ఇదంతా గమనిస్తున్న ధాన్యలక్ష్మీ కోపంగా కావ్య దగ్గరకు వస్తుంది. ఇది కదా నాకు కావాల్సిందని అనామిక మనసులో అనుకుంటుంది. కావ్య దగ్గరకు వచ్చిన ధాన్యలక్ష్మీ నా కోడలు మీద ఎందుకు అరిచావని అడుగుతుంది. తనేమైనా ఆస్తులు అడిగిందా? అంటూ ఫైర్ అవుతుంది. ఒక్కరోజు ఆఫీసుకు వెళ్లిరాగానే ఇంత అహంకారం పెరిగిపోయిందా అంటూ తిడుతుంది.
ఇక ధాన్యలక్ష్మి మీద కూడా కావ్య ఫైర్ అవుతుంది.దీంతో అపర్ణ కూడా వచ్చి... నా కోడలు ఇంటి పనిమనిషిలా ఉందా? అంటూ ప్రశ్నిస్తుంది. కావ్య ఆఫీసులో అలసిపోయి వచ్చిందేమో ఆ మాత్రం దానికి ఇంత గొడవ చేయాలా అని అంటుంది. ఇకనుంచి నువ్వు నీ కోడలే ఇంట్లో వంట చేయాలని చెప్తుంది. కావ్యను వెళ్లి రెస్ట్ తీసుకో అని చెప్తుంది. పైకి వెళ్లిన కావ్య చీకటి రూంలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. రాజ్, శ్వేతల గురించి ఆలోచిస్తుంది.

ఇంతలో కళ్యాణ్ వచ్చి ఏం జరిగిందని కావ్యను అడుగుతాడు. దీంతో కావ్య నిజం చెప్తుంది. దీంతో మీరు ఇలా ఏడుస్తూ కూర్చోకూడదు. పరిస్థితి చేజారిపోకముందే మీరు తొందరపడాలని కల్యాణ్ చెప్తాడు. తర్వాత కళ్యాణ్ హాల్లో అటు ఇటు తిరుగుతుంటే ఇంతలో రాజ్ వస్తాడు. ఏంట్రా ఇక్కడ తిరుగుతున్నావని రాజ్ అడిగితే.. నువ్వు బయట తిరుగుతున్నావని నేను ఇక్కడ తిరుగుతున్నానని చెప్పి వెళ్లిపోతాడు. రాజ్ ఏంటి వీడు అనుకుంటూ పైకి వెళ్లిపోతాడు. రూంలోకి వెళ్లగానే కావ్య అదో రకంగా చూస్తుంటుంది.
ఏయ్ ఏంటా చూపు అసలు ఏమైంది మీ అందరికీ..కిందేమో కళ్యాణ్ గాడు కళ్లల్లోనే కత్తులు చూపించాడు. నువ్వేమో చూపులతోనే చంపేసేలా ఉన్నావని రాజ్ అనగానే కావ్య వెళ్లి డోర్ ను కాలితో తన్ని మూస్తుంది. ఓసేయ్ తలుపును తన్నరే మూస్తారు. అయినా రాగానే మొదలు పెట్టాల్సింది నేను కదా నువ్వు మొదలు పెడతావేంటి? అని అంటాడు. నేను ఆఫీసు నుంచి డైరెక్టుగా ఇంటికి వచ్చాను కానీ మీరెక్కడికి వెళ్లారు. అంటూ నిలదీస్తుంది కావ్య. ఇవన్నీ అడగటానికి నువ్వెవరు అంటాడు రాజ్. మీరు తాళి కట్టిన మీ భార్యను.. శ్వేతను కాదు అంటూ కావ్య అనడంతో రాజ్ షాక్ అవుతాడు.

దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఏదో ఒకరోజు మనం విడిపోవాల్సిన వాళ్లమే అంటూ రాజ్ వార్నింగ్ ఇస్తాడు. దీంతో మరోసారి కావ్య షాక్ అవుతుంది. ఎందుకు విడిపోవాలో కారణం చెప్పండని నిలదీస్తుంది. దీంతో ఎపిసోడ్ అయిపోతుంది. తర్వాతి ఎపిసోడ్ లో నువ్వు ఎందుకు వద్దో కారణాలు రాసి చూపిస్తా అంటూ రాజ్ బోర్డ్ మీద రాస్తుంటాడు.


Click it and Unblock the Notifications











